ఇది మూడో పానిపట్టు యుద్ధం

ఇది మూడో పానిపట్టు యుద్ధం

 


- వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని సైద్ధాంతిక పోరాటంగా అభివర్ణించిన అమిత్‌షా
- అయోధ్యలో అతి త్వరలో ఆలయం నిర్మిస్తామని ప్రకటన
- కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తున్నదని విమర్శ
- సార్వత్రిక ఎన్నికల్లో 282 సీట్లతో అధికారంలోకి వస్తామని ధీమా
- అట్టహాసంగా ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

న్యూఢిల్లీ, : వచ్చే లోక్‌సభ ఎన్నికల్ని సైద్ధాంతిక పోరాటంగా బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అభివర్ణించారు. మరాఠాలకు, ఆఫ్ఘన్ సైన్యాలకు మధ్య 1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధానికి 2019 సార్వత్రిక ఎన్నికలకు పోలిక ఉందని చెప్పారు. ఈ యుద్ధంలో మరాఠాల ఓటమితో దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఆంగ్లేయుల పాలనలో 200 ఏండ్లు భారతీయులు బానిసలుగా జీవించారని అమిత్‌షా గుర్తుచేశారు. అత్యంత నిర్ణయాత్మకమైన 2019 ఎన్నికల్లో ప్రజలు బీజేపీకే పట్టం కట్టాలని, లేదంటే మళ్లీ బానిసత్వంలోకి వెళ్లే ప్రమాదం ఉందని అన్నారు. 2019 ఎన్నికల్లో 282 స్థానాలు సాధించి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని, ప్రధాని మోదీ రెండోసారి అధికారం చేపడుతారని ధీమా వ్యక్తంచేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో రెండు రోజులపాటు జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని అమిత్‌షా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించారు.

ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వేలాది మంది ప్రతినిధులను ఉద్దేశించి అమిత్‌షా మాట్లాడుతూ.. అయోధ్యలో ప్రస్తుతం ఉన్న స్థలంలోనే అతి తొందరలోనే భవ్యమైన రామాలయాన్ని నిర్మిస్తామని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని, త్వరలో సమస్య పరిష్కారమయ్యే దిశగా బీజేపీ అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. రాజ్యాంగబద్ధంగానే అయోధ్య వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ఆలయం విషయంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ తమ వైఖరిని స్పష్టం చేయాలని అమిత్‌షా డిమాండ్ చేశారు.

ఆలయానికి కాంగ్రెస్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న మహాకూటమిని మిథ్యగా ఆయన అభివర్ణించారు. కూటమికి నాయకత్వం గానీ, పాలసీగానీ లేవని ఎద్దేవా చేశారు. కేవలం అధికారం కోసం వారు జట్టు కట్టారని విమర్శించారు. సాంస్కృతిక జాతీయవాదం, పేదల సంక్షేమ పథకాలు, ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం తమను రెండోసారి అధికారంలోకి తీసుకువస్తాయని అమిత్‌షా ధీమా వ్యక్తంచేశారు. మజ్బూత్ సర్కార్ (సమర్థ ప్రభుత్వం) కావాలా? లేదంటే మజ్బూర్ సర్కార్ (నిస్సహాయ ప్రభుత్వం) కావాలా? అనేది ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలంతా మోదీ లాంటి గట్టి నేత ఉన్న మజ్బూత్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

దేశంలో మోదీకి ఉన్న ప్రజాదరణ మరే నేతకు లేదని చెప్పారు. రాఫెల్ ఒప్పందంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలు అసత్యమని న్యాయస్థానాల్లో తేలిందని చెప్పారు. 1987 నుంచి మోదీ తనకు తెలుసునని, అప్పట్నుంచీ ఇప్పటివరకూ ఆయన నేతృత్వంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఓటమిని చూడలేదని తెలిపారు.

