డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వచ్చిన శిఖా చౌద‌రి

డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వచ్చిన శ...

కొన్ని రోజులు మీడియాల్లో వ‌స్తున్న క‌థ‌నాలు,డైరెక్ట్‌గా ప‌ద్మ‌శ్రీ ఆరోప‌ణ‌లు చేయ‌డంతో ఇక డైరెక్ట్‌గా తానే మీడియా ముందుకు వ‌చ్చారు శిఖా చౌద‌రి. జయరామ్‌ హత్యతో తనకు ఏ విధమైన సంబంధం లేదని.. కేసు విచారణలో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. జయరామ్ మ‌ర‌ణించిన వెంట‌నే త‌న ప్రాజెక్టు రిపోర్టును ఇంటికి తీసుకువెళ్లారని, దాన్ని తెచ్చుకునేందుకే ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. తన అత్త పద్మశ్రీతో తనకు సత్సంబంధాలు లేవని, ఆమె వస్తే తాను ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదని.. అందుకే అమెరికా నుంచి ఆమె వచ్చేలోపే ఇంటికి వెళ్లి ప్రాజెక్టు రిపోర్టు తెచ్చుకున్నట్లు చెప్పారు. పద్మశ్రీ ఆరోపిస్తున్నట్లుగా జయరాం ఇంట్లోంచి తానెలాంటి విలువైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోలేదన్నారు.

ఇక హ‌త్య జ‌రిగిన రోజు జయరామ్ తనతో మాట్లాడారని చెప్పారు శిఖా. 29వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తన ఇంటికి వచ్చారని, రాత్రి 8 గంటల వరకు తన కొత్త ప్రాజెక్టు పని గురించి చర్చించినట్లు చెప్పారు. తిరిగివెళ్తూ తన ప్రాజెక్టు రిపోర్టును జయరాం వెంట తీసుకెళ్లారని చెప్పారు. మరుసటి రోజు ఉదయం తనకు ఫోన్‌ చేసి డబ్బులు అవసరం ఉన్నాయని రూ. కోటి సర్దాల్సిందిగా అడిగారు. ఎందుకని అడిగేంత అవకాశం ఇవ్వకుండానే వెంటనే ఫోన్‌ పెట్టేశారు. 31వ తేదీ ఉదయం కూడా ఫోన్‌ చేసి డబ్బు అడిగారని.. ఎందుకని అడిగితే ఏడాదిక్రితం తాను ఓ వ్యక్తి వద్ద రూ. 4 కోట్లు అప్పుగా తీసుకున్నట్లు చెప్పాడ‌న్నారు. ఆ అప్పును తీర్చాల్సిందిగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పాడు. జయరామ్‌తో తాను మాట్లాడటం అదే చివరిసారి అన్నారు. మరుసటి రోజు ఉదయం వాళ్ల అమ్మ ఫోన్‌చేసి అంకుల్‌ చనిపోయారని చెబితేనే తనకు తెలిసిందన్నారు. జయరామ్‌కు సబంధించిన ఆస్తిపాస్తులేవీ తన పేరుమీద లేవని శిఖాచౌదరి చెప్పారు.

ఇక రాకేష్ రెడ్డి గురించి స్పందించిన శిఖా.. 2017లో త‌న‌తో ప‌రిచ‌య‌మైంద‌ని.. అతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో 7 నెల‌లుగా దూరం పెట్టినట్లు చెప్పారు. రూ. 4 కోట్లు అప్పిచ్చే స్థోమత రాకేశ్‌కు లేదన్నారు. హత్య కేసులో అత్త పద్మశ్రీని ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక జయరామ్‌ బంధువుల ఫిర్యాదు మేరకు ఈ హత్యకేసును తెలంగాణ పోలీసులు మొదటి నుంచి దర్యాప్తు ప్రారంభించారు. తొంద‌ర‌లోనే శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. హత్య వెనక దాగిన కుట్ర, జయరాం కుటుంబం లేవనెత్తిన అనుమానాల నివృత్తిపై పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిని హైదరాబాద్ తరలించి, విచారణ జరపనున్నారు.


