పెద్ద నోట్ల రద్దు అనాలోచితం

పెద్ద నోట్ల రద్దు అనాలోచితం

 

-ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు
-అన్ని వర్గాలను ఛిన్నాభిన్నం చేశారు
-ఎన్డీఏ సర్కారుపై నిప్పులు కురిపించిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్
కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు.. రోజులపాటు తెల్లవారకముందే బ్యాంకుల ముందు పడిగాపులు.. ఏటీఎంల వద్ద నిరీక్షణ.. డబ్బు కోసం ప్రజల అగచాట్లు.. ఆడ బిడ్డల పెండ్లిళ్ల కోసం దాచిపెట్టిన సొమ్ము కోసం అమ్మానాన్నల ఆక్రందనలు.. సరిగ్గా రెండేండ్ల కిందట (నవంబర్ 8, 2016) ఎక్కడ చూసినా ఇదే దృశ్యం ఆవిష్కతమైంది. ప్రధాని నరేంద్రమోదీ సర్కారు రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ఇదే రోజున నిర్ణయం తీసుకుంది. దేశంలో పేరుకుపోతున్న నల్లధనాన్ని వెలికి తీయడానికి, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు, ఉగ్రవాదం, నక్సలిజాన్ని అణిచివేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడి నేటికి (గురువారం) రెండేండ్లు అవుతున్నది. దీన్ని విజయోత్సాహంగా బీజేపీ సర్కారు భావిస్తుండగా.. అతి పెద్ద విషాదంగా విపక్షాలు అభివర్ణించాయి.
పెద్ద నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ తీవ్రంగా దుయ్యబట్టారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద ఆర్థిక తప్పిదమని విమర్శించారు. ఈ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, ఇందుకు సమాజంలోని ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యమని అన్నారు. దేశ ఆర్థిక వృద్ధి ఒడిదుడుకులకు, రూపాయి పతనానికి ఎన్డీఏ సర్కారు విధానాలే కారణమని నిప్పులు చెరిగారు. 2016లో ప్రధాని మోదీ తీసుకున్న దురదృష్టకర నిర్ణయానికి నేటితో రెండేండ్లు. మోదీ నిర్ణయం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. ఆర్థిక వ్యవస్థను తప్పుదోవ పట్టించేందుకు దుస్సాహసమైన నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు చేసిన గాయాలు ప్రస్తుతం కనిపించకపోవచ్చు. కాలంతోపాటే అవి కనిపిస్తాయి. నోట్ల రద్దు నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థ ఎలా గాడి తప్పిందో తెలుసుకోవడానికి ఈ రోజు ఉపయోగపడుతుంది. నోట్ల రద్దు నిర్ణయం అనాలోచితం.. అసంబద్ధం.

మోదీ చర్యల వల్ల దేశం సుదీర్ఘకాలంపాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మన్మోహన్‌సింగ్ విమర్శలు గుప్పించారు. సమాజంలోని ప్రతి ఒక్కరిపైనా నోట్ల రద్దు దుష్పభ్రావం పడిందని పేర్కొన్నారు. వయసు, కులం, మతం, లింగభేదం, వృత్తి వంటి అంశాలతో నిమిత్తం లేకుండా నోట్ల రద్దు యావత్ జాతిని తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది.సామాన్యులు, చిరు వ్యాపారులు, ఉద్యోగులు, యువత తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఉద్యోగాలపై ఇది ప్రత్యక్ష ప్రభావం చూపింది. సామాన్యుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. గాయాలను మాన్పించే శక్తి కాలానికి ఉంటుంది. కానీ, దురదృష్టవశాత్తూ నోట్ల రద్దు మిగిల్చిన గాయాలు రోజులు గడుస్తున్నా కొద్దీ ఇంకా తీవ్రంగా వేధిస్తున్నాయి అని అన్నారు. ఆర్థిక విధానాల్లో కచ్చితత్వాన్ని, దార్శనికతను కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ శుక్రవారం దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