మోదీని ఓటమెరుగని విజేతగా అభివర్ణించారు. యూపీలో అత్త-అల్లుడు (మాయావతి, అఖిలేష్) కూటమి తమకు పోటీ కాదని చెప్పారు. యూపీలో గత ఎన్నికల్లో మొత్తం 80 స్థానాలకు 73 గెలిచామని, వచ్చే ఎన్నికల్లో 74 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని తెలిపారు. మోదీపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సోనియా, రాహుల్‌లు భయపడుతున్నారని, నేషనల్ హెరాల్డ్ కేసులో వారిద్దరూ బెయిల్‌పై ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. పౌరసత్వ బిల్లుపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. దేశ భద్రత రాహుల్ బాబాకు, అతడి భజన బృందానికి పట్టదని ఎద్దేవా చేశారు. ఈబీసీ బిల్లుతో అగ్రకులాల్లోని నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరనున్నదని పేర్కొన్నారు. మోదీ హయాంలో సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయని చెప్పారు. లక్ష్యిత దాడులతో భారత్ ఏకంగా అమెరికా, ఇజ్రాయెల్ సరసన చేరిందని తెలిపారు.

 

 

 

 

 


PostedOn: 12 Jan 2019 Total Views: 43
మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ బంతితో మాయ చేస్తే....

18 Jan 2019

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయ...

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయనకే!

ఎన్నాళ్లకెన్నాళ్లకన్నట్లుగా.. ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడైన నెల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే అద్భుత అవకాశం తెలంగాణ ఎమ్మెల్యేలకు దక్కింది. పీడ దినాలు పూర్తి అయిన నేపథ్యంలో.. ఈ రోజు (గురువారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రెండో అసెంబ్లీ కొలువు తీరింది. తాత్కాలిక స్పీకర్ గా ముంతాజ్ అహ్మద...

17 Jan 2019

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

-చెరో 38 స్థానాల్లో పోటీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-అమేథీ, రాయబరేలీ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కేనన్న అఖిలేశ్, మాయావతి-కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి-వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలమని ధీమా-ఎస్పీ-బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న...

13 Jan 2019

త్వరలోనే ఎన్నారై పాలసీ

త్వరలోనే ఎన్నారై పాలసీ

-ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు-వంద దేశాల్లో గులాబీ జెండా ఎగరాలి-టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఎనిమిదో వార్షికోత్సవంలో నిజామాబాద్ ఎంపీ కవిత హైదరాబాద్: ఎన్నారైల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని...

13 Jan 2019

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుక...

.అందరూ ‘హాక్‌ ఐ’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి!

హైద‌రాబాద్‌: ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా ఉన్న హైదరాబాద్ పోలీస్ మొబైల్ అప్లికేషన్ హాక్ ఐకి వచ్చిన సెల్‌ఫోన్ మిస్సింగ్ ఫిర్యాదులపై దర్యాప్తు చేసి 24 మొబైల్ ఫోన్లను రికవరీ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. రికవరీ చేసిన సెల్‌ఫోన్లను బాధితులకు అప్పగించారు....

13 Jan 2019

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

-రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్‌గా ఉన్న చౌహాన్‌కు అవకాశం-అధికారికంగా వెలువడాల్సి ఉన్న ఉత్తర్వులు-తెలంగాణ సీజేగా ప్రమాణంచేసిన పది రోజులకే రాధాకృష్ణన్ బదిలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం హైకోర్టు...

13 Jan 2019

అలోక్‌వర్మ రాజీనామా

అలోక్‌వర్మ రాజీనామా

-తనపై నిరాధార ఆరోపణలు చేసి బదిలీ చేశారంటూ కేంద్రంపై ఆగ్రహం-కమిటీ ఎదుట వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించలేదని ధ్వజం-అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ప్రకటన-అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేసిన గంటల్లోనే అనూహ్య నిర్ణయం-రాకేశ్ ఆస్తానా ఫిర్యాదునే సీ...

12 Jan 2019

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

-2021 డిసెంబర్ నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర-రోదసిలోకి ముగ్గురు భారతీయులు-వ్యోమగాములకు మనదేశంలో, రష్యాలో శిక్షణ-ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 ప్రయోగం-మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి బెంగళూరు, : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా...

12 Jan 2019