అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

అమర్ అక్బర్ ఆంటోని రివ్యూ

 


తెలుగు చిత్రసీమలో విజయవంతమైన కాంబినేషన్స్‌లో హీరో రవితేజ, దర్శకుడు శ్రీనువైట్లలది ఒకటి. వీరిద్దరి కలయికలో రూపొందిన నీకోసం, వెంకీ, దుబాయ్‌శీను చిత్రాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. సుదీర్ఘ విరామం తర్వాత వీరు కలిసి చేసిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోనీ. కొంతకాలంగా రవితేజతో పాటు శ్రీనువైట్ల పరాజయాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇద్దరి కెరీర్‌కు ఈ చిత్రం కీలకంగా మారింది.

ఆనంద్‌ప్రసాద్, సంజయ్ ప్రాణమిత్రులు. భార్యాపిల్లలతో అమెరికాలో స్థిరపడతారు. ఫిడో అనే ఫార్మాకంపెనీకి అధిపతులైన వారు తమ సంస్థలోనే పనిచేసే నలుగురు ఉద్యోగులను(తరుణ్ అరోరా, విక్రమ్ జీత్, ఆదిత్యమీనన్, రాజ్‌వీర్) వాటా దారులుగా చేర్చుకుంటారు. పైకి మంచి వారుగా నటిస్తూనే స్నేహితులిద్దరిని చంపి కంపెనీ హస్తగతం చేసుకుంటారా నలుగురు. ఈ ప్రమాదంలో ఆనంద్‌ప్రసాద్ తనయుడు అమర్(రవితేజ), సంజయ్ కూతురు ఐశ్వర్య(ఇలియానా) ప్రాణాలతో బయటపడతారు. తన కుటుంబాలను బలి తీసుకున్న వారిపై పగను పెంచుకున్న అమర్ ఒక్కొక్కరిని హతమారుస్తుంటాడు. ఈ ప్రయత్నంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనుకోని పరిస్థితుల్లో బాల్యంలోనే ఐశ్వర్యకు దూరమైన అమర్ తిరిగి ఆమెను ఎలా కలుసుకున్నాడు? అన్నదే ఈ చిత్ర కథ.

ప్రతీకారంతో ముడిపడిన కథ ఇది. ఈ పాయింట్‌కు స్లిట్ పర్సనాలిటీ అనే మానసిక వ్యాధిని జోడించి దర్శకుడు శ్రీనువైట్ల ఈ సినిమాను తెరకెక్కించారు. మానసిక సమస్య కారణంగా ఒకే వ్యక్తి ముగ్గురు భిన్నమైన మనుషులుగా ప్రవర్తించడమనే అంశం నుంచి వినోదాన్ని, ఉత్కంఠతను రాబట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే రొటీన్ రివేంజ్ డ్రామాతో కథను రాసుకోవడం, కథనంలో క్లారిటీ లోపించడంతో ఈ చిత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా నిలిచింది. తెలిసిన కథను కొత్తగా చెప్పినప్పుడే ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. శ్రీనువైట్ల ఆ దిశగా అడుగులు వేయలేదు. హీరోతో పాటు విలన్ పాత్రలను బలంగా రాసుకోలేదు. దానికి తోడు విలన్‌ను రవితేజ చంపే సన్నివేశాలన్ని ఊహాతీతంగా సాగడం మైనస్‌గా మారింది.

నాయకానాయికల మధ్య ప్రేమకథను హృద్యంగా ఆవిష్కరించే అవకాశం ఉండి కూడా అనవసరపు కామెడీ ట్రాక్‌లకే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. రవితేజతో పాటు ఇలియానా ఇద్దరూ మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు చూపించారు. కథలో ఆ అంశాన్ని అంతర్భాగంగా చూపించడంలో శ్రీనువైట్ల తడబడ్డారు. దాంతో ఆ సన్నివేశాలన్నీ గందరగోళానికి గురిచేస్తాయి.

కామెడీని పండించడంలో శ్రీనువైట్ల సిద్ధహస్తుడు. వినోదాన్ని నమ్మి ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ పెద్ద విజయాల్ని సాధించాయి. గత సినిమాల్లో వర్కవుట్ అయినా వినోదం ఈసినిమాలో లోపించింది. వాటా పేరుతో అమెరికాలోని తెలుగు సంఘాలపై విమర్శలు గుప్పిస్తూ శ్రీనివాసరెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు, సత్యలతో చేసిన కామెడీ సన్నివేశాల్లో ఒకటి రెండు మినహా పెద్దగా నవ్వించలేకపోయాయి. సునీల్ కామెడీ టైమింగ్, పంచ్ డైలాగుల్లో మునుపటి మ్యాజిక్ కనిపించలేదు.

