అత్యంత దీనస్థితిలో అలనాటి నటి: కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బులేదట

అత్యంత దీనస్థితిలో అలనాటి నటి: కప్పు టీ ...

అలనాటి బాలీవుడ్‌ నటి పూజా దడ్వాల్‌ తీవ్ర అనారోగ్యంతో అత్యంత దీన స్థితిలో బతుకు పోరాటం చేస్తున్నారు. కొంతకాలంగా ఆమె క్షయ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం కప్పు టీ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేని స్థితిలో ఉన్నారు. 1990ల్లో వచ్చిన ‘వీర్‌ ఘటి’ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా పూజ నటించారు. తన అనారోగ్యం గురించి పూజ పలు మీడియా వర్గాలతో మాట్లాడుతూ.. సాయం కోసం సల్మాన్‌ను కలిసేందుకు ప్రయత్నించాను. కానీ, కుదరలేదని తెలిపారు. ‘నాకు క్షయ ఉందని ఆరు నెలల క్రితం తెలిసింది. సాయం కోసం సల్మాన్‌ను కలవడానికి యత్నించాను. కానీ, వీలుపడలేదు. కనీసం ఈ రకంగానైనా సల్మాన్‌ నా గురించి తెలుసుకుని సాయం చేస్తారని ఆశిస్తున్నాను. గత 15 రోజులుగా ఆస్పత్రిలో ఉంటున్నాను. కొన్నేళ్లుగా గోవాలో క్యాసినో మేనేజ్‌మెంట్‌ కోర్సు చేస్తున్నాను. ఉన్న డబ్బంతా దానికే అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. టీ కొనుక్కోవడానికి కూడా వేరే వారిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. నా అనారోగ్యం గురించి తెలిసి భర్త, బంధువులు వదిలి వెళ్లిపోయారు.’ అని చెప్తూ బాధపడ్డారు పూజ. ఆమె ‘హిందుస్థాన్‌’, ‘సింధూర్‌ సౌగంధ్‌’ చిత్రాల్లోనూ నటించారు.


PostedOn: 20 Mar 2018 Total Views: 30
మా జీవితం అంత దిగజారిపోయిందా?

మా జీవితం అంత దిగజారిపోయిందా?

సినీ తారల గురించి, వారి క్యారెక్టర్ గురించి మీడియాలో నీచంగా రాయడంపై ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ సీరియస్ అయింది. ఇటీవల ఓ టీవీ చానల్‌ చర్చా కార్యక్రమంలో ఓ న్యూస్ ప్రజెంటర్ సినిమా ఇండస్ట్రీలోని తారలపై అత్యంత హేయమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ‘మా’ సభ్య...

28 Mar 2018

పూలరంగడు కాంబినేషన్‌ లో మరో సినిమా..

పూలరంగడు కాంబినేషన్‌ లో మరో సినిమా..

కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్‌ తీసుకున్న సునీల్‌ ఒకటి రెండు సినిమా విజయాలు తప్ప హీరోగా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మరోసారి కమెడియన్‌ గా టర్న్‌ తీసుకొని రవితేజ, శ్రీనువైట్ల సినిమాతో పూర్తి స్థాయి కమెడియన్‌ ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నాడు. అయితే హీరోగా మాత్రం ...

24 Mar 2018

‘ఎమ్ఎల్ఏ’ రివ్యూ & రేటింగ్

‘ఎమ్ఎల్ఏ’ రివ్యూ & రేటింగ్

తొలి నుంచీ కమర్షియల్‌ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు కల్యాణ్‌ రామ్‌. ఆయన చేసిన సినిమాల్లో చాలా మటుకు ఫక్తు కమర్షియల్‌ కథలే ఉన్నాయి. ‘ఇజం’, ‘పటాస్‌’ ఈ కోవకు చెందినవే. ఇప్పుడు ‘ఎం.ఎల్‌.ఎ’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మంచి లక్షణా...

23 Mar 2018

నీదీ నాదీ ఒకే కథ:రివ్యూ & రేటింగ్

నీదీ నాదీ ఒకే కథ:రివ్యూ & రేటింగ్

సినిమాల ఎంపిక విషయంలో నేటి యువతరం కథానాయకులు మారారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలను ఎంచుకుంటున్నారు. అలా విభిన్న నేపథ్యాల కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఒక పక్క కథానాయకుడిగా నటిస్తూనే మరో పక్క ఇతర హీరోలతో కలిసి తెర పంచుకునేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు. గతేడాది ...

23 Mar 2018

పూర్తయిన మహానటి చిత్రీకరణ..

పూర్తయిన మహానటి చిత్రీకరణ..

అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేశ్‌ సావిత్రి పాత్రలో నటిస్తున్నారు. సమంత విలేకరిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా..ఈ సినిమా చిత్రీకరణ బుధవారంతో పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విటర్‌ ద్వారా వెల్లడించింది. చిత్రీకరణ పూర్తైన సందర్...

22 Mar 2018

రాత్రికి ఫ్రీనా అని అడిగాడు!

రాత్రికి ఫ్రీనా అని అడిగాడు!

సినీ అవకాశాల మాటు జరుగుతున్న చీకటి కోణాల్ని ప్రస్తుతం హీరోయిన్లు ఒక్కొక్కరుగా ఎండగడుతున్న సంగతి తెలిసిందే. మీ టూ అంటూ సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఉద్యమమే జరుగుతోంది. చిత్ర పరిశ్రమల్లో హీరోయిన్లకు ఎదురవుతున్న అనుమానాలు, కాస్టింగ్ కౌచ్ పేరుతో జరుగుతున్న చీకటి నిజాలు బయటకు వస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడి...

22 Mar 2018

వైరల్‌ గా మారిన ఎన్టీఆర్ ఫొటో

వైరల్‌ గా మారిన ఎన్టీఆర్ ఫొటో

అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ ఫిట్‌గా తయారు కావడానికి కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. తన తర్వాతి చిత్రంలోని పాత్ర కోసం ఆయన జిమ్‌లో చాలా కష్టపడుతున్నారు. తారక్‌ వ్యాయామం చేస్తుండగా తీసిన వీడియోను ఇటీవల ఆయన ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ...

15 Mar 2018