హవాలా రాకెట్ గుట్టురట్టు

హవాలా రాకెట్ గుట్టురట్టు

 


-రూ.7.51 కోట్ల నగదు స్వాధీనం
-నలుగురు నిందితుల అరెస్టు..
-పరారీలో మరో నలుగురు
-రాజకీయం కోణంపై పోలీసుల ఆరా
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: నగదు సరఫరాతో ఓటర్లను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్న హవాలా ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, ఎన్నికలను పర్యవేక్షిస్తున్న స్టాటిక్ సర్వేలెన్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బుధవారం సంయుక్తంగా రట్టుచేశాయి. కీలక సమాచారాన్ని అందుకున్న ఈ బృందాలు.. సైఫాబాద్, బంజారాహిల్స్, షాహినాయత్‌గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో సోదాలు జరిపి రూ.7.51కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాయి. నలుగురిని అరెస్టు చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి సెల్‌ఫోన్‌లు, బ్యాంక్ చెక్ బుక్‌లు, ల్యాప్‌టాప్, కౌంటింగ్ మెషీన్ ఇతర సామగ్రిని పోలీసులు జప్తుచేశారు. భారీమొత్తంలో పట్టుబడ్డ ఈ నగదు వెనుక రాజకీయ కోణంపై హైదరాబాద్ పోలీసులు ఆరాతీస్తున్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కథనం ప్రకారం.. బంజారాహిల్స్ తాజ్‌కృష్ణ హోటల్ వెనుక నవీన్‌నగర్ ప్రాంతానికి చెందిన సునీల్‌కుమార్ అహుజా తన కుమారుడు ఆశిష్‌కుమార్ అహుజాతోపాటు డ్రైవర్ మహ్మద్ ఆజంఖాన్, గోషామహల్ ప్రాంతానికి చెందిన బహుభట్‌సింగ్ రాజ్‌పురోహిత్ అనే అనుచరుడితో కలిసి హవాలా వ్యాపారాన్ని నడిపిస్తున్నాడు. ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులకు అవసరం ఉంటుందని భావించిన సునీల్‌కుమార్.. ఇతర రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి భారీమొత్తంలో నగదు తెప్పించి నిల్వచేశాడు.

సునీల్‌కుమార్ ఆదేశం మేరకు బుధవారం రాజ్‌పురోహిత్ నుంచి రూ.2 కోట్లు తీసుకొస్తున్న ఆశిష్, ఆజంఖాన్‌ను నెక్లెస్‌రోడ్డు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని ఆ నగదును, వోల్వో కారును స్వాధీనం చేసుకున్నా రు. విచారణలో వీరు సునీల్‌కుమార్ వ్యవహారాన్ని వెల్లడించడంతో పోలీసులు అతని ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో మరో రూ.5.47 కోట్లు బయటపడ్డాయి. ఇదేవిధంగా రాజ్‌పురోహిత్ ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.3.50 లక్షల నగదుతోపాటు కర్నాటక ప్రభుత్వ లైసెన్స్‌తో కూడిన ఓ రివాల్వర్ దొరికింది. దీంతో అతనిపై ఆయుధ చట్టం కింద కేసు నమోదుచేశారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఇంత భారీగా నగదు పట్టుబడటం సంచలనం సృష్టించింది. ఈ నగదు వ్యవహారంపై పోలీసులు.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు ఆదాయం పన్ను (ఐటీ) విభాగానికి సమాచారాన్ని అందజేశామని, నిందితులను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. సమావేశంలో సెంట్రల్‌జోన్ డీసీపీ విశ్వప్రసాద్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్, సైఫాబాద్ ఏసీపీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.


12 బ్యాంకులకు పోలీసుల లేఖలు

ఈ ముఠాలోని ఒక్కో సభ్యుడికి కనీసం 7 బ్యాంకు ఖాతాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీరు తమ పేర్లతో డమ్మీ కంపెనీలను సృష్టించి భారీమొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఆజంఖాన్ పేరిట తప్పుడు ధ్రువీకరణపత్రాలతో ఇటీవల ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ను తెరిచి దానిద్వారా హవాలా వ్యవహారాలను నడిపినట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆ ఖాతాల వివరాలు కావాలని 12 బ్యాంకులకు పోలీసులు లేఖలు రాశారు.

విద్యాసాగర్ ఖాతాలోకి రెండు కోట్లు

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నివసిస్తున్న విద్యాసాగర్ అనే వ్యాపారి ఖాతాలోకి సునీల్‌కుమార్ అహుజా ముఠా ఇటీవల ఆన్‌లైన్ ద్వారా దాదాపు రూ.2 కోట్లు జమచే సి.. ఆ తర్వాత ఆ సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీచేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో విద్యాసాగర్‌తోపాటు ఈ ముఠాతో సంబంధాలు పెట్టుకున్న జయేశ్‌పటేల్, శైలేశ్, కిషన్‌లాల్‌చంద్ అనే వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమెరికాలో డిగ్రీ.. హైదరాబాద్‌లో హవాలా దందా!

