100 కోట్లు రాబట్టేసిన '2.ఓ' హిందీ వెర్షన్

100 కోట్లు రాబట్టేసిన '2.ఓ' హిందీ వెర్షన...

 

తొలి రోజున 100 కోట్లు
నాలుగు రోజుల్లో 400 కోట్లు
చెన్నైలో కొనసాగుతోన్న జోరు
రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా శంకర్ తెరకెక్కించిన '2.ఓ' .. నవంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా, 4 రోజుల్లో 400 కోట్లను రాబట్టింది. తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా, వసూళ్లపరంగా ఈ మూడు భాషల్లోను దూసుకుపోతోంది. ముఖ్యంగా హిందీ వెర్షన్ మరింత వేగంగా వసూళ్లను సాధిస్తోంది.

బాలీవుడ్లో ఈ సినిమా నిన్న ఒక్క రోజునే 14 కోట్ల షేర్ ను సాధించడాన్ని విశేషంగా చెప్పుకుంటున్నారు. 5 రోజుల్లో హిందీ వెర్షన్ 100 కోట్ల షేర్ ను వసూలు చేసింది. తమిళ అనువాద చిత్రానికి బాలీవుడ్లో ఈ స్థాయి వసూళ్లు దక్కడం ఇదే మొదటిసారి. ఇలా బాలీవుడ్లో 5 రోజుల్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన తొలి తమిళ అనువాద చిత్రంగా ఈ సినిమా కొత్త రికార్డును సృష్టించింది. ఇక చెన్నై నగరంలోనూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించిన ఈ సినిమా అదే జోరును కొనసాగిస్తోంది.


PostedOn: 05 Dec 2018 Total Views: 25
సుకుమార్తో వరుణ్ తేజ్ పై జోకేసిన రాంచరణ్

సుకుమార్తో వరుణ్ తేజ్ పై జోకేసిన రాంచరణ్

నిన్న విడుదలైన వరుణ్ తేజ్ ‘అంతరిక్షం 9000 కెఎంపిహెచ్’ ట్రైలర్ కు విపరీతమైన స్పందన రావడంతో ఈమూవీ పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా ఇండియాలోనే మొదటి ఒరిజినల్ స్పేస్ థ్రిల్లర్ గా చెప్పబడుతోంది. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను కూడ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న విషయం నిన్న విడుదలై...

10 Dec 2018

వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ టీవీ ...

వజ్రాల వ్యాపారి హత్య కేసులో ప్రముఖ టీవీ నటి.. పోలీ...

రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో దేవలీనా పాత్రపై అనుమానంఅదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులువ్యాపారి ఇంటికి చివరిసారి వెళ్లింది ఆమెనేహిందీ టీవీ సీరియల్ నటి దేవలీనా భట్టాచార్జీ ఓ హత్య కేసులో చిక్కుకుంది. ముంబైకి చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజేశ్వర్ కిశోరీలాల్ ఉదానీ హత్య కేసులో ఆమె పాత్...

09 Dec 2018

అనుష్క ‘సీక్రెట్’ లీక్ అయిందోచ్..!!

అనుష్క ‘సీక్రెట్’ లీక్ అయిందోచ్..!!

‘భాగమతి’ తరువాత అనుష్క ఏ సినిమాను అంగీకరించలేదు. ఆమధ్య రెండు తమిళ సినిమాలకు అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆతరువాత ఆమూవీ ప్రాజెక్ట్ ల నుండి ఆమె తప్పుకోవడంతో అనుష్క సినిమాలను పక్కకు పెట్టి పెళ్లి విషయం పై తీవ్ర ఆలోచనలు చేస్తోంది అంటూ అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ గాసిప్పులకు చెక్ పెడుతూ అనుష...

04 Dec 2018

ప్రియాంక, నిక్ భార్యాభర్తలయ్యారు..

ప్రియాంక, నిక్ భార్యాభర్తలయ్యారు..

ప్రియాంక, నిక్ భార్యాభర్తలయ్యారు.. అయిపోయింది. నిరీక్షణ తప్పింది. ఇన్నేళ్ల తమ ప్రేమ బంధానికి ప్రియాంక, నిక్ ఫుల్‌స్టాప్ పెట్టారు. ఇవాళ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఉన్న ఉమాయిద్ భవన్ ప్యాలెస్‌లో వీళ్ల పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. ప్రియాంక రాల...

01 Dec 2018

వారం రోజులపాటు రామ్ చరణ్ కు జాతరే..!!

వారం రోజులపాటు రామ్ చరణ్ కు జాతరే..!!

‘వినయ విధేయ రామ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయిపోయింది. ఈ చిత్రం సంక్రాంతికి రాకపోవచ్చునని, బోయపాటి శ్రీను కావాలని ‘ఎన్టీఆర్‌’ బయోపిక్‌ కోసం దీనిని డిలే చేస్తున్నాడని ఏవో పిచ్చి, పిచ్చి పుకార్లు పుట్టుకొచ్చాయి. అయితే ఈ చిత్రం షూటింగ్‌ సకాలంలో పూర్తయిం...

01 Dec 2018

షారుఖ్ జీరో సెట్లో అగ్ని ప్రమాదం

షారుఖ్ జీరో సెట్లో అగ్ని ప్రమాదం

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ షూటింగ్ స్పాట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పాట చిత్రీకరణ కోసం వేసిన సెట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో షారుఖ్ అక్కడే ఉన్నారు. కానీ ఎవ్వరికీ ఎలాంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. షారుఖ్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శ...

30 Nov 2018

‘2.ఓ’ మూవీ రివ్యూ

‘2.ఓ’ మూవీ రివ్యూ

‘2.ఓ’ మూవీ రివ్యూ నాలుగేళ్ల పాటు శ్ర‌మించి, ఏకంగా అయిదు వంద‌ల కోట్ల‌కుపైనే పెట్టుబ‌డి పెట్టి ఓ సినిమా తీశారంటే.. ఆ ప్ర‌య‌త్నానికి, సాహ‌సానికీ వీర‌తాళ్లు వేయాల్సిందే. అది ర‌జ‌నీకాంత్ ‌సినిమా. అందులోనూ సాంకేతికంగా అద్భుతాలు సృష్టించే శ...

29 Nov 2018