అలోక్‌వర్మ రాజీనామా

అలోక్‌వర్మ రాజీనామా

 

-తనపై నిరాధార ఆరోపణలు చేసి బదిలీ చేశారంటూ కేంద్రంపై ఆగ్రహం
-కమిటీ ఎదుట వాదనలు వినిపించుకునే అవకాశం కల్పించలేదని ధ్వజం
-అందుకే పదవికి రాజీనామా చేస్తున్నట్లు సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన ప్రకటన
-అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ డీజీగా బదిలీ చేసిన గంటల్లోనే అనూహ్య నిర్ణయం
-రాకేశ్ ఆస్తానా ఫిర్యాదునే సీవీసీ యథాతథంగా తన నివేదికలో పేర్కొన్నట్లు విమర్శ
-ఆత్మవిమర్శ చేసుకోవాలంటూ కేంద్రానికి హితవు

న్యూఢిల్లీ,: సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్‌వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించి విస్మయానికి గురిచేశారు. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆయన్ను తప్పించి అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ విభాగానికి డైరెక్టర్ జనరల్‌గా గురువారం రాత్రి బదిలీ చేయడంతో మనస్తాపం చెందిన వర్మ గంటల వ్యవధిలోనే ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభలో కాంగ్రెస్‌పక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రతినిధి జస్టిస్ ఏకే సిక్రీల నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఎదుట తన వాదనలను వినిపించుకునే అవకాశం కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా వర్మ వాపోయారు. కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ కార్యదర్శికి వర్మ శుక్రవారం ఒక లేఖ రాశారు. కేంద్రం అవమానకర రీతిలో, కనీసం తన వాదనలు కూడా వినకుండా ఏకపక్షంగా బదిలీ చేసిందని 1979వ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వర్మ (61) తన లేఖలో ఆరోపించారు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఎవరో చేసిన ఆరోపణలకు తనను బలి చేశారని విమర్శించారు.

సహజ న్యాయ సూత్రాన్ని విస్మరించారు
ప్రధాని నేతృత్వంలోని కమిటీ సహజ న్యాయ సూత్రాన్ని పూర్తిగా విస్మరించింది. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నన్ను తప్పించేందుకు విచారణ ప్రక్రియను పూర్తిగా తప్పుదోవ పట్టించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిటీ (సీవీసీ) నివేదికను అడ్డం పెట్టుకుని వాస్తవాలను నిర్ధారించుకోకుండానే ఏకపక్షంగా నన్ను తొలిగించారు. కమిటీ ఎదుట నా వాదనల్ని వినిపించుకునే అవకాశం నాకు కల్పించలేదు. సీబీఐ విచారణ జరుపుతున్న వ్యక్తి (రాకేశ్ ఆస్తానా) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే సీవీసీ తన నివేదికను రూపొందించింది అని వర్మ విమర్శలు గుప్పించారు. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానా సంతకం చేసి ఇచ్చిన ఫిర్యాదును యథాతథంగా సీవీసీ తన నివేదికలో పేర్కొందని ఆరోపించారు. సీవీసీ రిపోర్టులో కొత్త అంశాలేవీ లేవని పేర్కొన్నారు. సీబీఐలో అంతర్గత కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్ కమిటీ ఎదుట ఆస్తానా ఒక్కసారి కూడా హాజరు కాలేదని చెప్పారు. సీవీసీ నివేదికలో పేర్కొన్న అంశాలకు జస్టిస్ పట్నాయక్ ఆమోదముద్ర వేయలేదని వర్మ గుర్తుచేశారు. దేశంలో ఇప్పటికీ సీబీఐ అత్యంత విశ్వసనీయమైన, సమర్థమైన, కీలక సంస్థ అని పేర్కొన్నారు. కేంద్రం సీవీసీని అడ్డుపెట్టుకుని సీబీఐ లాంటి స్వతంత్ర సంస్థను ఎలా ఇబ్బందులకు గురిచేస్తుందనేందుకు నా బదిలీ సంఘటనే తాజా ఉదాహరణ. ఈ విషయంలో కేంద్రం ఇప్పటికైనా సమిష్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి అని పేర్కొన్నారు.

