నిర్లక్ష్యానికి మరో బాలుడు బలి..ఊపిరి తీసిన కారు డోరు!

నిర్లక్ష్యానికి మరో బాలుడు బలి..ఊపిరి తీ...

చిన్న నిర్లక్ష్యం. చిన్నారుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. అంతవరకు కళ్లముందే ఆడుకుంటున్న చిన్నారులు అంతలోనే విగతజీవులుగా మారుతున్నారు. అప్పుడు గుండెలు బాదుకుని కన్నీరు పెట్టడం తప్ప చేసేదేమీ మిగలడం లేదు. కార్లలో ఇరుక్కున్న చిన్నారులు నరకం అనుభవించి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా విశాఖలో జరిగిన ఘోరం మరోసారి అందరినీ కలచివేసింది. అసలు కారులో పిల్లలు మరణించడానికి కారణాలేంటి? నిర్లక్ష్యానికి మరో బాలుడు బలైపోయాడు. కారు డోర్ లాకై ఏడేళ్ల పిల్లాడు మృత్యువాత పడ్డాడు. ఊపిరాడక కారులోనే తనువుచాలించాడు. విశాఖ మల్కాపురంలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

నావల్ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్ లో కారును కడిగిన యజమాని అది ఆరేందుకు డోర్ తెరిచి ఉంచాడు. అదే సమయంలో కారులోకి ప్రవేశించిన ఏడేళ్ల బాలుడు ప్రేమ్ కుమార్ అందులో ఉన్న బొమ్మలను తీసుకుంటుండగా డోర్ లాక్ అయ్యింది. దాంతో మూడు గంటలపాటు ఆ బాలుడు నరకం అనుభవించాడు. ఎంతగా అరుపులు పెట్టాడో ఎంతలా ఏడ్చాడో తెలియదు కానీ ఊపిరాడక కారులో ప్రాణాలు విడిచాడు. కొనఊపిరితో అల్లాడిన ఆ బాలుడి చివరి క్షణాలను తలుచుకుని తల్లిదండ్రులు గుండెలు బాదుకున్నారు. మరోవైపు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగినా, వాటి నుంచి తల్లిదండ్రులు పాఠాలు నేర్చుకోవడం లేదు. పిల్లల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నారు.

కారు డోర్స్ లాకై పిల్లలు మృత్యువాత పడటానికి అనేక కారణాలున్నా ముఖ్యంగా హీట్ స్ట్రోకే కారణమంటున్నారు నిపుణులు. చిన్న పిల్లల శరీరాలు అధిక వేడిని తట్టుకోలేవు, పెద్దలతో పోల్చితే, చిన్నారులు నాలుగైదు రెట్లు వేగంగా హీట్‌ అవుతారు, ఇదే వారి పాలిట శాపంగా మారి, మరణానికి కారణమవుతోందని చెబుతున్నారు. పదిహేనేళ్లలోపు పిల్లలందరికీ ఇలాంటి ప్రమాదం పొంచి ఉందంటున్నారు. అంతేకాదు కారు డోర్స్ లాకైన 10 నిమిషాల్లోనే లోపలి టెంపరేచర్ 20 డిగ్రీలు పెరుగుతుందని, దాంతో చిన్నారుల అవయవాలు ఒక్కొక్కటిగా షట్‌డౌన్ అవుతూ పనిచేయడం మానేస్తాయని, చివరికి మృత్యువాత పడతారని చెబుతున్నారు. ఒకవేళ అద్దాలు తెరిచి ఉన్నా కారు వేడికి, కార్బన్ మోనాక్సైడ్ కారణంగా చిన్నారులు మృత్యువాత పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయంటున్నారు. వేసవిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, అందుకే పిల్లల విషయంలో అత్యంత జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.PostedOn: 21 May 2019 Total Views: 54
వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవ...

07 Jun 2019

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజ...

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజీమంత్రి జూ...

నాగర్‌కర్నూల్‌ టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజ...

07 Jun 2019

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యో...

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబ...

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గ...

07 Jun 2019

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ ల...

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రిక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మ...

07 Jun 2019

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో ...

07 Jun 2019

పోరాడుతున్న వెస్టిండీస్

పోరాడుతున్న వెస్టిండీస్

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆ...

07 Jun 2019

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) త...

06 Jun 2019

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయ...

06 Jun 2019