అపుడు చరణ్ ఇపుడు ఎన్టీఆర్

అపుడు చరణ్ ఇపుడు ఎన్టీఆర్

 


సెలబ్రిటీలు లగ్జరీ యాక్సెసరీస్ ధరించడం.. లగ్జరీ కార్లు వాడడం సాధారణమైన విషయాలే. కానీ సాధారణ ప్రజలకు మాత్రం వాటి ధర తెలిస్తే మతిపోవడం ఖాయం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇలాంటి విషయంలో అందరికీ షాక్ ఇచ్చాడు. ఎన్టీఆర్ ఫ్యామిలీ ఇప్పుడు కార్తికేయ-పూజ ప్రసాద్ ల వివాహం సందర్భంగా జైపూర్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్.. చరణ్.. రానా.. నాని లు కలిసి జైపూర్ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలలో ఒక స్పెషల్ ఉంది. ఎన్టీఆర్ ఒక ఫుల్ స్లీవ్స్ టీ-షర్టు.. జీన్స్ లో కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని చాలా క్యాజువల్ గా కన్పించాడు గానీ తన చేతికి ధరించిన రిస్ట్ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తన వాచ్ సాదా సీదా వాచ్ కాదు. రిచర్డ్ మిల్ బ్రాండ్ వారి RM 11-3 మెక్ లారెన్ ఆటోమేటిక్ ఫ్లై బ్యాక్ క్రోనోగ్రాఫ్ వాచ్. దీని ధర రూ.1.5 కోట్ల నుండి రూ. 2.5 కోట్ల వరకూ ఉంటుందట. ఒక వాచ్ రెండు కోట్లా అని మనలాంటి వారు నోరెళ్ళబెట్టడం సాధారణమే కదా.

కొంతకాలం క్రితం రామ్ చరణ్ కూడా ఇలాంటి లగ్జరీ వాచ్ ను ధరించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫిలిప్ నాటిలస్ బ్రాండ్ వారి రోస్ గోల్డ్ కలర్ వాచ్ అది. దాని ఖరీదు రూ.80 లక్షల నుండి రూ.1.5 కోట్ల మధ్యలో ఉంటుందట. అప్పుడేమో చరణ్ ఇప్పుడేమో తారక్.. ఎంతైనా స్టార్ హీరోలు స్టార్ హీరోలే!

 


PostedOn: 29 Dec 2018 Total Views: 137
బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

బిగ్ బాస్ 3 పై మరో కేసు ..

సీజన్‌ వన్‌ సీజన్‌ టూతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రియాలిటీ షో బిగ్ బాస్‌3 బ్రేక్‌ పడింది. కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో నిలిపివేయాలంటూ సినీనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి హైకోర్టు కోర్టులో పిటిష‌న్ వేశారు. అశ్లీలంగా దుస్...

16 Jul 2019

ఇస్మార్ట్ గా ఉండాలనుకోవద్దు..అది మీ ఆరోగ...

ఇస్మార్ట్ గా ఉండాలనుకోవద్దు..అది మీ ఆరోగ్యానికి హా...

ఇస్మార్ట్ శంకర్ లా ఉండాలనుకోవద్దంటూ ఎనర్జిటిక్ స్టార్ రామ్ వార్నింగ్ ఇస్తున్నాడు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమా పూర్తి మాస్ మసాలా ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంది. ఈ సినిమా గురువారం విడుదల కానుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ ఏ సర్టి...

16 Jul 2019

అమ్మో అవంతిక!

అమ్మో అవంతిక!

అవంతిక పేరు చూసి సాఫ్ట్ అనుకుంటే కుదరదందోయ్! పక్కా డేంజరస్ బేబీ అంటున్నాడు మన్మధుడు. అక్కినేని నాగార్జున హీరోగా రాకుల్ ప్రీత్ సింగ్, కీర్త్ సురేష్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మన్మధుడు2 సినిమా టీజర్ విడుదలైంది. అవంతిక పాత్ర చేసిన రకుల్ పై దీనిని తయారు చేశారు. అవంతిక పేరు ఎంత సూపరో.. అంత పధ్ధతి గల అమ...

09 Jul 2019

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

భాయీజాన్‌ ఫిట్‌నెస్‌కు ఫిదా కావాల్సిందే!

‘భారత్‌’ సినిమాతో బాక్సాఫీస్‌పై కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న భాయీజాన్‌.. మరోసారి తన స్టామినాను చూపించారు. కేవలం తన స్టార్‌డమ్‌పైనే సినిమాలు ఆడతాయని మళ్లీ నిరూపించిన సూపర్‌స్టార్‌సల్మాన్‌ ఖాన్‌.. ప్రస్తుతం జిమ్‌లో వర్కౌట్లు, స్విమ్మింగ్&z...

24 Jun 2019

బిగ్‌బాస్‌ షోలో వీరే?

బిగ్‌బాస్‌ షోలో వీరే?

బిగ్‌బాస్‌ రియలిటీ గేమ్‌ షో. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో ప్రధానంగా చోటు చేసుకున్న విషయం ఇది. కారణం ప్రముఖ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ వ్యాఖ్యాత కావడం ఒక అంశం. ఇందులో పాల్గొన్న పోటీదారులు విపరీతంగా పాపులారిటీని తెచ్చుకోవడం, తద్వారా చిత్ర పరిశ్రమలో క్...

22 Jun 2019

జూన్ 21 కి చిరంజీవికి ఏనలేని సంబంధం ..!

జూన్ 21 కి చిరంజీవికి ఏనలేని సంబంధం ..!

తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అంటే ఇష్టపడని ఎవరు ఉండరు .. ఆయనకి బయట ఫాన్స్ మాత్రమే కాదు .. సినిమా ఇండస్ట్రీలో కూడా హార్ట్ కోర్ ఫాన్స్ ఉన్నారు .. మేము సినిమా ఇండస్ట్రీకి రావడానికి చిరంజీవి స్ఫూర్తి అని పలు సందర్బాలలో చాలా మంది హీరోలు చెప్పారు .. మరి చిరంజీవి ఇంతటి స్థాయికి రావడానికి అయన ...

21 Jun 2019

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ : పోలీసులను ఆ...

బాయ్ ఫ్రెండ్ బ్లాక్ మెయిల్ : పోలీసులను ఆశ్రయించిన ...

తన బాయ్ ఫ్రెండ్ మంజునాథ్ తనని ఫోటోలతో మరియు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తమిళ నటి నీలాని పోలీసులను ఆశ్రయించింది .. అతడి వల్ల ప్రాణహాని ఉందని అతని పై చర్యలు తీసుకోవాలని ఆమె దర్యాప్తులో పేర్కొంది .. కొన్ని రోజులుగా నీలాని మంజునాథ్ మధ్య ప్రేమాయణం నడిచింది .. మధ్యలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడ...

21 Jun 2019

సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ

సల్మాన్‌తో ఉపాసన ఇంటర్వ్యూ

రామ్ చరణ్ భార్య ఉపాసన మరోసారి మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. బి పాజిటివ్ పేరుతో హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మేగజైన్ రన్ చేస్తున్న ఆమె యూట్యూబ్‌ ఫ్లాట్ ఫాంలో ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు ఉపాసన. ఈ విషయాన్ని ...

07 Jun 2019