నోట్ల ర‌ద్దుతో బ్లాక్‌మ‌నీ టార్గెట్ చేశాం..

నోట్ల ర‌ద్దుతో బ్లాక్‌మ‌నీ టార్గెట్ చేశా...

 

మోదీ ప్ర‌భుత్వం పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేసి నేటితో రెండేళ్లు పూర్తి అయ్యింది. ఈ నేప‌థ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త‌న ఫేస్‌బుక్‌లో ఆ అంశంపై స్పందించారు. డ‌బ్బును స్వాధీనం చేసుకోవాల‌న్న ల‌క్ష్యంతో నోట్ల ర‌ద్దు చ‌ర్య‌ను చేప‌ట్ట‌లేద‌న్నారు. కానీ అక్ర‌మంగా దాచుకున్న సొమ్మును ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావాల‌న్న ఉద్దేశంతో డిమానిటైజేష‌న్ చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు. నోట్ల ర‌ద్దును ప్ర‌తిప‌క్షాలు త‌ప్పుప‌డుతున్న స‌మ‌యంలో.. మోదీ చ‌ర్య‌ను జైట్లీ గ‌ట్టిగా స‌మ‌ర్థించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌క్ర‌మ ప‌ద్ధ‌తిలో పెట్టేందుకు తీసుకున్న నిర్ణ‌యాల్లో డిమానిటైజేష‌న్ ఒక‌టి అని జైట్లీ అన్నారు. దేశం బ‌య‌ట ఉన్న న‌ల్ల‌ధ‌నాన్ని ప్ర‌భుత్వం టార్గెట్ చేసింద‌ని, జ‌రిమానా ప‌న్ను క‌ట్టి, ఆ సొమ్మును తీసుకువ‌చ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న తెలిపారు. అయితే న‌ల్ల‌ధ‌నాన్ని తీసుకురాని వారిపైన చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు. విదేశాల్లో అకౌంట్లు ఉన్న‌వారిని ప్ర‌శ్నిస్తున్నామ‌న్నారు. అక్ర‌మంగా నిలువ చేసుకున్న డ‌బ్బును.. నోట్ల ర‌ద్దు చ‌ర్య‌తో బ్యాంకుల‌కు వ‌చ్చే విధంగా చేశామ‌న్నారు. ఈ ప‌ద్ధ‌తి వ‌ల్ల సుమారు 17.42 ల‌క్ష అక్ర‌మ అకౌంట్ల‌ను గుర్తించామ‌న్నారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించి, ప‌న్ను ఎగ‌వేసిన వారిని శిక్షించామ‌న్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెర‌గ‌డం వ‌ల్ల‌, ఇప్పుడా బ్యాంకులు అధిక మొత్తంలో రుణాలు ఇస్తున్నాయ‌న్నారు. చాలావ‌ర‌కు అక్ర‌మ డ‌బ్బు ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్స్ రూపంలో పెట్టుబ‌డిగా పెట్టార‌న్నారు. దీంతో ఆ సొమ్ము మొత్తం ఆర్థిక వ్య‌వ‌స్థ‌లోకి వ‌చ్చేసింద‌ని మంత్రి జైట్లీ అన్నారు. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌ర్స‌న‌ల్ ఇన్‌కం ట్యాక్స్ రాబ‌డి పెరిగింద‌న్నారు.


PostedOn: 08 Nov 2018 Total Views: 110




నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతా రెడ్డి అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే తమ కుటుంబంపై నిందారోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సంఘటనా స్థలంలోనే సీఐ శంకరయ్య ఉ...

24 Mar 2019

బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర...

బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర కీలకం..

చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు తొలి విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టు కేవలం 70 పరుగుల మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పా...

24 Mar 2019

కత్తులు దూస్తున్న తండ్రీకుమార్తె... రసవత...

కత్తులు దూస్తున్న తండ్రీకుమార్తె... రసవత్తరంగా రాజ...

వేలుపట్టి నడకలు నేర్పించిన నాన్న. తండ్రి కళ్లతో ప్రపంచాన్ని చూసిన కూతురు. పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలో దిశానిర్దేశం చేసిన డాడీ కాంపిటీటీవ్ వాల్డ్‌లో తండ్రికే గర్వకారణం నిలిచిన తనయ. ఇప్పుడు ఈ తండ్రీ కూతుళ్ల మధ్యే నేరుగా పోటీ ఉంటే.? బుడిబుడి అడుగులు నేర్పిన నాన్నతో, ఆ కూతురు సమరానికి సిద్దమం...

24 Mar 2019

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవి...

21 Mar 2019

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరా...

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్..పార్కు...

ఆడపిల్లలపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అత్యాచారాలు మాత్రం ఆడగంలేదు. మగవాడి చేతిలో బలికాక తప్పడంలేదు. కాగా తాజా దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన బాద్మాష్ గాడు ఆ తరువాత ఆమే దుస్తువులు తీసుకొని పరారైన వైనమిది. ఇక వివరాల్లోకి వెళితే దుబాయ్‌లోని ఓ పబ్లిక...

20 Mar 2019

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబాని...

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన ...

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణం బుడగజంగం కాలనీకి చెందిన వీరాంజనేయులు ఆయన భార్య వసంత ఇద్దరు పిల్లలు రామలక్ష్మి, రాజేష్ తో కలిసి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. గ్యాస్ స్టౌలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామాంజ...

20 Mar 2019

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో.....

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో..? ప్రొ. కే...

ఏపీలో ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రచారలతో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పుడే ఏపీలో ఎవరు చక్రం తిప్పబోతున్నారని కూడా తాజాగా ఓ సర్వేలో తెలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించ...

20 Mar 2019

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్...

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లిగ్) రానే వచ్చేస్తోంది. ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. కాగా ఇప్పటికే తమ జట్లు మైదానాల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ టీమ్ కూడా తన జట్టుతో మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ...

19 Mar 2019