మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు

మెల్‌బోర్న్‌లో భారత్ మెరుపులు


ఆస్ట్రేలియా గడ్డపై 2-1తో టెస్ట్‌ సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన టీమిండియా.. మూడు వన్డేల సిరీస్‌ను సైతం 2-1తో నెగ్గి ఈ చారిత్రక పర్యటనను ఘనంగా ముగించింది. మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కోహ్లిసేన మెరిసింది. లెగ్‌ స్పిన్నర్‌ చహల్‌ బంతితో మాయ చేస్తే.. బ్యాట్‌తో మహేంద్రసింగ్‌ ధోని(87: 114 బంతులు,6ఫోర్లు నాటౌట్‌), కేదార్‌ జాదవ్‌(61:57బంతులు, 7ఫోర్లు)లు కడవరకు పోరాడి భారత్‌కు విజయాన్నందించారు.


చహల్‌ మ్యాజిక్‌
టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. చహల్‌ (6/42) దాటికి 48.4 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. హ్యాండ్‌స్కోంబ్‌ (58) అర్ధసెంచరీ మినహా.. అలెక్స్‌ క్యారీ(5), ఫించ్‌(14) ఖవాజా (34), షాన్‌ మార్ష్‌( 39), మ్యాక్స్‌వెల్‌ (26), రిచర్డ్‌సన్‌(16), ఫించ్‌(14), సిడిల్‌ (10)లు విఫలమయ్యారు. భారత్‌ బౌలర్లలో చహల్‌ 6 వికెట్లు తీయగా.. భువనేశ్వర్‌, షమీలు రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.


231 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు వన్డేల్లో రాణించిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (9) ఈ మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సిడిల్‌ బౌలింగ్‌లో మార్ష్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ కోహ్లితో శిఖర్‌ ధావన్‌ జట్టు స్కోర్‌ను 50 పరుగులు దాటించాడు. ఈ తరుణంలో శిఖర్‌ (23), స్టోయినిస్‌కు రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. తర్వాత అనూహ్యంగా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ వచ్చిన ఎంఎస్‌ ధోని వచ్చిరావడంతోనే మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కానీ మ్యాక్సీ జారవిడచడంతో ధోని ఊపిరి పీల్చుకున్నాడు. ధోనితో కలిసి కోహ్లి ఆచితూచి ఆడుతూ.. మూడో వికెట్‌కు 54 పరుగులు జోడించాడు. అనంతరం కోహ్లి(46) కీపర్‌ క్యారీకి క్యాచ్‌ ఇచ్చి అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు.

ధోని ‘హ్యాట్రిక్‌’!
కేదార్‌ జాదవ్‌తో ధోని జాగ్రత్తగా ఆడాడు. ఈ క్రమంలో ధోని 74 బంతుల్లో 3 ఫోర్లతో కెరీర్‌లో 70వ అర్థ సెంచరీతో ఈ సిరీస్‌లో హ్యాట్రిక్‌ సాధించాడు. తొలి రెండు వన్డేల్లో ఈ జార్ఖండ్‌ డైనమైట్ అర్థసెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. ఎప్పటిలానే ఎలాంటి సంబరాలు లేకుండా మరుసటి బంతికి ధోని సిద్దమయ్యాడు. ఇక ధోనికి మద్దతుగా జాదవ్‌ కూడా ఆచితూచి ఆడుతూ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 52 బంతుల్లో 5 ఫోర్లతో కెరీర్‌లో మూడో హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివర్లో కొంత ఉత్కంఠ నెలకొనినా.. ధోని, జాదవ్‌లు బౌండరీలు బాదడంతో భారత్‌ నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆసీస్‌ బౌలర్లలో రిచర్డ్సన్‌, సిడిల్‌, స్టోయినిస్‌లకు తలో వికెట్‌ దక్కింది. ఇక ఈ మ్యాచ్‌ ప్రారంభంలో వరణుడు కొంత టెన్షన్‌ పెట్టడంతో ఆటకు కాసేపు అంతరాయ కలిగింది. ఆరు వికెట్లతో చెలరేగిన చహల్‌కు మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ వరించగా.. సిరీస్‌లో హ్యాట్రిక్‌ హాఫ్‌ సెంచరీలతో రాణించిన ధోనికి మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌ దక్కింది.


PostedOn: 18 Jan 2019 Total Views: 103
నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

నాలుగో విజయాన్ని నమోదుచేసిన బెంగళూరు

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్ సీజన్‌లో నాలుగో విజయాన్ని నమోదుచేసింది. బుధవారం జరిగిన పోరులో 17 పరుగుల తేడాతో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లకు 202 పరుగులు చేసింది. డివిలియర్స్‌ ...

25 Apr 2019

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

రానా బరువు తగ్గడానికి కారణం అదేనా

సినిమా కి తగ్గట్టుగా తన ఆహార్యాన్ని మార్చుకుంటూ ప్రతి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న హీరోల లో రానా దగ్గుబాటి కూడా ఒకరు. కేవలం కంటెంట్ ఉన్న సినిమాలను మాత్రమే ఒప్పుకునే రానా దగ్గుబాటి తన పాత్రకు తగ్గట్టుగా తన శరీరాన్ని సైతం మార్చుకొని పాత్రలో ఒదిగిపోతూ ఉంటాడు. 'బాహుబలి' సినిమాలో...

25 Apr 2019

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం..

గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం చోటు చేసుకుంది. సాయి సాత్విక్ అనే ఏడేళ్ల బాలుడిని గుర్తుతెలియని దుండగులు అతి కిరాతకంగా చంపి.. క్వారీలో పడేసి వెళ్లిపోయారు. ఈనెల 22న సాయంత్రం మాచర్ల నెహ్రూ నగర్‌లో ఆరు సంవత్సరాల సిద్ధు సాయి సాత్విక్ కిడ్నాప్ అయ్యాడు. ఈ విషయాన్ని రైల్వే స్టేషన్‌లోని సీసీ టీవీ ప...

25 Apr 2019

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ ...

రోహిత్‌ను చంపింది.. అతని భార్యే: ఢిల్లీ పోలీసులు

ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ తివారీ హత్య కేసు కీలక మలుపు తీసుకుంది. రోహిత్‌ను హత్య చేసింది ఆయన భార్య అపూర్వ శుక్లానే అని పోలీసులు నిర్ధారించారు. మూడు రోజుల కస్టడీలో విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు. వైవాహిక జీవితంలో గొడవల కారణంగానే ఆమె ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఈ న...

25 Apr 2019

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ...

మంత్రి జగదీష్‌ రెడ్డి కారును అడ్డుకున్న ఎస్‌ఎఫ్‌ఐ....

తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి కాన్వాయ్‌ని విద్యార్థి సంఘం అడ్డుకుంది. ఇంటర్‌ బోర్డులో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యకార్యక...

25 Apr 2019

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్లలో దారుణం

హైదరాబాద్‌ జీడిమెట్ల షాపూర్‌నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో అర్ధరాత్రి ఓ తల్లి తన కూతురు గొంతు కోసి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. చిన్నారి మృతి చెందగా, తల్లి సుశీలను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సుశీల భర్త నారాయణరెడ్డి జీడిమెట్ల పారిశ్రామికవాడల...

23 Apr 2019

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో వాన బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు వానలకు నలుగురు చనిపోయారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రాంతంలో పిడుగులు పడి ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఇక హైదరాబాద్‌లో భారీ వర్షం బీభత్సం చేసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం చేశాయి. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. ఎల్బ...

23 Apr 2019

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్త...

చావింటికి వచ్చి ఓదార్చిన వానరం...రోదిస్తున్న మహిళ ...

కోతులు ఇళ్లలోకి వస్తే భయపడతారు వెళ్లగొట్టడానికి ప్రత్నిస్తాం. కానీ ఓ ఈ కోతి చేష్టలు చూస్తే ముచ్చటేస్తోంది. కోతెమ్మ చేసిన కొంటే పని నెట్టింట్లో కోతి వైరల్‌గా మారింది. అసలు కోతి చేసిన ఆ పనేంటో తెలియాలంటే స్టోరీలోకి ఎంటర్‌ కావాల్సిందే. కొన్ని సార్లు మన మద్య అకస్మాత్తుగా జరిగే సన్నివేశాలు నిజం...

23 Apr 2019