పాక్‌కు హెచ్చరిక.. తీరు మారకుంటే బాలాకోట్ తరహా దాడులు తప్పవు!

పాక్‌కు హెచ్చరిక.. తీరు మారకుంటే బాలాకోట...

ఉగ్రవాదులకు స్వర్గంగా మారిన పాక్ భూభాగంలోని తీవ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపినా దాని తీరు ఏ మాత్రం మారలేదు. పాక్‌లో ఇప్పటికీ 22 ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిరాటంకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో మసూద్ అజార్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ శిబిరాలు తొమ్మిది ఉన్నాయని ఓ భారత అధికారి వెల్లడించారు. వీటిపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు. సరిహద్దుల వెంబడి తన భూభాగంలోని ఉగ్రశిబిరాలపై పాక్ చర్యలు తీసుకోకపోతే, లేదంటే బాలాకోట్ తరహా వైమానిక దాడులకు మరోసారి తప్పవని ఆయన హెచ్చరించారు. ఉగ్రవాదానికి కేంద్రబిందువుగా మారిన పాకిస్థాన్, ఆ సంస్థలపై అంతర్జాతీయ సమాజం నమ్మదగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. 

ఉగ్రవాదం విషయంలో ఇప్పటికీ సరైన చర్యలు తీసుకోని పాక్ నాయకత్వం, రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధపూరిత వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా దాయాది కళ్లు తెరవాలని, తమ భూభాగంలో నడుస్తున్న ఉగ్ర శిక్షణ కేంద్రాలపై ఉక్కుపాదం మోపాలని అన్నారు. లేకపోతే బాలాకోట్ తరహా మరో దాడి తప్పదని ఆయన మరోసారి హెచ్చరికలు చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఏ సమయంలోనైనా దాడులు తప్పవని అల్టిమేటం జారీ చేశారు. ఇటీవల పలు ఉగ్రవాద సంస్థలకు చెందిన 44 మందిని పాక్ ప్రభుత్వం అదుపులోకి తీసుకుందని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. ఇలాంటి కంటితుడుపు చర్యలతో ప్రతి ఉగ్రవాది భారత్‌పై దాడిచేయడానికి సిద్ధపడతాడని ఆయన వ్యాఖ్యానించారు. 

ఉగ్రవాద సంస్థల అధినేతలను గృహ‌నిర్బంధం చేయడమంటే, వారికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పించడమేనని అన్నారు. వీరిని విడుదల చేసిన తర్వాత పరిస్థితి యధావిధిగా ఉంటుందని అన్నారు. కానీ, పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత భారత్ కొత్త పంథా అనుసరిస్తోందని, సరిహద్దు వెంబడి జరిగే ప్రతి ఉగ్రదాడికి దాయాది పాక్ మూల్యం చెల్లించుకోకతప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ఉగ్రవాదుల స్వర్గంగా మారిన పాకిస్థాన్, వారికి నిధులు అందజేయడం ఆపడం లేదనే భావన భారతీయుల్లో ఉందని, ఉగ్ర సంస్థలకు భారీగా సాయం చేస్తోందని పేర్కొన్నారు. 

ఆత్మరక్షణ హక్కు భారత్‌కు ఉందని, ఇందులో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి విజయవంతంగా వైమానిక దాడులు చేశామని అన్నారు. ఇలాంటివి మరోసారి జరగక్కూడదని పాక్ భావిస్తే, ముందు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని సూచించారు. ఇందులో ఎలాంటి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించలేదని, కేవలం ఉగ్రవాదులే లక్ష్యంగా దాడి చేశామని, సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగనీయలేదని ఆయన స్పష్టం చేశారు.


PostedOn: 09 Mar 2019 Total Views: 49
ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న ...

ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న భారత స్టాక...

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. ఎన్డీయేకే ఎగ్జిట్ పోల్స్ ప‌ట్టం క‌ట్ట‌డంతో.. మార్కెట్లు ప‌రుగులు తీశాయి. హంగ్ ప్రభుత్వానికి అవకాశం లేదని, మళ్లీ స్థిరమైన మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ సూచీలు భార...

21 May 2019

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్‌ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

20 May 2019

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార...

20 May 2019

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో అక్షిత వివాహం జరిగింది. మొదట వీరి సంసారం సాఫీగా సాగినా అనంతరం మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో అక్షిత ఉరివేసుకుని ప్...

20 May 2019

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లె...

20 May 2019

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పో...

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పోలీసుల వేట

నయీం అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేట సాగిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నుంచి శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు కర్నూల్‌ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్టు వట్టి వెంకటరెడ్డి అలియాస్‌ వాలిని గుర్తించారు. ఆయన ఇంట్లో ఆదివారం ఏపీ, తెలంగాణ పోలీసుల...

20 May 2019

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్...

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్రయత్నం

ఊరు బాగు కోసం చెరువు ఉనికి కోసం గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం కాపాడుకునేందుకు నడుం బిగించారు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామస్ధులు. వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందించే గంగి చెరువు, శిఖం కబ్జాకు గురవుతున్నా స్థలంలో కందకాలు తవ్వారు. మూడు చెరువులో దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురైం...

20 May 2019

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా – పంపిణీలలో ఎన్నో విజయాలు అధిగమించిన ఎంఈఐఎల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. హైడ్రోకార్బన్స్‌ డివిజన్‌ ద్వారా చమురు వెలికి తీత మరియు గ్యాస్ పంపిణీ సహజ వాయువు రంగంలో వివిధ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చ...

20 May 2019