హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ కొనసాగుతోంది

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై స...

సినిమా అంటేనే అదో రంగుల ప్రపంచం. రోజుకో కొత్త ట్రెండ్ కనిపిస్తుంటుంది. ట్రెండ్ సెట్ చేయకపోయినా ఫర్వాలేదు గానీ.. కనీసం ఫాలో అవ్వకపోతే వెనకబడిపోతామని సెలబ్రెటీలు ఆందోళన పడుతుంటారు. ఇది హీరోయిన్లలో మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు డిఫరెంట్‌గా కనిపించేందుకు తాపత్రయపడుతుంటారు. ఫ్యాషన్ విషయంలో టాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య బాలీవుడ్ భామలతో పోటీపడుతున్నారు. గతంలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పొట్టి నిక్కరులో హాట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. జాన్వీ ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా? అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు.

ఇప్పుడు అలాంటి డ్రెస్‌లో వేడెక్కించి చిక్కుల్లో పడింది టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్. సీనియర్ హీరోయిన్ అయిన రకుల్ టీనేజర్‌లా డెనిమ్ నిక్కరులో హాట్‌హాట్‌గా కనిపిస్తూ కారులో నుంచి దిగుతున్న ఫోటో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన చాలామంది నెటిజన్లు ఆమె డ్రెస్సింగ్‌పై విమర్శలు చేస్తున్నారు. అయితే భగత్ అనే నెటిజన్ కాస్త శ్రుతిమించి ‘ రకుల్ కారులో సెషన్ పూర్తయ్యాక నిక్కరు వేసుకోవడం మరిచిపోయింది’ అంటూ బూతు కామెంట్ చేశాడు. దీనిపై రకుల్ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ పోస్టుపై రకుల్ కూడా తీవ్రస్థాయిలోనే స్పందించింది. ‘ మీ అమ్మకు కూడా ఇలాంటి అలవాటే ఉన్నట్లుంది. ఇలా ఎన్ని సెషన్స్ పూర్తి చేసిందో. ఆ అనుభవంతోనే ఇలా అంటున్నావా’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

అయితే భగత్ కామెంట్ కంటే.. దానికి రకుల్ ఇచ్చిన సమాధానమే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఎవరో ఆకతాయి కామెంట్ చేస్తే ఆడదానివై ఉండి అతడి అమ్మను ఈ వివాదంలోకి లాగుతావా? అంటూ చాలామంది రకుల్‌పై మండిపడుతున్నారు. రకుల్ ఉపయోగించిన భాష చూస్తే అవకాశాల్లేక ఫ్రస్టేషన్‌లో ఉందంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఈ వివాదానికి కారణమైన భగత్‌పైనా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఓ మహిళను ఇలా అవమానించడం తగదని హెచ్చరిస్తున్నారు. దీంతో అతడు తన ప్రొఫైల్ ఫిక్ మార్చేశాడు. ఈ రచ్చ ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాలి.

 

మీరు ఆ వ్యక్తిని ఏమైనా అనండి. కానీ అతడి తల్లిని దూషించడం మహిళలను మీరే కించపరిచినట్టు అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరికొందరైతే రకుల్ మీ అమ్మ కూడా నీకు ఓ చెంపదెబ్బ ఇస్తుందని ట్వీట్లు చేస్తున్నారు.


PostedOn: 17 Jan 2019 Total Views: 122
అప్పటి నుంచి చిరంజీవి మీద రాళ్లేస్తున్నా...

అప్పటి నుంచి చిరంజీవి మీద రాళ్లేస్తున్నారు

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగేంద్ర బాబు.. అన్న బాటలో సినీ రంగ ప్రవేశం చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిపోయిన ఆయన చాలా సున్నిత మనస్కులని పేరుండేంది. అయితే, ఇటీవల సంచలనమైన వివాదం తర్వాత రూటు మార్చారు. నందమూరి బాలకృష్ణ ఎవరో తనకు తెలియదంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఈ వివాదం తర్వాత నా...

18 Feb 2019

సత్యమే గెలిచింది..ఆర్’జివి లక్ష్మీస్‌ ఎన...

సత్యమే గెలిచింది..ఆర్’జివి లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌

స్వర్గీయ ఎన్టీఆర్‌పై ఏకకాలంలో బయోపిక్‌లు వస్తుండటంతో వీటిల్లో ఏది యధార్థానికి దగ్గరగా ఉంటుంది అనే విషయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చసాగుతోంది. సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌. ఎన్టీఆర్ జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెర...

18 Feb 2019

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌లో అది పచ్చి...

ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్‌లో అది పచ్చి అబద్దం.. ...

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మొదటి భాగం విడుదలైంది. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని ఇటీవల విడుదల చేశారు. ట్రైలర్ లో ఎన్టీఆర్ తె...

18 Feb 2019

రజనీ మక్కల్‌ మండ్రం 2021 లో ఎంట్రీ

రజనీ మక్కల్‌ మండ్రం 2021 లో ఎంట్రీ

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీపై దక్షిణాది సూపర్‌ స్టార్‌, రజనీ మక్కల్‌ మండ్రం అధినేత రజనీకాంత్‌ స్పష్టత ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు ఆయన ప్రకటన చేశారు. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చెన్నైలో జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో రజన...

17 Feb 2019

విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్..

విజయ్ దేవరకొండకు బిగ్ ఛాలెంజ్..

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డితో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిన ఈ యువ హీరో గత ఏడాది గీత గోవిందం చిత్రంతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పట్టిందల్లా బంగారమే అవుతోంది. గత ఏడాది విజయ్ దేవరకొండ ...

14 Feb 2019

‘మజిలీ’ టీజర్.. వెధవలకెప్పుడూ మంచి పెళ్ళ...

‘మజిలీ’ టీజర్.. వెధవలకెప్పుడూ మంచి పెళ్ళాలు దొరుకు...

రియల్ లైఫ్ కపుల్స్ అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం తర్వాత జంటగా నటిస్తున్న తొలి చిత్రం మజిలీ. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రేమ, కుటుంబ బంధాలు ప్రధానంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రూపొందిస్తున్నారు. మజిలీలో సమంత, చైతు భార్య భర్తలుగా నటిస్తున్నారు. నేడు ప్రేమికుల దిన...

14 Feb 2019

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్…వాడిని న‌మ్...

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైల‌ర్…వాడిని న‌మ్మ‌డమే నేను...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ జూలు విదిల్చాడు. తాను మనసుపెట్టి చేస్తే ఆ చిత్రం ఎలా ఉంటుందో నిరూపించాడు. ఎప్పుడూ వివాదాలతో సహవాసం చేసే వర్మ సరైన సబ్జెక్ట్ దొరికితే తన దర్శకత్వ ప్రతిభ ఎలా ఉంటుందో తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ద్వారా నిరూపించాడు. రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర ట్రైలర్ ...

14 Feb 2019

వైఎస్సార్‌గారు ప్రజలను తండ్రిలా ఆదరించార...

వైఎస్సార్‌గారు ప్రజలను తండ్రిలా ఆదరించారు – వైఎస్‌...

‘‘వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి పాదయాత్ర ఆధారంగా చేసుకుని ‘యాత్ర’ సినిమాని నిర్మించి, విజయవంతంగా నడిపించిన డైరెక్టర్‌ మహి, నిర్మాతలు విజయ్, శశి, శివగార్లకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అభినందిస్తున్నా’’ అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షు...

13 Feb 2019