జగన్ ఓటుకే ఎసరు..?

జగన్ ఓటుకే ఎసరు..?

ఆంధ్రప్రదేశ్‌లో ఫామ్ -7 రేపుతున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఓట్ల తొలగింపు కోసం వాడుతున్న ఈ ఆన్‌లైన్ అప్లికేషన్లు ఏపీలో దాదాపు 9 లక్షలు నమోదు కాగా వీటిలో అత్యధికం బోగస్‌వేనని తేల్చారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ పేరుతో ఫామ్ -7 దాఖలవ్వడం కలకలం సృష్టిస్తోంది. ఏకంగా జగన్ పేరుతో ఫామ్ 7 దరఖాస్తు రావడం సంచలనంగా మారింది. ఓటు తొలగించాలంటూ జగన్ పేరుతో దరఖాస్తు రావడంతో అవాక్కవ్వడం అందరి వంతైంది. జగన్ పేరుతో ఫామ్ 7 రావడంతో అప్రమత్తమైన పులివెందుల రెవెన్యూ అధికారులు విచారణ జరిపారు. జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి ఆయన బంధువులను విచారించారు. జగన్ ఫామ్ 7 దాఖలు చేయలేదని ఆయన పేరుతో మరెవరో అప్లై చేశారని తహసీల్దార్‌ గుర్తించారు.

అంతేకాదు..జగన్ పేరుతో దాఖలైన ఫామ్ 7 గురించి పులివెందుల అధికారులు స్వయంగా ఆయన్ని కూడా సంప్రదించారు. వైఎస్‌ జగన్‌కు తెలియకుండానే దరఖాస్తు వచ్చినట్లు నిర్థారించకున్నారు. ఈ ఘటనపై స్థానిక తహసీల్దార్‌ పులివెందుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పులివెందులలో తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి ఓటు తొలగించడానికి టీడీపీ నేతలు ఫామ్ 7 దరఖాస్తు చేశారని ఇటీవల జగన్ ఆరోపించారు. ఇప్పడు ఏకంగా ఆయన ఓటు తొలగించాలంటూ ఫామ్ 7 దాఖలయ్యిందన్న విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి.PostedOn: 13 Mar 2019 Total Views: 44
పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

పీఎస్‌ఎల్వీ సీ46 కౌంట్‌డౌన్‌ ప్రారంభం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్-2బీర్1ను బుధవారం నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 5.30గంటలకు పీఎస్‌ఎల్వీ సీ46 ప్రయోగం జరగనుంది. 615 కిలోల బరువున్న రీశాట్‌-2 బీఆ...

21 May 2019

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇం...

సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రకటించిన ఇంటర్ బోర్డు

తెలంగాణ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష తేదీలను ప్రటించింది. జూన్ 7 నుంచి 14 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు టైం టేబుల్‌ను విడుదల చేసింది. ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 న...

21 May 2019

చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా

చంద్రగిరిలో పోలింగ్ అక్రమాలపై ఈసీ కొరడా

చంద్రగిరిలోని ఎన్ఆర్ కమ్మపల్లె, కమ్మపల్లె, కొత్త కండ్రిగ, వెంకట్రామపురం, పులివర్తిపల్లెలో పోలింగ్ కేంద్రాల్లో జరిగిన అక్రమాల కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. ఏప్రిల్ 11న జరిగిన పోలింగ్‌లో అక్రమాలకు అవకాశమిచ్చిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంది. పీవో, ఏపీవోలతోపాటు 10మంది ఉద్యోగులపై...

21 May 2019

ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న ...

ఎగ్జిట్‌పోల్స్ కిక్కు.. దుమ్మురేపుతున్న భారత స్టాక...

ఎగ్జిట్ పోల్ ఫ‌లితాలు మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపాయి. ఎన్డీయేకే ఎగ్జిట్ పోల్స్ ప‌ట్టం క‌ట్ట‌డంతో.. మార్కెట్లు ప‌రుగులు తీశాయి. హంగ్ ప్రభుత్వానికి అవకాశం లేదని, మళ్లీ స్థిరమైన మోడీ సర్కారు అధికార పగ్గాలు చేపట్టనుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో స్టాక్ మార్కెట్ సూచీలు భార...

21 May 2019

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్‌ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

20 May 2019

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార...

20 May 2019

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో అక్షిత వివాహం జరిగింది. మొదట వీరి సంసారం సాఫీగా సాగినా అనంతరం మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో అక్షిత ఉరివేసుకుని ప్...

20 May 2019

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లె...

20 May 2019