ఆరోపణలన్నీ అవాస్తవం
తనపై నిరాధారమైన, నిష్ప్రయోజనమైన, తప్పుడు ఆరోపణలు చేసి పదవి నుంచి తొలిగించారని కేంద్రంపై వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. తనపై మోపిన అభియోగాలపై కనీసం విచారణ కూడా జరుపలేదని ధ్వజమెత్తారు. అవినీతి కేసుల దర్యాప్తు విషయంలో బయటి శక్తుల ప్రమేయం లేకుండా సీబీఐ స్వతంత్రంగా పనిచేయాలి. సంస్థ సమగ్రత, విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరిగినా వాటిని నిలువరించాను. కానీ, న్యాయపరమైన సమ్మతి లేకుండా అక్టోబర్ 23, 2018న కేంద్రం, సీవీసీ నాకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేశాయి. నిరాధారమైన ఆరోపణలతో నన్ను బలవంతంగా, నిరవధికంగా సెలవులపై పంపారు. మరో 21 రోజుల్లో నా పదవీకాలం ముగియనున్న తరుణంలో సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా బదిలీ చేశారు అని పేర్కొన్నారు. 2017, జూలై 31 నాటికే తాను పదవీ విమరణ చేశానని, కానీ కేంద్రం సీబీఐ డైరెక్టర్‌గా మరో అవకాశం కల్పించిందని వర్మ చెప్పారు. 2019, జనవరి 31 వరకు సీబీఐ డైరెక్టర్‌గా తన పదవీకాలం ఉందని, ఇంతలోనే బదిలీ చేశారని పేర్కొన్నారు. అయితే, ఇప్పటికే తన పదవీ విరమణ వయస్సు దాటిపోయింది కాబట్టి, అగ్నిమాపక, హోంగార్డుల డీజీగా కూడాతాను సేవలందించలేనని చెప్పారు. తన పదవీ విరమణ ఇప్పట్నుంచే అమల్లోకి వస్తున్నట్లు గుర్తించాలని లేఖలో పేర్కొన్నారు.

మచ్చ లేకుండా నాలుగు దశాబ్దాలుగా సేవలు
ప్రజా సేవలో నాలుగు దశాబ్దాలకు పైగా ఉన్నానని, కానీ ఎన్నడూ ఒక మచ్చ కూడా తనపై పడలేదని అలోక్ వర్మ చెప్పారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా సేవలందించాను. అండమాన్-నికోబార్ దీవుల్లో పోలీసు బలగాలకు నేతృత్వం వహించాను. పుదుచ్చేరి, మిజోరాం రాష్ర్టాల్లో పనిచేశాను. ఢిల్లీ జైళ్లశాఖకు, సీబీఐకి నేతృత్వం వహించిన అరుదైన రికార్డు నాది. ఇన్నేండ్లపాటు సేవ చేసే భాగ్యం కల్పించిన ఇండియన్ పోలీస్ సర్వీసెస్‌కు, నాకు సహకరించిన సంస్థలు, అధికారులకు కృతజ్ఞతలు అని తెలిపారు.

దేశంలో సూపర్ ఎమర్జెన్సీ
అధికార బీజేపీ రాజకీయ లబ్ధి కోసం సీబీఐని దుర్వినియోగపరుస్తున్నది. స్వయం ప్రతిపత్తి కలిగిన ఆర్బీఐలాంటి సంస్థలను కూడా నాశనం చేస్తున్నది. పౌరసత్వ ముసాయిదా బిల్లుకు మతం రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నది. ఈ రోజు పార్లమెంట్‌లో బలం ఉందికదా అని పౌరసత్వ బిల్లును ఆమోదించుకున్నారు. రేపు కేంద్రంలో ప్రభుత్వం మారితే ఈ బిల్లును మార్చదా? మోదీ పాలనను చూస్తుంటే దేశంలో సూపర్ ఎమర్జెన్సీ ఉన్నట్లు కనిపిస్తున్నది
-మమతాబెనర్జీ (పశ్చిమబెంగాల్ సీఎం)

సీవీసీ భుజాల మీద నుంచి రాజకీయ బుల్లెట్లు
కేంద్రం.. సీవీసీ భుజాల మీద నుంచి రాజకీయ బుల్లెట్లు పేల్చుతున్నది. సీవీసీ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నది. ఎలాంటి అవినీతి ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలను ప్రామాణికంగా తీసుకొని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తొలిగించాలంటూ సీవీసీ ఎలా సిఫారసు చేస్తుంది? పంజరంలోని చిలుక(సీబీఐ) ఎగిరిపోకుండా ప్రభుత్వం అందులోనే బంధించింది. ఎందుకంటే ఆ చిలుక బయటికి వస్తే తమకు ఎక్కడ ముప్పు వాటిల్లుతుందేమోనని ప్రభుత్వ భయం.
-అభిషేక్ సింఘ్వి, కపిల్ సిబల్ (కాంగ్రెస్ నాయకులు)

రాఫెల్ భయం వల్లే అలోక్‌ను తొలిగించారు
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై అలోక్‌వర్మ దర్యాప్తునకు ఆదేశిస్తాడేమోనన్న భయంతో ప్రధాని మోదీ కుట్రకు తెరలేపారు. సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్‌వర్మను తొలిగించడానికి రెండు నెలలుగా తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని రకాల అవకాశాలను వినియోగించుకొని చివరికి ఆయనను తొలిగించారు.
-కేజ్రీవాల్ (ఢిల్లీ సీఎం)

సీబీఐ డైరెక్టర్ బదిలీ అక్రమం
సీబీఐ డైరెక్టర్‌ను ఆగమేఘాలమీద బదిలీ చేయడం అక్రమం, అధికారాలను దుర్వినియోగం చేయడమే. సుప్రీం తీర్పుతో సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ విధుల్లో చేరడం ఇష్టంలేని ప్రధాని మోదీ వెంటనే ఆయనను ఫైర్‌సర్వీసెస్ విభాగానికి బదిలీ చేయడం దారుణం. రాఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే ఈ బదిలీ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారు.
-మాజీ ఎంపీ మల్లు రవి

