ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయనకే!

ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం.. స్పీకర్ ఆయ...

ఎన్నాళ్లకెన్నాళ్లకన్నట్లుగా.. ఎన్నికలు పూర్తయి.. ఫలితాలు వెల్లడైన నెల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసే అద్భుత అవకాశం తెలంగాణ ఎమ్మెల్యేలకు దక్కింది. పీడ దినాలు పూర్తి అయిన నేపథ్యంలో.. ఈ రోజు (గురువారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ రెండో అసెంబ్లీ కొలువు తీరింది. తాత్కాలిక స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన సభ స్టార్ట్ అయ్యింది.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత స్పీకర్ ప్రమాణ స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తున్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో ఆయన తన ప్రమాణస్వీకారాన్ని పూర్తి చేశారు. మహిళా సభ్యుల్లో రేఖా నాయక్.. బానోతు హరిప్రియ నాయక్ లు ఇంగ్లిషులో ప్రమాణం చేయగా.. మిగిలిన వారంతా తెలుగులో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ వార్త రాస్తున్న సమయానికి పలువురు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరన్న దానిపై గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న సస్పెన్స్ తొలగిపోయింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. స్పీకర్ ఎన్నికకు మిగిలిన పార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలపటంతో పోచారం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయిన పోచారం.. స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా వ్యవహరించిన ఆయన ఇప్పటివరకూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. సీనియర్ ఎమ్మెల్యేగా మంచి అనుభవంతో పాటు.. చక్కటి ఇంగ్లిషు మాట్లాడతారన్న పేరుంది. దీంతో.. సభా నిర్వహణ ఆయనకు ఏ మాత్రం కష్టం కాదన్న భావన ఉంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నేతగా ఉన్న పోచారం.. పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న ఆయనకు తొలి అసెంబ్లీలో మంత్రి పదవి దక్కింది. తాజాగా.. స్పీకర్ గా ఆయన్ను కేసీఆర్ ఎంపిక చేశారు. తనకు అత్యంత దగ్గరైన పోచారం.. టీడీపీ నాటి నుంచి ఉన్న సన్నిహితంతోనే ఆయన్ను స్పీకర్ గా సెలెక్ట్ చేశారన్న మాట వినిపిస్తోంది.


PostedOn: 17 Jan 2019 Total Views: 94
నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ ...

25 Apr 2019

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకునే రానా దగ్గుబాటి తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకొని పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. 'బాహుబలి' సినిమాలో...

25 Apr 2019

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సాయి సాత్విక్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి.. క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల 22న సాయంత్రం మాచర్ల నెహ్రూ నగర్‌లో ఆరు సంవత్సరాల సిద్ధు సాయి సాత్విక్ కిడ్నాప్ అయ్యాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ప...

25 Apr 2019

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ ...

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ పోలీసులు

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. రోహిత్‌ను హత్య చేసింది ఆయన భార్య అపూర్వ శుక్లానే అని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల కస్టడీలో విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వైవాహిక జీవితంలో గొడవల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ న...

25 Apr 2019

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ...

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ....

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ని విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యకార్యక...

25 Apr 2019

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడల...

23 Apr 2019

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బ...

23 Apr 2019

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్త...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ ...

కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తాం. కానీ ఓ ఈ కోతి చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన కొంటే పని నెట్టింట్లో కోతి వైరల్‌గా మారింది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజం...

23 Apr 2019