ఈ ముఠాలో సభ్యుడైన ఆశిష్ అహుజా.. అమెరికాలో డిగ్రీ పూర్తిచేసుకుని ఈ ఏడాది మేలో నగరానికి తిరిగివచ్చాడు. ఆ తర్వాత తన తండ్రి సునీల్‌కుమార్ అహుజా వ్యాపార లావాదేవీలను చూసుకుంటూ హవాలా వ్యాపారిగా మారాడు. ఇందుకోసం ఆశిష్.. తన డ్రైవర్ ఆజంఖాన్ పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటితో బ్యాంక్ ఖాతాలు తెరిపించడంతోపా టు డొల్ల కంపెనీలను ఏర్పాటుచేయించి అతనికి భారీగా కమీషన్ ఇచ్చినట్టు తేలింది. దీంతో విచారణ కోసం సునీల్‌కుమార్, ఆశిష్‌కుమార్‌తోపాటు ఆజంఖాన్, రాజ్‌పురోహిత్‌లను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ కేసు తదుపరి దర్యాప్తును సీసీఎస్‌కు అప్పగిస్తున్నట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించే రాజకీయ పార్టీలు, నాయకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.

భారీ కమీషన్లకు కక్కుర్తిపడి..

హవాలా వ్యాపారంలో ఆరితేరిన ఈ ముఠా.. భారీ కమిషన్ల కోసం ఎన్నికలను టార్గెట్‌గా చేసుకున్నారని, అందుకోసమే వీరు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దమొత్తంలో నగదును తీసుకువచ్చి నిల్వచేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.సాధారణంగా హవాలా వ్యాపారంలో 0.50 శాతం నుంచి 2 శాతం వరకు కమీషన్ తీసుకునే వీరు.. ఎన్నికల సమయంలో రాజకీయనాయకుల నుంచి 5 నుంచి 10 శాతం కమీషన్ పొందవచ్చని ఆశపడినట్టు తెలుస్తున్నది.

 


PostedOn: 09 Nov 2018 Total Views: 68
మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ బంతితో మాయ చేస్తే....

18 Jan 2019

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయ...

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయనకే!

ఎన్నాళ్లకెన్నాళ్లకన్నట్లుగా.. ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడైన నెల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే అద్భుత అవకాశం తెలంగాణ ఎమ్మెల్యేలకు దక్కింది. పీడ దినాలు పూర్తి అయిన నేపథ్యంలో.. ఈ రోజు (గురువారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రెండో అసెంబ్లీ కొలువు తీరింది. తాత్కాలిక స్పీకర్ గా ముంతాజ్ అహ్మద...

17 Jan 2019

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

-చెరో 38 స్థానాల్లో పోటీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-అమేథీ, రాయబరేలీ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కేనన్న అఖిలేశ్, మాయావతి-కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలమని ధీమా-ఎస్పీ-బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న...

13 Jan 2019

త్వరలోనే ఎన్నారై పాలసీ

త్వరలోనే ఎన్నారై పాలసీ

-ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు-వంద దేశాల్లో గులాబీ జెండా ఎగరాలి-టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఎనిమిదో వార్షికోత్సవంలో నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్: ఎన్నారైల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని...

13 Jan 2019

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుక...

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి!

హైద‌రాబాద్‌: ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్ పోలీస్ మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు....

13 Jan 2019

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

-రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్‌గా ఉన్న చౌహాన్‌కు అవకాశం-అధికారికంగా వెలువడాల్సి ఉన్న ఉత్తర్వులు-తెలంగాణ సీజేగా ప్రమాణంచేసిన పది రోజులకే రాధాకృష్ణన్ బదిలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం హైకోర్టు...

13 Jan 2019

అలోక్‌వర్మ రాజీనామా

అలోక్‌వర్మ రాజీనామా

-తనపై నిరాధార ఆరోపణలు చేసి బదిలీ చేశారంటూ కేంద్రంపై ఆగ్రహం-కమిటీ ఎదుట వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించలేదని ధ్వజం-అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ప్రకటన-అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేసిన గంటల్లోనే అనూహ్య నిర్ణయం-రాకేశ్ ఆస్తానా ఫిర్యాదునే సీ...

12 Jan 2019

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

-2021 డిసెంబర్ నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర-రోదసిలోకి ముగ్గురు భారతీయులు-వ్యోమగాములకు మనదేశంలో, రష్యాలో శిక్షణ-ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 ప్రయోగం-మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి బెంగళూరు, : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా...

12 Jan 2019