PostedOn: 12 Feb 2019 Total Views: 46
పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం

పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించిన జైషే మహ్మద్‌ టాప్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీని భారత సైన్యం మట్టుబెట్టినట్లు సమాచారం. అతడితో పాటు మరో జైషే ఉగ్రవాదిని కమ్రాన్‌ను కూడా భారత బలగాలు హతమార్చాయి. సోమవారం నాడు తమపై అటాక్‌ చేసిన ఆ ఇద్దరితో పాటు మరొక ఉగ్రవాదిని సైన్యం కాల్చి చ...

18 Feb 2019

జయరామ్‌ హత్య కేసు నిందితులు నాంపల్లి కోర...

జయరామ్‌ హత్య కేసు నిందితులు నాంపల్లి కోర్టుకు తరలి...

జయరాం హత్యకేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రాకేశ్‌రెడ్డితో పాటు మరో నిందితుడు శ్రీనివాస్‌ను మూడు రోజుల క్రితం పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. పోలీసులు ఐదు రోజుల కస్టడీ కోరగా కోర్టు మూడురోజులకే అనుమతి ఇచ్చింది. అయితే విచారణలో నిందితులు ఇచ్చిన వివరాలతో పోలీసులు సంతృప్తి చెందడం లేదు. తమ ...

17 Feb 2019

అమర వీరుల కుటుంబాలకు కేటీఆర్ విరాళం

అమర వీరుల కుటుంబాలకు కేటీఆర్ విరాళం

పుల్వామా ఘటనలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కి 25 లక్షల రూపాయల విరాళాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కెటి రామారావు అందించారు. హైదరాబాద్ లోని సౌతర్న్ సెక్టార్ సీఆర్పీఎఫ్ కార్యాలయంలో ఐజీపి జి హెచ్ పి రాజు ను కలిసి ఈ మేరకు చెక్కులను కేటీఆర్ అందించారు. తన 25 లక్షల విరాళం తో పాటు తన మ...

17 Feb 2019

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నిక...

ఎన్నికల వేళ కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల కమిషనర్‌...

త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్రను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. సుశీల్ చంద్ర నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం (ఫిబ్రవరి 14) ఉత్తర్వులు జారీ చేశారు. ...

14 Feb 2019

కారు బాంబు – సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్ర...

కారు బాంబు – సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. 12 ...

జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలోని అవంతిపురాలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. కారు బాంబుతో 12 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని బలితీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది శ్రీనగర్ వెళ్తుండగా.. కారులో దూసుకొచ్చిన మిలిటెంట్లు సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను ఢీకొట్టారు. ...

14 Feb 2019

సీఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్‌లో మందుపాతరత...

సీఆర్పీఎఫ్ జవాన్లపై కశ్మీర్‌లో మందుపాతరతో దాడి, 18...

పుల్వామా జిల్లాలోని లెత్‌పురా దగ్గర శ్రీనగర్-జమ్ము జాతీయ రహదారిపై జరిగిన ఐఈడీ పేలుడులో 18 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారని, 44 మంది గాయపడ్డారని పోలీసులు బీబీసీకి తెలిపారు. 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లతో వెళ్తున్న ఒక బస్సు గురువారం మధ్యాహ్నం లేత్‌పురా దగ్గర ప్రయాణిస్తుండగా మందుపాతర...

14 Feb 2019

ఆయకట్టుకు మేఘా పైపులతో నీరు

ఆయకట్టుకు మేఘా పైపులతో నీరు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా వినూత్న నీటిపారుదల ప్రాజెక్టుకు మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ శ్రీకారం చుట్టింది. ఆసియాలోనే తొలిసారిగా అవుట్‌లెట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఓఎమ్ఎస్) అనే ఇజ్రాయేల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ పైపుల ద్వారా సాగునీరు అందించాలనే లక్ష్యంతో మేఘా ఇంజనీరింగ్ ప్...

14 Feb 2019