మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

మళ్లీ మొదలైన పెట్రో బాదుడు

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా పట్టించుకోలేదు. రూపాయి విలువ పడిపోయినా లెక్కచేయలేదు.. రోజుకు 150 కోట్ల రూపాయల నష్టం వచ్చినా మౌనంగా ఉన్నాయి. ఎన్నికలు పూర్తయ్యాయి. అంతే మళ్లీ బాదుడు మొదలు పెట్టేశాయి చమురు సంస్థలు. ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరగడం మొదలు పెట్టాయి. తుది విడత పోలింగ్ ముగియగానే పెట్రోల్ లీటరకు 9 పైసలు, డీజిల్‌పై 15 పైసలు వడ్డించాయి చమురు సంస్థలు. అయితే ఈ బాదుడు ఇంతటితో ఆగదని అంచనా. సుమారుగా 10 నుంచి 15 శాతం పెరుగుతాయని భావిస్తున్నారు.

అయితే ఎన్నికలు దగ్గరపడినప్పటి నుంచి ధరలు తగ్గడం మొదలైయాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా, ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి దిగుమతులను నిలిపివేసినా చమురు సంస్థలు రేట్లు పెంచకుండా కేంద్రం జాగ్రత్తలు తీసుకుంది. ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల చమురు సంస్థలు భారీగా నష్టాలు మూటగట్టుకున్నట్టు సమాచారం. ఈ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలోనే ఇప్పుడు బాదుడు ప్రారంభించాయని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో, 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఇదే పునరావృతమవుతోంది.



PostedOn: 21 May 2019 Total Views: 82




మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో ...

మాజీ ప్రధాన న్యాయమూర్తి వేధింపుల వీడియో బయటపెట్టిన...

తెలంగాణ హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ రామ్మోహన్ రావు కుటుంబ కలహాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో డబ్బుకోసం, అదనపు కట్నం కోసం తన భర్తకు ఆయన తండ్రి మరో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… తనను శారీరకంగా, మానసికంగా హింసించారని కోడలు సింధు శర్మ సీసీఎస్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్య...

21 Sep 2019

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంత...

మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి: సీఎం జగన్ సంతాపం

శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. మాజీ ఎంపీ శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఆ భగవంతుడిని కోరి ప్రార్థిస్థున్నట్లు సీఎం జగన్ ట్వీట్ చేశారు. అమరావతి: ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ, తెలుగుదేశం పార్టీ సీన...

21 Sep 2019

హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

హౌడీ మోడీ ఈవెంట్: ఎన్నారై పాసులు ఇవే...

హౌడీ మోడీ ఈవెంట్ కు సంబంధించిన టిక్కెట్లను భారతీయ అమెరికన్లు నెట్లో తమ ఖాతాల్లో పోస్టు చేస్తూ తెగ సంబరపడిపోతున్నారు. మీరూ ఆ టికెట్ ఎలా ఉందో ఒక లుక్కేయండి. ఈ నెల 22వ తేదీన, అనగా రేపు అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హూస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమంలో మన ప్రధాని నరేంద్రమోడీ పాల్గొననున్న విషయం మన...

21 Sep 2019

జియోలోకి ముకేశ్ అంబానీ రంగ ప్రవేశం ఇలా

జియోలోకి ముకేశ్ అంబానీ రంగ ప్రవేశం ఇలా

ముకేశ్ అంబానీ పరస్పర భిన్న వ్యూహాలతో భారత కార్పొరేట్ రంగంలో రారాజుగా అవతరించారు. 2009లో ఆర్ఎన్ఆర్ఎల్ సంస్థకు గ్యాస్ సరఫరాలో ధర ఖరారు విషయమై సోదరుల మధ్య చెలరేగిన వివాదం సుప్రీంకోర్టు దరి చేరింది. ముకేశ్ అంబానీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదే ముకేశ్ అంబానీ వివిధ రంగాల్లో అడుగు పెట్టేందుకు బహుముఖ వ్యూ...

21 Sep 2019

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్...

చిత్తూరు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

తెలుగుదేశం పార్టీ (టీడీపి) మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొద్ది కాలంగా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్నారు. చిత్తూరు: తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ కన్నుమూశారు. ఆయన వయ,స్సు 68 ఏళ్లు. ఆయన ప...

21 Sep 2019

ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహ...

ప్రేమ పేరిట వంచన... రేప్ చేసి.. తన స్నేహితులతో కూడ...

ఆ సమయంలో ఆమెకు ఆటో డ్రైవర్ నరేష్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. నరేష్ కి గతంలోనే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ విషయాన్ని దాచి ఆమెను ప్రేమ పేరిట మోసం చేశాడు. శుక్రవారం గుడికి వెళదామని చెప్పి... ఓ ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో...

21 Sep 2019

గ్లోబరీనాపై చర్యలు ఏవి... కేసీఆర్ పై విజ...

గ్లోబరీనాపై చర్యలు ఏవి... కేసీఆర్ పై విజయశాంతి కామ...

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల ఉదంతం జరిగి చాలా నెలలు గడిచిన తర్వాత...ఇప్పుడు ఇంటర్ బోర్డు కార్యదర్శిని బదిలీ చేయడం చూస్తుంటే .. విద్యార్థుల పట్ల కెసిఆర్ ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యం అర్థమవుతోందని ఆమె చెప్పారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ ను బదిలీ చేస్...

21 Sep 2019

అప్పుడే కొన్న స్కూటర్... రూ.లక్ష జరిమానా

అప్పుడే కొన్న స్కూటర్... రూ.లక్ష జరిమానా

భువనేశ్వర్‌లో ఒక వ్యక్తి హోండా యాక్టివాను ఇటీవల కొనుగోలు చేశాడు. ఈ స్కూటర్‌ను కటక్‌లోని ఒక చెక్ పోస్టువద్ద ట్రాఫిక్ పోలీసులు అడ్డుకున్నారు. ఈ స్కూటర్‌పై రిజిస్ట్రేషన్ నంబరు లేదు. దీంతో ఆర్టీఓ సంబంధిత వాహన డీలర్‌కు రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించనందుకు సుమారు లక్ష రూపాయల జరిమానా ...

21 Sep 2019