ప్రధానే చట్టాన్ని ధిక్కరిస్తే..
రాఫెల్ కుంభకోణం బయటపడుతుందన్న భయంతోనే ప్రధాని మోదీ సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మను బదిలీ చేశారు. సీబీఐపై ఇటువంటి చర్య గత 55 సంవత్సరాలుగా ఎన్నడూ జరుగలేదు. అందుకే అలోక్‌వర్మ రాజీనామా చేశారు. ప్రధాని స్థాయిలోనే చట్టాల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుంది?

 

 

 

 

 

 


PostedOn: 12 Jan 2019 Total Views: 118
వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వర్షం కారణంగా టాస్‌ నిలిపివేత

వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్, శ్రీలంక మధ్య పోరుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అంపైర్లు టాస్‌ను వాయిదా వేశారు. కాగా మైదానంలో వర్షం కురుస్తుండటంతో పిచ్‌ మొత్తం కవర్లతో కప్పేశారు. దీంతో కొద్దిసేపు టాస్‌ని నిలిపివేశారు. ఈ మ్యాచ్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభమయ్యే అవ...

07 Jun 2019

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజ...

ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి వర్సెస్‌ మాజీమంత్రి జూ...

నాగర్‌కర్నూల్‌ టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో పెంట్లవెల్లి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, మాజీమంత్రి జూపల్లి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎంపీపీగా పెంట్లపల్లి నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన జూపల్లి మద్దతుదారుడు రాజ...

07 Jun 2019

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యో...

తనకి మర్యాద ఇవ్వలేదని మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబ...

తానూ షాప్ కి వస్తే నిలబడి మర్యాద ఇవ్వలేదని కోపంతో ఓ మెడికల్ షాప్ ఉద్యోగిని చితకబాదాడు ఓ బీజేపి నేత సోదరుడు .. ఇక వివరాల్లోకి వెళ్తే బీహార్‌లోని బెత్తై నగరంలో ఈ నెల 3న ఈ సంఘటన జరిగింది.. జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలైన రేణు దేవి సోదరుడు పిను రాత్రి 9:10 గ...

07 Jun 2019

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ ల...

చివర్లో వచ్చి చితక్కొట్టి ..ప్రపంచ కప్ లో నైల్ రిక...

ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్‌ బౌలర్‌ నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్‌ బౌలర్ల ధాటికి ఆసీస్‌ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్‌ స్మ...

07 Jun 2019

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

పోరాడినా ఫలితం దక్కలేదు : విండీస్ ఓటమి

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడిన వెస్టిండీస్ జట్టు ఓటమి పాలైంది. తడబడుతూ బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టు క్రమంగా నిలదొక్కుకుని, ప్రత్యర్థికి సవాల్ విసిరెలాంటి స్కోరు చేయగలిగింది. 288 పరుగులు చేసి గౌరవం దక్కించుకుంది. అయితే ఛేదనలో విండీస్ పోరాడింది. కానీ, చివర్లో ...

07 Jun 2019

పోరాడుతున్న వెస్టిండీస్

పోరాడుతున్న వెస్టిండీస్

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు పదో మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతోంది. ఆచి తూచి ఛేదన మొదలు పెట్టిన వెస్టిండీస్ కష్టాల్లో పడింది. కీలక వికెట్లు కోల్పోయి.. పరుగుల కోసం ప్రయత్నిస్తోంది. మొదటి ఓవర్లలో ఆసీస్ బౌలింగ్ను ఎదుర్కోవడానికి తిప్పలు పడ్డా తరువాత నిదానంగా స్కోరు చేసుకుంటూ వెళ్లారు విండీస్ ఆ...

07 Jun 2019

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

నిదానంగా ఆసీస్ బ్యాటింగ్

వరల్డ్ కప్ టోర్నీలో పదో మ్యాచ్ లో ఆసీస్, విండీస్ తలపడుతున్నాయి. టాస్ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పచెప్పిన విండీస్.. బౌలింగ్ లో చక్కని ప్రదర్శన చేస్తోంది. ఆసీస్ బ్యాట్స్ మెన్ పరుగులు చేయడానికి అవస్థలు పడుతున్నారు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో స్మిత్ తన సహచరుడు స్టోయినిస్‌(19) త...

06 Jun 2019

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ఐదు వికెట్లు కోల్పోయిన ఆసీస్

ప్రపంచ కప్‌లో భాగంగా ఈరోజు పదో మ్యాచ్ వెస్టిండీస్‌-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతోంది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలుచుకున్న రెండు టీములకు ఈ మ్యాచ్ కీలకమైనది. ఈమ్యాచ్ లో గెలిచి పై చేయి సాధించాలని రెండు జట్లూ పట్టుదలతో ఉన్నాయ...

06 Jun 2019