సూసైడ్ చేసుకుందామనుకున్నా.. చలపతిరావు షాకింగ్ కామెంట్స్!

సూసైడ్ చేసుకుందామనుకున్నా.. చలపతిరావు షా...

 

మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది.

విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన నటుడు చలపతిరావుకి ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరుంది. సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు ఇలా అందరితో కలిసి పని చేసిన ఆయనపై ఇప్పుడు జనాలకు నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడింది. దానికి కారణం ఓ సినిమా ఈవెంట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు.

మహిళలను ఉద్దేశిస్తూ.. 'ఆడవాళ్లు పక్కలోకి మాత్రమే పనికొస్తారు' అంటూ నవ్వుతూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి.మహిళలు తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియాలో అయితే చలపతిరావుపై విరుచుకుపడ్డారు. ఆయన్ని దారుణంగా ట్రోల్ చేశారు.

ఇదంతా చూసి బాధ పడిన చలపతిరావు ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ కార్యక్రమంలో చెప్పారు. మహిళలంటే తనకు ఎంతో గౌరవమని.. కానీ సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ చూసి సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్లు చలపతిరావు అన్నారు.

22 ఏళ్ల వయసులో భార్య చనిపోతే మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదని.. ఇండస్ట్రీలో ఆడవాళ్లను ఏనాడు పరుష మాటలు కానీ, తప్పుడు మాటలు మాట్లాడటం కానీ ఇంత వరకు చేయలేదని అలాంటిది తనను అల్లరి చేయడంతో సూసైడ్ చేసుకుంటే బెటర్ అనిపించిందని అన్నారు. ఇన్నాళ్లు నిప్పులా బతికానని.. సోషల్ మీడియా అనే దరిద్రం వచ్చి తనకున్న మంచి పేరుని చెడగొట్టిందని అన్నారు.


PostedOn: 18 Sep 2019 Total Views: 40




రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

కన్నడ ముద్దుగుమ్మరష్మిక మందన్నా‘గీతాగోవిందం’ సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె దేవదాస్‌, డియర్‌ కామ్రేడ్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చేత...

21 Oct 2019

వలిమైలో జాన్వీ ఉంటుందా?

వలిమైలో జాన్వీ ఉంటుందా?

జాన్వీకపూర్‌ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవినే. ముద్దుముద్దు మాటలు, వడివడి అడుగులతో చిరు వయసులోనే కళామతల్లి ఒడికి చేరిన నటి శ్రీదేవి అన్నది తెలిసిందే. అలా తన నట జీవితానికి శ్రీకారం చుట్టుకున్న ఆమె ఆల్‌ ఇండియా సూపర్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. జీవిత...

21 Oct 2019

'రాములో రాములా' అంటున్న అల్లు అర్జున్

'రాములో రాములా' అంటున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం 'అల వైకుంటపురములో '.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ , హారిక హసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదటినుండి సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, వి...

20 Oct 2019

పాపం క్యాథరిన్ ఆ వ్యాధితో బాధపడుతుందట...

పాపం క్యాథరిన్ ఆ వ్యాధితో బాధపడుతుందట...

వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్ ట్రెసా... ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటిగా ఒకే అనిపించుకుంది. ఇక అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సిన...

20 Oct 2019

సంక్రాంతి వార్‌.. డేట్ మార్చుకున్న మహేష్

సంక్రాంతి వార్‌.. డేట్ మార్చుకున్న మహేష్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంసరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ హిట్ మహర్షి తరువాత మహేష్‌, బ్లాక్‌ బస్టర్‌ ఎఫ్‌ 2 తరువాత అనిల్ రావిపూడి ...

20 Oct 2019

ప్రియాంక ఈజ్‌ ద స్కై

ప్రియాంక ఈజ్‌ ద స్కై

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి, స్టార్‌ హీరోయిన్‌ అయి హాలీవుడ్‌ వరకూ వెళ్లిన మీ జర్నీ గురించి కొన్ని మాటలు...ప్రియాంక:ఈ ప్రయాణంలో చాలామంది సహాయం ఉంది. వాళ్లందరికీ ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు క...

20 Oct 2019

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

నటి రాయ్‌లక్ష్మి చిత్రానికి తోడ్పాటు అందించడానికి ఆ ఇద్దరు దర్శకులు ముందుకొచ్చారు. రాయ్‌లక్ష్మి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం అని భావించనక్కర్లేదు. సంచలనాలకు చిరునామా ఈ భామ. అందాలారబోతకు వెనుకాడని నటి. అలాంటి నటిసినిమాల్లో కనిపించి చాలాకాలం అయ్యింది. నీయా–2 చిత్రం తరువాత ఈ అమ్మడి చిత...

20 Oct 2019

రాజుగారి గది 3 రివ్యూ..

రాజుగారి గది 3 రివ్యూ..

కథ : మాయ ( అవికా గొర్ ) ఓ డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమెను తాకాలని చూసిన వారు మరణిస్తారు. ఆమెకి కాపలాగా ఓ ఆత్మ కవచం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఓ కాలనీలో అశ్విన్( అశ్విన్ బాబు) అనే ఆటో డ్రైవర్ ఉంటాడు. అతను కాలనీ వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వడు.. దీనితో ఆ కాలనీలోని కొంత మంది వ్యక్తులు అశ్విన్ ని మాయ ప్రేమలో పడ...

19 Oct 2019