ఎస్పీ-బీఎస్పీ పొత్తు

ఎస్పీ-బీఎస్పీ పొత్తు

 


-చెరో 38 స్థానాల్లో పోటీ.. కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి
-అమేథీ, రాయబరేలీ స్థానాలు మాత్రం కాంగ్రెస్‌కేనన్న అఖిలేశ్, మాయావతి
-కాంగ్రెస్‌ను తమ కూటమిలో కలుపుకోబోమని వెల్లడి
-వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని మట్టి కరిపించగలమని ధీమా
-ఎస్పీ-బీఎస్పీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్న రాహుల్
-అవినీతి-గూండాయిజం పొత్తుగా వర్ణించిన బీజేపీ

వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకనాటి ప్రత్యర్థి పక్షాలు సమాజ్‌వాదీ, బహుజన్ సమాజ్‌వాదీ పార్టీలు చేతులు కలిపాయి. కాంగ్రెస్ పార్టీని దూరంపెట్టి ఈ రెండు పార్టీలు యూపీలోని 80 సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీ, రాయబరేలీ స్థానాల్లో మాత్రం పోటీ చేయరాదని నిశ్చయించాయి. మిగిలిన రెండు స్థానాలను అజిత్‌సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్డీకి కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లక్నో/న్యూఢిల్లీ, జనవరి 12: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒకప్పుడు కత్తులు దూసుకున్న సమాజ్‌వాదీ, బహుజన్‌సమాజ్‌వాదీ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నాయి. రెండు పార్టీల అధినేతలు మాయావతి, అఖిలేశ్ యాదవ్ ఈ మేరకు శనివారం లక్నోలో సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ సీట్లకుగాను చెరో 38 స్థానాల్లో పోటీ చేయాలని మిగిలిన నాలుగింటిలో రెండో కాంగ్రెస్‌కు, మరో రెండు ఇతర పార్టీలకు వదిలివేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.

తమ కూటమిలో కాంగ్రెస్‌ను కలుపుకోవద్దని నిర్ణయించినప్పటికీ అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల్లో మాత్రం తమ అభ్యర్థులను పోటీ పెట్టరాదని ఎస్పీబీఎస్పీ నిర్ణయించాయి. ఆ రెండు స్థానాల నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ (అమేథీ), యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ (రాయ్‌బరేలీ) ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. బువా (మేనత్త), భతీజా (మేనల్లుడు)గా పేరొందిన మాయావతి, అఖిలేశ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విలేకరుల సమావేశం అనంతరం గురు-చేలా (గురుశిష్యులు నరేంద్రమోదీ, అమిత్‌షా)లకు ఇక నిద్ర పట్టదు అని అన్నారు. లోక్‌సభ ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించినట్టుగానే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాషాయ పార్టీని తమ కూటమి మట్టి కరిపించగలమన్న విశ్వాసం తమకుందని పేర్కొన్నారు. గత (2014) లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలు గెలుపొందగా, దాని మిత్రపక్షం అప్నాదళ్ రెండు సీట్లను గెలుచుకుంది. సమాజ్‌వాదీ పార్టీ ఐదు, కాంగ్రెస్ రెండు స్థానాలను గెలుచుకోగా, బీఎస్పీ ఎక్కడా గెలుపొందలేదు.

 

 


PostedOn: 13 Jan 2019 Total Views: 95
నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ ...

25 Apr 2019

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకునే రానా దగ్గుబాటి తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకొని పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. 'బాహుబలి' సినిమాలో...

25 Apr 2019

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సాయి సాత్విక్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి.. క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల 22న సాయంత్రం మాచర్ల నెహ్రూ నగర్‌లో ఆరు సంవత్సరాల సిద్ధు సాయి సాత్విక్ కిడ్నాప్ అయ్యాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ప...

25 Apr 2019

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ ...

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ పోలీసులు

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. రోహిత్‌ను హత్య చేసింది ఆయన భార్య అపూర్వ శుక్లానే అని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల కస్టడీలో విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వైవాహిక జీవితంలో గొడవల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ న...

25 Apr 2019

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ...

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ....

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ని విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యకార్యక...

25 Apr 2019

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడల...

23 Apr 2019

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బ...

23 Apr 2019

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్త...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ ...

కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తాం. కానీ ఓ ఈ కోతి చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన కొంటే పని నెట్టింట్లో కోతి వైరల్‌గా మారింది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజం...

23 Apr 2019