‘ఎన్టీఆర్’లో మీ పాత్ర ఎలా అనిపించిందన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇదీ!

‘ఎన్టీఆర్’లో మీ పాత్ర ఎలా అనిపించిందన్న ...

 

సినిమా అద్భుతంగా ఉంది
పాత రోజులు గుర్తొస్తున్నాయి
అందరూ తప్పక చూడాల్సిన చిత్రం
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. బుధవారం విడుదలైన ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో బాలకృష్ణ, క్రిష్, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితరులతో కలిసి వీక్షించారు.

సినిమా చాలా అద్భుతంగా ఉందని, పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు’ అని పేర్కొన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని, బాలకృష్ణ బాగా నటించారని కొనియాడారు.


PostedOn: 11 Jan 2019 Total Views: 69




నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్యకేసు దర్యాప్తుపై అనుమానాలు

నాన్న హత్య కేసు దర్యాప్తుపై అనుమానాలు ఉన్నాయని వైయస్‌ వివేకానందరెడ్డి కుమార్తె వైయస్‌ సునీతా రెడ్డి అన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.ఇందులో భాగంగానే తమ కుటుంబంపై నిందారోపణలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. సంఘటనా స్థలంలోనే సీఐ శంకరయ్య ఉ...

24 Mar 2019

బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర...

బోణి కొట్టిన చెన్నై జట్టు.. బౌలర్ల పాత్ర కీలకం..

చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ సీజన్-12 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై జట్టు తొలి విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టు కేవలం 70 పరుగుల మాత్రమే చేసింది. బెంగళూరు బ్యాట్స్‌మెన్స్‌లో పా...

24 Mar 2019

కత్తులు దూస్తున్న తండ్రీకుమార్తె... రసవత...

కత్తులు దూస్తున్న తండ్రీకుమార్తె... రసవత్తరంగా రాజ...

వేలుపట్టి నడకలు నేర్పించిన నాన్న. తండ్రి కళ్లతో ప్రపంచాన్ని చూసిన కూతురు. పోటీ ప్రపంచంలో ఎలా నెగ్గుకురావాలో దిశానిర్దేశం చేసిన డాడీ కాంపిటీటీవ్ వాల్డ్‌లో తండ్రికే గర్వకారణం నిలిచిన తనయ. ఇప్పుడు ఈ తండ్రీ కూతుళ్ల మధ్యే నేరుగా పోటీ ఉంటే.? బుడిబుడి అడుగులు నేర్పిన నాన్నతో, ఆ కూతురు సమరానికి సిద్దమం...

24 Mar 2019

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

ఏపీ సీఈవోకు సునీతా రెడ్డి ఫిర్యాదు..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేలా టీడీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన కుమార్తె సునీతా రెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కేసు దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఈసీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి విన్నవి...

21 Mar 2019

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరా...

అత్యాచారం చేసి, బాధితురాలి దుస్తులతో పరార్..పార్కు...

ఆడపిల్లలపై ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ అత్యాచారాలు మాత్రం ఆడగంలేదు. మగవాడి చేతిలో బలికాక తప్పడంలేదు. కాగా తాజా దుబాయ్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన బాద్మాష్ గాడు ఆ తరువాత ఆమే దుస్తువులు తీసుకొని పరారైన వైనమిది. ఇక వివరాల్లోకి వెళితే దుబాయ్‌లోని ఓ పబ్లిక...

20 Mar 2019

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబాని...

కర్నూలు జిల్లాలో విషాదం... ఒకే కుటుంబానికి చెందిన ...

కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. నందికొట్కూరు పట్టణం బుడగజంగం కాలనీకి చెందిన వీరాంజనేయులు ఆయన భార్య వసంత ఇద్దరు పిల్లలు రామలక్ష్మి, రాజేష్ తో కలిసి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నారు. గ్యాస్ స్టౌలు రిపేర్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రామాంజ...

20 Mar 2019

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో.....

ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో..? ప్రొ. కే...

ఏపీలో ఎన్నికలపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇటు ప్రచారలతో అధికార పార్టీ టీడీపీ, ప్రతిపక్ష పార్టీ వైసీపీ క్షణం కూడా వృధా కాకుండా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. కాగా అప్పుడే ఏపీలో ఎవరు చక్రం తిప్పబోతున్నారని కూడా తాజాగా ఓ సర్వేలో తెలిపోయింది. ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం సృష్టించ...

20 Mar 2019

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్...

ఆర్సీబీకి అందని ద్రాక్షలా ఐపీఎల్‌ టైటిల్‌!

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఆశతో ఎదురుచూస్తున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లిగ్) రానే వచ్చేస్తోంది. ఐపీఎల్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానుంది. కాగా ఇప్పటికే తమ జట్లు మైదానాల్లో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ టీమ్ కూడా తన జట్టుతో మైదానంలో ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం ...

19 Mar 2019