మూడు భిన్న పార్శాలున్న పాత్రలో రవితేజ చక్కటి నటనను ప్రదర్శించారు. అమర్ పాత్ర భావోద్వేగభరితంగా సాగగా, అక్బర్ మాస్ పంథాలో, ఆంటోనీ క్లాస్ టచ్‌తో కూడి ఉంటుంది. మూడు పాత్రల్లో ఒదిగిపోయారు. సుదీర్ఘ విరామం తర్వాత ఈసినిమాతో తెలుగులో పునరాగమనం చేసింది ఇలియానా. అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటించింది. ఆమె పాత్ర మరింత శక్తివంతంగా ఆవిష్కరిస్తే బాగుండేది. ప్రతినాయకులుగా తరుణ్ అరోరా, విక్రమ్ జీత్, ఆదిత్యమీనన్, రాజ్‌వీర్‌ల నటన, పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి. పోలీస్ అధికారిగా అభిమన్యుసింగ్ పాత్రలో అతి ఎక్కువగా కనిపిస్తుంది.
సాంకేతికంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు చెప్పిన కథను నమ్మి అమెరికాలో భారీ హంగులతో ఈసినిమాను తెరకెక్కించారు. వెంకట్.సి. దిలీప్ ఛాయాగ్రహణం బాగుంది. తమన్ బాణీల్లో ఆకట్టుకోలేదు.

దర్శకుడిగానే కాకుండా కథకుడిగా శ్రీనువైట్ల ఈ సినిమాతో నిరాశపరిచారు. నవ్యమైన ఇతివృత్తాలకు పట్టం కడుతున్న ప్రస్తుతం తరుణంలో ఇలాంటి మూసధోరణితో కూడిన ప్రతీకార కథ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం కొంత కష్టమేనని చెప్పవచ్చు.


PostedOn: 16 Nov 2018 Total Views: 120
'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో ...

'బిగ్‌బాస్ 3' కంటెస్టెంట్స్.. లిస్ట్‌లో రేణు దేశాయ...

తెలుగు బిగ్‌బాస్ 3కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్‌లో గానీ, జూలైలో గానీ ఈ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్‌ వీరేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అందులో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కంటెస్టెంట్ గా ఉండబోతున్నారట. ఇదే సమయంలో టీవీ యాంకర్ ...

21 May 2019

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెర...

క్రైౖమ్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన 'క...

విజయ్ ఆంటోనీ, యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రల్లో న‌టించిన తాజా తమిళ చిత్రం ‘కొలైగార‌న్’. ఆండ్రూ లూయిస్ దర్శకుడు. అషిమా క‌థానాయిక‌. దియా మూవీస్‌ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్‌&nda...

21 May 2019

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

దుబాయ్‌లో షూటింగ్ చేయనున్న శేఖర్ కమ్ముల

తమన్నా, రానా వంటి చాలా మంది స్టార్ లకు బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక్కో సినిమాకి చాలా ఎక్కువ గ్యాప్ తీసుకుంటాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ మధ్యనే 'ఫిదా' అనే సినిమాతో మరొక సూపర్ హిట్ ను అందుకున్న శేఖర్ కమ్ముల తన తదుపరి సినిమా ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది శేఖర్ ...

21 May 2019

ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ...

ఆ సినిమా అయిష్టంగానే చేసాను అంటున్న విజయ్ దేవరకొండ...

తమిళంలో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ ఐశ్వర్య రాజేష్. యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య మెల్లగా హీరోయిన్ గా మారి మంచి పాపులారిటీ దక్కించుకుంది. తమిళంలో పెద్ద స్టార్స్ తో నటించిన ఈమె ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండతో నటించడానికి రెడి అవుతోంది. క్రాంతి మాధవ...

21 May 2019

అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ...

అభిమానులకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రభాస్..

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మల్టీ కోర్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమధ్య విడుదలైన ఈ చిత్రం మేకింగ్ వీడియోలు రెండు ...

21 May 2019

మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా

మహేష్ బాబు సినిమా ఎన్టీఆర్ సినిమా కాపీనా

ఈ మధ్యనే 'భరత్ అనే నేను' సినిమా తో బ్లాక్బస్టర్ అందుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా 'మహర్షి' అనే సినిమాతో మరో హిట్ ను నమోదు చేసుకున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా తరువాత మహేష్ బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్...

20 May 2019

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్...

అలాంటి సినిమాల్లో మాత్రమే నటిస్తా అంటున్న దేవిశ్రీ...

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సినిమా వేడుకల్లో స్టేజ్ పైన పాడుతూ డాన్స్ చేయడమే కాకుండా కొన్ని సినిమాలలో కూడా తెరపై కనిపించాడు. అయితే రాక్ స్టార్ గా ఎదిగిన దేవిశ్రీ ఒకటో రెండో సినిమాల్లో మాత్రమే వెండి తెరపై కనిపించాడు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'అత్తారింటికి దారేది' సినిమాలో ఒక పాటలో త...

20 May 2019

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమ...

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమూర్తి.. ది...

కె.స్‌.రామారావు, భీమనేనిల 'కౌసల్య కృష్ణమూర్తి.. ది క్రికెటర్‌' షూటింగ్‌ పూర్తినటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌, ఐశ్వర్యా రాజేష్‌, కార్తీక్‌ రాజు, వెన్నెల కిషోర్‌ ముఖ్య పాత్రల్లో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ప్రొడక్షన్&zwn...

20 May 2019