'సైరా' డిజిటల్ బిజినెస్.. హోల్ సేల్ గా రూ.125 కోట్లు!

'సైరా' డిజిటల్ బిజినెస్.. హోల్ సేల్ గా ర...

 

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఇప్పటికీ తగ్గలేదని చాటుతోంది ‘సైరా’ సినిమా. ఈ వయసులో, చిరు కెరీర్లో ఈ దశలో రూ.250 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి సినిమా తీయడమంటే మాటలు కాదు.

చిరంజీవి కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం 'సైరా'. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేసింది. ఈరోజు సాయంత్రం 5:31ని.లకు సినిమా ట్రైలర్ ని విడుదల చేయనున్నారు.

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా కోసం దాదాపు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. దానికి తగ్గట్లే బిజినెస్ కూడా జరుగుతోంది. సినిమా థియే ట్రికల్ హక్కులను రూ.190 కోట్ల మేర అమ్మినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక 'సైరా' శాటిలైట్, డిజిటల్ హక్కులు ఏకంగా రూ.125 కోట్లకు అమ్ముడైనట్లు వస్తోన్న సమాచారం షాక్ కి గురిచేస్తోంది.

'బాహుబలి', 'సాహో' సినిమాలకు తప్ప ఈ రేంజ్ లో సౌత్ లో ఏ సినిమాకి ఇంత రేటు పకలేదు. జీనెట్ వర్క్ సంస్థ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలకు సంబంధించి 'సైరా' హక్కులను రూ.125 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. తెలుగు వెర్షన్ కోసం రూ.40 కోట్లు, మిగిలిన భాషల కోసం రూ.85 కోట్లు పెట్టొచ్చనే లెక్కతో అంత డబ్బు ఆఫర్ చేశారట.

కాగా స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి, రవి కిషన్, సుదీప్, తమన్నా, నిహారిక, అనుష్క తదితరులు కీలక పాత్రలలో నటించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు.


PostedOn: 18 Sep 2019 Total Views: 42




రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

రష్మికపై దిల్‌ రాజుకు కోపమొచ్చిందా!

కన్నడ ముద్దుగుమ్మరష్మిక మందన్నా‘గీతాగోవిందం’ సినిమాతో టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా సూపర్‌హిట్‌ అవ్వడంతో రష్మికకు అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె దేవదాస్‌, డియర్‌ కామ్రేడ్‌ వంటి చిత్రాల్లో నటించింది. ఇప్పుడు ఆమె చేత...

21 Oct 2019

వలిమైలో జాన్వీ ఉంటుందా?

వలిమైలో జాన్వీ ఉంటుందా?

జాన్వీకపూర్‌ ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది అతిలోక సుందరి శ్రీదేవినే. ముద్దుముద్దు మాటలు, వడివడి అడుగులతో చిరు వయసులోనే కళామతల్లి ఒడికి చేరిన నటి శ్రీదేవి అన్నది తెలిసిందే. అలా తన నట జీవితానికి శ్రీకారం చుట్టుకున్న ఆమె ఆల్‌ ఇండియా సూపర్‌ హీరోయిన్‌ స్థాయికి చేరుకుంది. జీవిత...

21 Oct 2019

'రాములో రాములా' అంటున్న అల్లు అర్జున్

'రాములో రాములా' అంటున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ నుండి వస్తున్న చిత్రం 'అల వైకుంటపురములో '.. పూజా హేగ్దే కథానాయకగా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ , హారిక హసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. మొదటినుండి సినిమాపైన భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తోడు సినిమా ఫస్ట్ లుక్, వి...

20 Oct 2019

పాపం క్యాథరిన్ ఆ వ్యాధితో బాధపడుతుందట...

పాపం క్యాథరిన్ ఆ వ్యాధితో బాధపడుతుందట...

వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది క్యాథరిన్ ట్రెసా... ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి నటిగా ఒకే అనిపించుకుంది. ఇక అల్లు అర్జున్ తో చేసిన ఇద్దరమ్మాయిలతో, సరైనోడు సినిమాలు ఆమెకి మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సిన...

20 Oct 2019

సంక్రాంతి వార్‌.. డేట్ మార్చుకున్న మహేష్

సంక్రాంతి వార్‌.. డేట్ మార్చుకున్న మహేష్

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రంసరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ హిట్ మహర్షి తరువాత మహేష్‌, బ్లాక్‌ బస్టర్‌ ఎఫ్‌ 2 తరువాత అనిల్ రావిపూడి ...

20 Oct 2019

ప్రియాంక ఈజ్‌ ద స్కై

ప్రియాంక ఈజ్‌ ద స్కై

ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి, స్టార్‌ హీరోయిన్‌ అయి హాలీవుడ్‌ వరకూ వెళ్లిన మీ జర్నీ గురించి కొన్ని మాటలు...ప్రియాంక:ఈ ప్రయాణంలో చాలామంది సహాయం ఉంది. వాళ్లందరికీ ఎంతో వినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు క...

20 Oct 2019

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

రాయ్‌లక్ష్మి కోసం ఆ ఇద్దరు

నటి రాయ్‌లక్ష్మి చిత్రానికి తోడ్పాటు అందించడానికి ఆ ఇద్దరు దర్శకులు ముందుకొచ్చారు. రాయ్‌లక్ష్మి గురించి పరిచయ వ్యాఖ్యలు అవసరం అని భావించనక్కర్లేదు. సంచలనాలకు చిరునామా ఈ భామ. అందాలారబోతకు వెనుకాడని నటి. అలాంటి నటిసినిమాల్లో కనిపించి చాలాకాలం అయ్యింది. నీయా–2 చిత్రం తరువాత ఈ అమ్మడి చిత...

20 Oct 2019

రాజుగారి గది 3 రివ్యూ..

రాజుగారి గది 3 రివ్యూ..

కథ : మాయ ( అవికా గొర్ ) ఓ డాక్టర్ గా పనిచేస్తుంది. ఆమెను తాకాలని చూసిన వారు మరణిస్తారు. ఆమెకి కాపలాగా ఓ ఆత్మ కవచం ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఓ కాలనీలో అశ్విన్( అశ్విన్ బాబు) అనే ఆటో డ్రైవర్ ఉంటాడు. అతను కాలనీ వాళ్ళను ప్రశాంతంగా ఉండనివ్వడు.. దీనితో ఆ కాలనీలోని కొంత మంది వ్యక్తులు అశ్విన్ ని మాయ ప్రేమలో పడ...

19 Oct 2019