త్వరలోనే ఎన్నారై పాలసీ

త్వరలోనే ఎన్నారై పాలసీ

 

 


-ఎన్నారైల సంక్షేమానికి రూ.100 కోట్లు
-వంద దేశాల్లో గులాబీ జెండా ఎగరాలి
-టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే సెల్ ఎనిమిదో వార్షికోత్సవంలో నిజామాబాద్ ఎంపీ కవిత

హైదరాబాద్: ఎన్నారైల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, ఇందుకోసం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, త్వరలోనే ఎన్నారై పాలసీని ప్రకటించుకుందామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణభవన్‌లో శనివారం టీఆర్‌ఎస్ ఎన్నారై యూకే (లండన్) శాఖ ఎనిమిదో వార్షికోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్‌చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాలు, గల్ఫ్ లాంటి దేశాల్లో తెలంగాణ బిడ్డల సమస్యలు ఒక్కోరకంగా ఉన్నాయన్నారు. అక్కడి వారికి ఇక్కడి పార్టీకి వారధులుగా ఎన్నారై సెల్ పనిచేయాలని కోరారు. అందరం కలిసి పనిచేస్తే దేశానికే కాదు ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తంచేశారు. విదేశాల్లో తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను ప్రొఫెసర్ జయశంకర్ సార్ వివరించారని, ఆయన సూచనలతో విదేశాల్లో ఉండే తెలంగాణ బిడ్డలు వివిధ పేర్లతో సంఘాలు పెట్టుకొని పని చేశారని తెలిపారు. ఆ సమయంలో రకరకాలుగా అవమానాలు, అవహేళనలు ఎదుర్కొన్నారని, నవ్విన నాప చేను పండిన చందంగా తెలంగాణ సాధించుకున్నామని పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్ ఎన్నారై శాఖలు ప్రస్తుతం 33 దేశాల్లో విస్తరించాయని, రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వంద దేశాల్లో గులాబీ జెండా ఎగిరేలా కృషిచేస్తామని ఎంపీ కవిత వివరించారు. మన ఇండస్ట్రియల్ పాలసీని చూసి అమెరికా వాసులు ఇలాంటి పాలసీ తమ వద్ద లేదన్న విషయం తెలంగాణ బిడ్డలుగా మనకు గర్వకారణమన్నారు. విదేశాల్లో ఉన్న ఎన్నారై విభాగం ప్రతినిధులు సోషల్ మీడియా అనే పదునైన ఆయుధం ద్వారా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రపంచానికి తెలిపేలా కేసీఆర్‌కు అండగా నిలువాలని బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు వార్షికోత్సవాలను లండన్‌లో జరుపుకొన్నామని తెలిపారు. పార్టీకి, సమాజానికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడాన్ని గర్వంగా భావిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఎన్నారై సెల్ యూకే అధ్యక్షుడు అశోక్ దూసరి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, టాంకాం చైర్మన్ రంగారెడ్డి, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, న్యూజిలాండ్ శాఖ కోశాధికారి అభిలాష్ రంగినేని, యూఎస్ ప్రతినిధులు సుధీర్, సురేశ్, రమేశ్, టీఆర్‌ఎస్ ఖతార్ ప్రతినిధి అభిలాష్ బండి, దక్షిణాఫ్రికా ప్రతినిధి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాగృతి సదస్సుకు అన్నా హజారే
ఎంపీ కల్వకుంట్ల కవిత వెల్లడి
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల18న జరిగే ఇంటర్నేషనల్ యూత్ లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ (టీజేఐవైఎల్‌సీ) ప్రారంభకార్యక్రమానికి సామాజిక ఉద్యమకర్త అన్నాహజారే ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సదస్సుకు హాజరుకావాలని గవర్నర్ నరసింహన్‌ను శనివారం రాజ్‌భవన్‌లో కలిసి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 20న జరిగే ముగింపు కార్యక్రమానికి వచ్చేందుకు గవర్నర్ నరసింహన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలిపారు. మొదటి రోజు యువత అభివృద్ధిపై ప్రముఖ జర్నలిస్ట్ శేఖర్ గుప్తా చర్చా గోష్ఠిని నిర్వహిస్తారని పది వేర్వేరు అంశాలపై చర్చా గోష్ఠులు జరగనున్నాయని తెలిపారు. 103 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు సదస్సుకు హాజరవుతారని అన్నారు. 16 దేశాల నుంచి 70 మంది వక్తలు, 40 మంది ప్రత్యేక ఆహ్వానితులు వస్తారని వివరించారు.

 


PostedOn: 13 Jan 2019 Total Views: 79
నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ ...

25 Apr 2019

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకునే రానా దగ్గుబాటి తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకొని పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. 'బాహుబలి' సినిమాలో...

25 Apr 2019

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సాయి సాత్విక్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి.. క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల 22న సాయంత్రం మాచర్ల నెహ్రూ నగర్‌లో ఆరు సంవత్సరాల సిద్ధు సాయి సాత్విక్ కిడ్నాప్ అయ్యాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ప...

25 Apr 2019

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ ...

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ పోలీసులు

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. రోహిత్‌ను హత్య చేసింది ఆయన భార్య అపూర్వ శుక్లానే అని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల కస్టడీలో విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వైవాహిక జీవితంలో గొడవల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ న...

25 Apr 2019

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ...

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ....

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ని విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యకార్యక...

25 Apr 2019

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడల...

23 Apr 2019

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బ...

23 Apr 2019

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్త...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ ...

కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తాం. కానీ ఓ ఈ కోతి చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన కొంటే పని నెట్టింట్లో కోతి వైరల్‌గా మారింది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజం...

23 Apr 2019