ఇంకా పరారీలో గాలి..

ఇంకా పరారీలో గాలి..

 


కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్‌రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. గనుల అక్రమ తవ్వకాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి ఇప్పుడు మరో కేసులో చిక్కుకున్నారు. ప్రజలను మోసపుచ్చి డబ్బు వసూలు చేసిన బెంగళూరుకు చెందిన అంబిడెంట్‌ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని ఈడీ కేసు నుంచి రక్షించేందుకు రూ.20కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈడీ అధికారికి జనార్దన్ రెడ్డి రూ.కోటి లంచం ఎరవేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసులోనే గాలి జనార్దన్‌రెడ్డిని విచారించేందుకు పోలీసులు గాలిస్తుండగా.. ఆయన పరారీలో ఉన్నారు.

 

గాలి జనార్దన్‌రెడ్డి, ఆయన అనుచరుడు అలీఖాన్‌ కోసం కర్ణాటక పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అంబిడెంట్ సంస్థ రూ.500 కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు 2014లో వెలుగులోకి వచ్చింది. ఈ సొమ్ము మొత్తాన్ని మోసపూరితంగా ప్రజల నుంచి వసూలు చేసినట్లు రుజువైంది. నాటి నుంచి సీసీబీ, ఈడీ అధికారులు ఆ సంస్థ చైర్మన్ సయ్యద్ అహ్మద్ ఫరీద్‌ను విచారిస్తూ వచ్చారు. అయితే.. ఈ కేసు నుంచి ఫారిద్‌ను తప్పించేందుకు గాలి జనార్దన్ రెడ్డి రూ.20 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆయన్ని అరెస్టు చేసేందుకు సీసీబీ పోలీసులు రంగం సిద్ధం చేశారు.

బెంగళూరులో గాలి జనార్దన్‌రెడ్డి నివాసం ‘పారిజాత’ వద్దకు వెళ్లిన సీసీబీ పోలీసలు ఆయన ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. తాళం తెరిపించి తనిఖీలు చేస్తున్నారు. గాలి, అలీఖాన్‌పై లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు బెంగళూరు పోలీసు కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ వెల్లడించారు. రెడ్డి సోదరులకు మంచి పట్టున్న బళ్లారి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గాలి జనార్దన్‌రెడ్డి సన్నిహితుడు శ్రీరాములు సోదరి శాంత ఘోర పరాజయం చవిచూసిన మరుసటి రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. 2004 తర్వాత ఈ స్థానంలో కాంగ్రెస్‌ గెలుపొందడం ఇదే తొలిసారి.

 


PostedOn: 08 Nov 2018 Total Views: 39
కారులో తరలిస్తున్న రూ 3.5 కోట్లు సీజ్

కారులో తరలిస్తున్న రూ 3.5 కోట్లు సీజ్

వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం అంగడీచిట్టంపల్లి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ. 3.5 కోట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ నగదు ప్రైవేటు బ్యాంక్‌కు చెందిన నగదుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

16 Nov 2018

హైదరాబాద్ సిటీ టీడీపీ నేతల రహస్య సమావేశం...

హైదరాబాద్ సిటీ టీడీపీ నేతల రహస్య సమావేశం?

పొత్తుల పేరుతో టీడీపీని సర్వనాశనం చేశారని ఆవేదనతెలంగాణలో కనీస స్థానాలు కూడా అడగలేదని చర్చజూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ లో నేతల రహస్య భేటీ?తెలంగాణలో పోటీ చేసే అవకాశం దక్కని టీటీడీపీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సిటీకి చెందిన టీ-టీడీపీ నేతలు రహస్యంగా సమావేశమైన...

16 Nov 2018

'సీబీఐ' విషయంలో ఏమిటీ సాధారణ సమ్మతి?.. చ...

'సీబీఐ' విషయంలో ఏమిటీ సాధారణ సమ్మతి?.. చంద్రబాబు ప...

నమ్మకం కోల్పోతున్న సీబీఐరాజకీయ చక్రబంధంలో దర్యాప్తు సంస్థదానికంటే రాష్ట్ర సంస్థలే మేలన్న సీనియర్ న్యాయవాదిసుదీర్ఘ చర్చ అనంతరమే నిర్ణయంఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో సీబీఐ జోక్యం చేసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం ‘సమ్మతి’ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనమైంది....

16 Nov 2018

ఆస్తులు బేరం పెడుతున్న ఎయిరిండియా...రూ.8...

ఆస్తులు బేరం పెడుతున్న ఎయిరిండియా...రూ.800 కోట్లు ...

2012లో యూపీఏ ఆమోదించిన స్థిరాస్తుల విక్రయ ప్రణాళికలో భాగంగతంలో అమ్ముడుపోని ఆస్తులు కూడా వేలంరూ.55వేల కోట్ల రుణభారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థఅత్యధిక రుణభారంతో సతమతమవుతున్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియా తన స్థిరాస్తులను అమ్మకానికి పెట్టి కొంత మొత్తం సేకరించే పనిలో పడింది. ప్రభుత్వ రంగ సంస్థ ఎం...

16 Nov 2018

ప్రైవేటు రాఫెలే!

ప్రైవేటు రాఫెలే!

- ప్రభుత్వ ఒప్పందానికి ఫ్రాన్స్‌ నో! - వెలుగులోకి మరో కోణం నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నట్లుగా రాఫెల్‌ ఒప్పందం రెండు సార్వభౌమదేశాల మధ్య సమాన స్థాయిలో జరిగిన వ్యవహారం కాదని తేలిపోయింది. ఈ ఒప్పందానికి 'ప్రభుత్వ' ముద్ర వేయడానికి, భవిష్యత్తులో చోటుచేసుకునే పరిణామాల...

15 Nov 2018

తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తోన్న గజ తుఫ...

తమిళనాడు తీరం దిశగా దూసుకొస్తోన్న గజ తుఫాన్

బంగాళాఖాతంలో గజ తుఫాన్ అలజడి సృష్టిస్తోంది. తమిళనాడు తీరం దిశగా తుఫాన్ దూసుకొస్తోంది. ఇవాళ సాయంత్రం కడలూరు..పంబన్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చెన్నైకి 430 కి.మీ, నాగపట్నానికి 510 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. నైరుతి, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది....

15 Nov 2018

మరికొంత తగ్గిన 'పెట్రో' ధరలు!

మరికొంత తగ్గిన 'పెట్రో' ధరలు!

పెట్రోలు, డీజిల్ ధరల తగ్గుదల కొనసాగుతోంది. మూడు వారాలకు పైగా నిత్యమూ ధరలు తగ్గుతుండగా, గురువారం నాడు లీటరు పెట్రోలుపై 15 పైసలు, డీజిల్ పై 10 పైసల మేరకు ధరను తగ్గిస్తున్నట్టు ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 77.28క...

15 Nov 2018

రేపు నామినేషన్ దాఖలు చేస్తే కేసీఆర్‌కు ర...

రేపు నామినేషన్ దాఖలు చేస్తే కేసీఆర్‌కు రాజయోగం సిద...

వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్న కేసీఆర్11 గంటల నుంచి ఒంటి గంట వరకు మకర లగ్నం1.30 నుంచి 2.50 గంటల వరకు కుంభలగ్నంఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సెంటిమెంట్స్‌కు ఎంత ప్రాధాన్యమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో నామినేషన్ల ఘట్టం రానే వచ్చింది. రేపు కేసీఆర్ నామినేషన్ వేయనున్నారు. ఇ...

14 Nov 2018