గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

గగన్‌యాన్‌లో మహిళా వ్యోమగామి!

 

 


-2021 డిసెంబర్ నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర
-రోదసిలోకి ముగ్గురు భారతీయులు
-వ్యోమగాములకు మనదేశంలో, రష్యాలో శిక్షణ
-ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్-2 ప్రయోగం
-మొదటిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు
-ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి

బెంగళూరు, : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ ప్రాజెక్టు ద్వారా 2021 డిసెంబర్ నాటికి ముగ్గురు భారత వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు. వ్యోమగామి బృందంలో మహిళ కూడా ఉండే అవకాశం ఉందని తెలిపారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో శుక్రవారం శివన్ మీడియాతో మాట్లాడుతూ... గతేడాది ఇస్రో సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల గురించి వివరించారు. భారత అంతరిక్ష చరిత్రలో గగన్‌యాన్ కీలక మలుపు అని చెప్పారు. ఈ మానవ సహిత యాత్రకు సంబంధించి ఇస్రో ప్రత్యేకంగా హ్యూమన్ స్పేస్ ైఫ్లెట్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ సెంటర్‌కు సీనియర్ శాస్త్రవేత్త ఉన్నికృష్ణన్ నాయర్ డైరెక్టర్‌గా ఉంటారని, డాక్టర్ కే హట్టన్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇంజనీరింగ్, హ్యూమన్ సైన్స్ అనే రెండు విభాగాలు ఉన్నాయని తెలిపారు.

ఇంజనీరింగ్ విభాగంలో ఉండే లాంచ్ వెహికల్, క్రూ మాడ్యూల్, సర్వీస్ మాడ్యూల్‌లో ఇస్రోకు ప్రావీణ్యత ఉందని, అయితే హ్యూమన్ సైన్స్ విభాగంలో వ్యోమగాముల ఎంపిక, శిక్షణ, వారికి అనువైన వాతావరణం రూపొందించే అంశాలు ఇస్రోకు కొత్త అని చెప్పారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు ఈ ఏడాది అధిక ప్రాధాన్యమిస్తామని శివన్ తెలిపారు. 2020 డిసెంబర్‌లో తొలి మానవ రహిత రోదసి యాత్రను, 2021 జూలైలో రెండో యాత్రను చేపడతామని, ఇవి పూర్తయిన తర్వాత 2021 డిసెంబర్‌లో మానవ సహిత యాత్ర చేపట్టనున్నట్లు వివరించారు. గగన్‌యాన్‌కు సంబంధించి వ్యోమగాములకు ప్రాథమిక శిక్షణ మనదేశంలోనే ఇస్తామని, తదుపరి అడ్వాన్స్‌డ్ శిక్షణ రష్యాలో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వ్యోమగాముల బృందంలో మహిళ కూడా ఉండాలని, అదే తమ లక్ష్యమని చెప్పారు. పురుషులతో పాటు మహిళలకూ శిక్షణ ఇవ్వాల్సి ఉందన్నారు. వ్యోమగాముల ఎంపికపై స్పందిస్తూ... భారత వాయుసేన సహాయంతో భారతీయులే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారని, చివరి దశలో మాత్రం విదేశీ సంస్థ సహకారం కూడా తీసుకుంటామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం విజయవంతమైతే మానవులను స్వతంత్రంగా రోదసిలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ ఘనత సాధిస్తుంది. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ గగన్‌యాన్ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తూ 2022 నాటికి భారత పుత్రిక లేదా పుత్రుడు అంతరిక్షంలోకి జాతీయ జెండాను మోసుకెళతారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది.

చైనాతో పోటీపడుతున్నాం
చంద్రుడిపైకి భారత్ చేపడుతున్న రెండో ప్రయోగమైన చంద్రయాన్-2ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మధ్య ఈ ప్రయోగాన్ని చేపట్టాలని తొలుత నిర్ణయించినా, కొన్ని పరీక్షలు నిర్వహించలేకపోయిన కారణంగా ప్రయోగాన్ని ఏప్రిల్‌కు వాయిదా వేసినట్లు వివరించారు. పదేండ్ల కిందట ప్రయోగించిన చంద్రయాన్-1కు ఇది అడ్వాన్స్‌డ్ వర్షన్ అని చెప్పారు. రూ.800 కోట్ల వ్యయంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ ప్రయోగం చేపడతున్నట్లు తెలిపారు. చంద్రయాన్-2లో ఆర్బిటార్, ల్యాండర్, రోవర్ ఉంటాయన్నారు. రోవర్ అంతరిక్ష ప్రయోగాల విషయంలో చైనాతో భారత్ ఏమాత్రం వెనుకబడి లేదని శివన్ స్పష్టం చేశారు. చంద్రుడి ఆవలివైపునకు చైనా రోవర్‌ను పంపిందని, అయితే ఇంతవరకు ఎవరూ చేరని చంద్రుడి దక్షిణ ధ్రువం వైపు భారత్ వెళుతున్నదని వివరించారు. ఆ ప్రాంతంపై ఇప్పటివరకూ ఎవరూ పరిశోధనలు జరుపలేదని, అక్కడ నీరు ఉండే అవకాశం ఉందన్నారు.

2020 నాటికి సూర్యుడిపై ప్రయోగాలు
గతేడాది 26 రోదసి ప్రయోగాలు చేపట్టినట్లు శివన్ తెలిపారు. ఇస్రో చరిత్రలోనే అత్యంత బరువైన ఉపగ్రహం జీశాట్-11ను కూడా గతేడాది ప్రయోగించారు. అలాగే జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 క్రూ మాడ్యూల్‌ను కూడా పరీక్షించారు. ఇక ఈ ఏడాది ఇస్రో 32 ప్రయోగాలు చేపట్టనుంది. ఇందులో 14 రాకెట్లు, 17 ఉపగ్రహాలు, ఒక టెక్ డెమో మిషన్ ఉండనుంది. జనవరి 17న ఉన్నతి(యూనీస్పేస్ నానో శాటిలైట్ అసెంబ్లీ అండ్ ట్రైనింగ్ బై ఇస్రో) ప్రోగ్రామ్‌ను ఇస్రో ప్రారంభించనుంది. పునర్వివినియోగ అంతరిక్ష వాహక నౌకను కూడా ఈ ఏడాది పరీక్షించనున్నారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ఆదిత్య-ఎల్1 ప్రయోగాన్ని 2020 నాటికి చేపట్టేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నది. ప్రపంచంలోనే అత్యంత తేలికైన, చవకైన వాహన నౌక ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఈ ఏడాది జూలైలో పరీక్షించేందుకు ఇస్రో సిద్ధమవుతున్నది.

 

 


PostedOn: 12 Jan 2019 Total Views: 107
వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవ...

07 Jun 2019

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజ...

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజీమంత్రి జూ...

నాగర్‌కర్నూల్‌ టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజ...

07 Jun 2019

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యో...

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబ...

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గ...

07 Jun 2019

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ ల...

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రిక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మ...

07 Jun 2019

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో ...

07 Jun 2019

పోరాడుతున్న వెస్టిండీస్

పోరాడుతున్న వెస్టిండీస్

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆ...

07 Jun 2019

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) త...

06 Jun 2019

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయ...

06 Jun 2019