విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం

విశాఖ స్కాం వెనక పెద్దల ప్రమేయం


విశాఖ భూకుంభకోణంపై సిట్ విచారణ సక్రమంగా జరగలేదని వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలో విలేకరులతో మాట్లాడుతూ.. సిట్ నివేదికలో తన పేరు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటివి ఎదురవుతుంటాయని, అయినా తాను భయపడనని అన్నారు. వాటిని తామేం పట్టించుకోవడంలేదని, రెవెన్యూలో పనిచేసిన వారందరికీ తెలుసునని, రెవిన్యూ మంత్రి ఈ వ్యవహరాలు చూడరని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘జిల్లాల్లో కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికారుల అజమాయిషీలో ఉండే పనులను నాకు అంటగడుతున్నారు. ప్రజలలో నా పట్ల అపోహలు సృష్టించే ప్రయత్నమే ఇది. సిట్ విచారణ పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారు. అక్కడ రికార్డులు టాంపరింగ్ జరిగింది. టాంపరింగ్ గురించి ఎందుకు పరిశోధించలేదు. ప్రభుత్వ విచారణల్లో నిజాయితీ ఎక్కడుంది? భూ కుంభకోణాలను పోలీసులు ఎలా విచారిస్తారు? సిట్‌లో రెవెన్యూ అధికారులను ఎందుకు పెట్టలేదు? రికార్డుల ట్యాంపరింగ్ జరిగిందని అధికారులు గుర్తించారు. ముఖ్యమంత్రి రెండు జీఓలు జారీ చేశారు. బీజేపీ నేత ప్రశ్నిస్తే ఒక జీఓను రద్దు చేశారు. ముఖ్యమంత్రి సన్నిహితులు ఈ కుంభకోణంలో ఉన్నారు. అందుకే ఇలా వ్యవహరిస్తున్నారు. ప్రజల తరపున నిలదీస్తున్నానని, వైఎస్సార్ కుటుంబంతో సన్నిహితంగా ఉంటున్నానని నన్ను అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారు. వాటికి నేను భయపడను. ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు ప్రభుత్వం కక్ష సాధిస్తోంద’ని వ్యాఖ్యానించారు.

‘నిభందనలకు విరుద్దంగా రాజధాని భూసేకరణ చేశారు. సుప్రీంకోర్టు స్విస్ ఛాలెంజ్ పద్దతి వద్దంటే నీవు(చంద్రబాబు) సీఆర్‌డీఏ రూల్స్ మార్చి స్విస్ ఛాలెంజ్ పద్దతే అనుసరించారు. అనుభవం తెచ్చిన పాలనలాగా ఇది లేదు. తప్పులు ఉంటే సరిదిద్దాలి. ల్యాండ్ పూలింగ్ విషయంలో ఫైల్ వేగంగా ఎలా కదిలింది. 500ఎకరాల సేకరణ వెనక పెద్దవాళ్లఎవరు? ఎంతమెత్తం చేతులుమారింది. వీటిని తేల్చలేదు. ప్రతిపాదించిన11 రోజుల వ్యవధిలోనే జీఓ ఎలా బయటకువచ్చింది. సిట్ దర్యాప్తు ఈ విధంగా సాగితే నిజాలు బయటకు వస్తాయా? సిట్ విచారణలో ప్రజలు అడిగిందేమిటి? మీరు చేసిందేమిటి? మీ అదుపాజ్ఞలలో ఉన్న పోలీసులకే ఈ కేసులో చర్యలు తీసుకోమనే అధికారం ఇస్తారా? నిజానికి ఎన్టీఆర్ సీఎంగా మీరు(చంద్రబాబు) రెవెన్యూ మంత్రిగా ఉన్నపుడు1994,నవంబర్లో జారీ అయిన జీఓ ప్రకారమే ఇది జరిగింది. అసైన్డ్ ల్యాండ్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ల భూములకు సంబంధించి ఆ జీఓ మీ ఆదేశాలమేరకు జారీ అయింది. 1977లో జారీ అయిన జీఓ ప్రకారం ఏ భూములను విక్రయించే అధికారం లేదు. సిట్ రిపోర్ట్ లో తప్పుడు పనులకు పాల్పడిన ప్రభుత్వంలోని పెద్ద ఎవరో ఎందుకు తేల్చలేద’ని పలు ప్రశ్నలు ధర్మాన లేవనెత్తారు.


PostedOn: 08 Nov 2018 Total Views: 67
మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ బంతితో మాయ చేస్తే....

18 Jan 2019

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయ...

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయనకే!

ఎన్నాళ్లకెన్నాళ్లకన్నట్లుగా.. ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడైన నెల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే అద్భుత అవకాశం తెలంగాణ ఎమ్మెల్యేలకు దక్కింది. పీడ దినాలు పూర్తి అయిన నేపథ్యంలో.. ఈ రోజు (గురువారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రెండో అసెంబ్లీ కొలువు తీరింది. తాత్కాలిక స్పీకర్ గా ముంతాజ్ అహ్మద...

17 Jan 2019

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

-చెరో 38 స్థానాల్లో పోటీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-అమేథీ, రాయబరేలీ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కేనన్న అఖిలేశ్, మాయావతి-కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలమని ధీమా-ఎస్పీ-బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న...

13 Jan 2019

త్వరలోనే ఎన్నారై పాలసీ

త్వరలోనే ఎన్నారై పాలసీ

-ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు-వంద దేశాల్లో గులాబీ జెండా ఎగరాలి-టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఎనిమిదో వార్షికోత్సవంలో నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్: ఎన్నారైల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని...

13 Jan 2019

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుక...

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి!

హైద‌రాబాద్‌: ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్ పోలీస్ మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు....

13 Jan 2019

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

-రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్‌గా ఉన్న చౌహాన్‌కు అవకాశం-అధికారికంగా వెలువడాల్సి ఉన్న ఉత్తర్వులు-తెలంగాణ సీజేగా ప్రమాణంచేసిన పది రోజులకే రాధాకృష్ణన్ బదిలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం హైకోర్టు...

13 Jan 2019

అలోక్‌వర్మ రాజీనామా

అలోక్‌వర్మ రాజీనామా

-తనపై నిరాధార ఆరోపణలు చేసి బదిలీ చేశారంటూ కేంద్రంపై ఆగ్రహం-కమిటీ ఎదుట వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించలేదని ధ్వజం-అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ప్రకటన-అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేసిన గంటల్లోనే అనూహ్య నిర్ణయం-రాకేశ్ ఆస్తానా ఫిర్యాదునే సీ...

12 Jan 2019

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

-2021 డిసెంబర్ నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర-రోదసిలోకి ముగ్గురు భారతీయులు-వ్యోమగాములకు మనదేశంలో, రష్యాలో శిక్షణ-ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 ప్రయోగం-మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి బెంగళూరు, : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా...

12 Jan 2019