ఆర్థిక వ్యవస్థకు ఆశాదీపం
-నోట్ల రద్దుపై కేంద్ర మంత్రి జైట్లీ
-పన్ను వసూళ్లు పెరిగాయి.. ఎగవేతలు తగ్గాయి
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు, పన్ను వసూళ్లను పెంచేందుకే నోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా ఇంపాక్ట్ ఆఫ్ డిమానిటైజేషన్ పేరుతో తన ఫేస్‌బుక్ పేజీలో జైట్లీ సుదీర్ఘ వివరణిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లో నోట్ల రద్దు కీలకమైనది. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావం చూపించింది. 2014లో ఎన్డీఏ సర్కారు ఏర్పడిన కొత్తలో దేశంలో ఆదాయపన్ను చెల్లింపుదారులు 3.8 కోట్ల మంది ఉంటే.. ప్రస్తుతం వారి సంఖ్య 6.86 కోట్లకు చేరింది. దేశ ప్రజలపై ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్ని గణనీయంగా తగ్గించాం. మరోవైపు పన్ను వసూళ్లు భారీగా పెరిగాయి. దేశ ప్రజలకు మెరుగైన జీవన విధానాన్ని అందజేశామని, గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పించాం. విదేశాల్లో భారతీయులకు ఉన్న బ్యాంకు ఖాతాలు, లావాదేవీలు, ఆస్తుల వివరాల్ని ప్రభుత్వం సేకరించింది. చట్టాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
ఇప్పటివరకూ దేశంలో 17.42 లక్షల అక్రమ ఖాతాలను గుర్తించాం. ఆ ఖాతాదారులను ప్రశ్నించి వివరాలను రాబడుతున్నాం. నిబంధనలు ఉల్లంఘించిన, పన్నులు ఎగవేసిన వారిని శిక్షించాం. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగడం వల్ల ప్రస్తుతం అవి అధికమొత్తంలో రుణాలు ఇస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం పన్నుల ఎగవేత తగ్గింది. దేశాన్ని నగదు నుంచి డిజిటల్ లావాదేవీల వైపు తీసుకెళ్లేందుకే ఎన్డీఏ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. తద్వారా పన్ను ఆదాయం, పన్ను చెల్లింపులు పెరిగాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు 20 శాతం మేర పెరిగాయి. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో 86.35 లక్షల మంది ఆదాయ పన్ను చెల్లింపుదారులు అదనంగా చేరనున్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల చెల్లింపులు రెండింతలు అయ్యాయి అని జైట్లీ వివరించారు.

ప్రణాళికబద్ధంగా చేపట్టిన కుంభకోణం
పెద్ద నోట్ల రద్దు అనేది అమాయకత్వంతో చేసిన పని కాదు.. చాలా జాగ్రత్తగా అమలు చేసిన ఆర్థిక కుంభకోణం. ప్రణాళికబద్ధంగా చేపట్టిన క్రూరమైన కుట్ర. తన సూటు, బూటు మిత్రులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి ప్రధాని మోదీ తీసుకొచ్చిన పథకం ఇది. నోట్ల రద్దు వెనుక ఉన్న నిజనిజాలు ఇంకా బయటికి రావాల్సి ఉన్నది. పెద్ద నోట్ల రద్దుపై ఇంకా మాయ మాటలతో మోసం చేయాలని చూడటం జనాన్ని అవమానించడమే
-కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
ఆర్బీఐ స్వాధీనానికి కేంద్రం ప్రయత్నం
ఆర్బీఐని స్వాధీనం చేసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నది. ఆర్బీఐ బోర్డులోని తన మనుషుల ద్వారా ఈ మేరకు పావులు కదుపుతున్నది. ఎన్నికల సంవత్సరం కావడంతో లక్ష కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఆర్బీఐ ఇందుకు అనుమతించడం లేదు. ఆర్బీఐని తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నది. మరోవైపు రాష్ర్టాల వారీగా ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పొత్తులు పెట్టుకోవాలి. బీజేపీని ఓడించడానికి ఈ ఫార్ములా ఎంతగానో ఉపయోగపడుతుంది
- కేంద్ర మాజీ మంత్రి చిదంబరం


PostedOn: 09 Nov 2018 Total Views: 131
వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవ...

07 Jun 2019

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజ...

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజీమంత్రి జూ...

నాగర్‌కర్నూల్‌ టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజ...

07 Jun 2019

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యో...

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబ...

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గ...

07 Jun 2019

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ ల...

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రిక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మ...

07 Jun 2019

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో ...

07 Jun 2019

పోరాడుతున్న వెస్టిండీస్

పోరాడుతున్న వెస్టిండీస్

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆ...

07 Jun 2019

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) త...

06 Jun 2019

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయ...

06 Jun 2019