తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

తాత్కాలిక సీజేగా ఆర్‌ఎస్ చౌహాన్!

 



-రాధాకృష్ణన్ బదిలీ నేపథ్యంలో అత్యంత సీనియర్‌గా ఉన్న చౌహాన్‌కు అవకాశం
-అధికారికంగా వెలువడాల్సి ఉన్న ఉత్తర్వులు
-తెలంగాణ సీజేగా ప్రమాణంచేసిన పది రోజులకే రాధాకృష్ణన్ బదిలీ

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ నియమితులయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల్లో చౌహాన్ అత్యంత సీనియర్ జడ్జి. తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ తొట్టతిల్ బీ రాధాకృష్ణన్‌ను కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీచేయాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియార్టీ విషయంలో రాధాకృష్ణన్ తర్వాత రెండోస్థానంలో ఉన్న జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ తాత్కాలిక సీజేగా వ్యవహరించే అవకాశం ఉన్నది. అయితే, అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నది. ఛత్తీస్‌గఢ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేసిన రాధాకృష్ణన్ నిరుడు జూలైలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జనవరి ఒకటి నుంచి ఉమ్మడి హైకోర్టు విడిపోవడంతో జస్టిస్ రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించారు. కానీ, పదిరోజులు మాత్రమే ఆయన ఈ పదవిలో కొనసాగడం.. కలకత్తా హైకోర్టు సీజేగా బదిలీకావడం న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

జస్టిస్ చౌహాన్ నేపథ్యం..
రాజస్థాన్‌కు చెందిన జస్టిస్ చౌహాన్ 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి న్యాయవాదపట్టా పొందారు. అదే ఏడాది రాజస్థాన్ బార్‌కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదైన చౌహాన్.. ఆ రాష్ట్ర హైకోర్టులో పదేండ్లపాటు ప్రాక్టీస్‌చేశారు. 2005 జూన్ 13న రాజస్థాన్ హైకో ర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2015లో కర్ణాటక హైకోర్టుకు, 2018లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. తర్వాత తెలంగాణకు ఆప్షన్ ఇవ్వడంతో హైకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. సీనియార్టీ విషయంలో ఆయన రెండోస్థానంలో ఉన్నారు.

 


PostedOn: 13 Jan 2019 Total Views: 46




పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చ...

18 Feb 2019

జయరామ్‌ హత్య కేసు నిందితులు నాంపల్లి కోర...

జయరామ్‌ హత్య కేసు నిందితులు నాంపల్లి కోర్టుకు తరలి...

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేశ్‌రెడ్డితో పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను మూడు రోజుల క్రితం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరగా కోర్టు మూడురోజులకే అనుమతి ఇచ్చింది. అయితే విచారణలో నిందితులు ఇచ్చిన వివరాలతో పోలీసులు సంతృప్తి చెందడం లేదు. తమ ...

17 Feb 2019

అమర వీరుల కుటుంబాలకు కేటీఆర్ విరాళం

అమర వీరుల కుటుంబాలకు కేటీఆర్ విరాళం

పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కి 25 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు అందించారు. హైదరాబాద్ లోని సౌతర్న్ సెక్టార్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో ఐజీపి జి హెచ్ పి రాజు ను కలిసి ఈ మేరకు చెక్కులను కేటీఆర్ అందించారు. తన 25 లక్షల విరాళం తో పాటు తన మ...

17 Feb 2019

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నిక...

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌...

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం (ఫిబ్రవరి 14) ఉత్తర్వులు జారీ చేశారు. ...

14 Feb 2019

కారు బాంబు – సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర...

కారు బాంబు – సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 12 ...

జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కారు బాంబుతో 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలితీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది శ్రీనగర్ వెళ్తుండగా.. కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. ...

14 Feb 2019

సీఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్‌లో మందుపాతరత...

సీఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్‌లో మందుపాతరతో దాడి, 18...

పుల్వామా జిల్లాలోని లెత్‌పురా దగ్గర శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై జరిగిన ఐఈడీ పేలుడులో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, 44 మంది గాయపడ్డారని పోలీసులు బీబీసీకి తెలిపారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న ఒక బస్సు గురువారం మధ్యాహ్నం లేత్‌పురా దగ్గర ప్రయాణిస్తుండగా మందుపాతర...

14 Feb 2019

ఆయకట్టుకు మేఘా పైపులతో నీరు

ఆయకట్టుకు మేఘా పైపులతో నీరు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే తొలిసారిగా అవుట్‌లెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) అనే ఇజ్రాయేల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పైపుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ ప్...

14 Feb 2019

డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వచ్చిన శ...

డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వచ్చిన శిఖా చౌద‌రి

కొన్ని రోజులు మీడియాల్లో వ‌స్తున్న క‌థ‌నాలు,డైరెక్ట్‌గా ప‌ద్మ‌శ్రీ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఇక డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వ‌చ్చారు శిఖా చౌద‌రి. జయరామ్‌ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని.. కేసు విచారణలో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహ...

12 Feb 2019