వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కాం

వెలుగులోకొచ్చిన రూ. 1000 కోట్ల భారీ స్కా...

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో అడ్డంగా దొచుకుంటున్నారు. వివిధ పేర్లతో కంపేనీలను క్రియేట్ చేసి అమాయకులను బుట్టలో పడేస్తున్నారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రెండు లక్షలు సంపాదించోచ్చని నమ్మిస్తారు. మల్టీ లేవల్ మార్కెటింగ్ పేరుతో జరిగే మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్యూనెట్ సంఘటన మరువకముందే తాజాగా మరో మల్టీలెవల్ మార్కెటింగ్ మోసం బయట పడింది. మాదాపూర్ లో ఈబిజ్ పేరుతో మల్టీలెవల్ మార్కెటింగ్ దందా చేస్తున్న ప్రధాన సూత్రదారుడు పవన్ మల్హాన్ ను అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు.

పవన్ మల్హాన్ అనే వ్యక్తి 2001 లో ఉత్తర్ ప్రదేశ్ లోని నోయిడాలో ఈబిజ్ డాట్ కమ్ ప్రైవేట్ లిమిటేడ్ పేరుతో ఓ కంపేనీనీ ఏర్పాటు చేశాడు. డైరెక్ట్ బిజినెస్ ప్రొడక్ట్ సేల్ పేరుతో ఈ కంపేనీని మోదట్లో నడిపించాడు. ఇలా దేశ వ్యాప్తంగా చాలా రాష్ట్రాలలో ఈబిజ్ ని ఏర్పాటు చేశాడు. స్టూడెంట్స్, రిటైర్ట్ ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలనే టార్గేట్ చేసుకున్నాడు కంపేనీ ఎండి పవన్. ఆకట్టుకునే ప్రకటనలు ఇస్తూ నమ్మించాడు. తమ కంపేనీ వివిధ ప్రొడక్ట్స్ తయారు చేస్తుందని తమ కంపేనీలో మెంబర్ గా జాయిన్ అయ్యి వాటిని అమితే లక్షలు సంపాదించుకోవచ్చని నమ్మించాడు. ప్రొడక్ట్స్ మాత్రమే కాదు ఎడ్యూకేషనల్ కు సంబంధించిన మల్టీ కోర్సులకు కూడా తక్కువ ధరకే ప్యాకేజీ ఉంటుందని సెమినార్లు పెట్టి లక్షలాది మందిని బురిడి కోట్టించాడు. ఇలా దేశ వ్యాప్తంగా ఈబిజ్ కంపేనీలో 7 లక్షల మందిని మెంబర్లుగా జాయిన్ చేసుకుని 1000 కోట్ల వరకు వసూలు చేసి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. తీగలాగితే డొంక కదిలినట్లు ఒక్క పిర్యాదుతో ఈ బిజ్ పేరుతో నడుపుతున్న మల్లీలెవల్ మార్కెటింగ్ దందా గుట్టురట్టు అయ్యింది. డిగ్రి చదువుతున్న వివేక్ కొందరు స్నేహితులతో ఈబిజ్ నిర్వహించిన సెమినార్ కు హాజరు అయ్యాడు. కంపేనీలో పెట్టుబడి పెట్టిన సంవత్సరానికే రెట్టింపు అవుతుంది అనడంతో ప్రకటనలకు ఆకర్షితుడైన వివేక్ ఈబిజ్ 16 వేల రూపాయలను పెట్టాడు. కొద్ది రోజుల తర్వాత కట్టిన డబ్బు ఇవ్వమంటే మరికొందరిని ఈ కంపేనీలో చేర్పిస్తేనే డబ్బుతోపాటు కమీషన్ ఇస్తామడంతో మోస పోయానని గుర్తించిన వివేక్ మాదాపూర్ పోలీసులకు పిర్యాదు చేశాడు. రంగంలో దిగిన పోలీసులు ఈబిజ్ కంపేనీ మల్టేలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ బిజ్ ను నడిపిస్తున్న ఎండీ పవన్ ను అరెస్ట్ చేసి బ్యాంక్ అకౌంట్లో ఉన్న 70 కోట్ల డబ్బును ప్రీజ్ చేశారు. ఈ బిజ్ కంపేనీపై కూడా చాలా కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మల్టీలెవల్ మార్కెటింగ్ కంపేనీలో పెట్టుబడులు పెడితే తిరిగి డబ్బులు రావని కేసులు నమోదై ఒకవేళ రికవరైన డబ్బు ప్రభుత్వానికి వెళ్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కవ డబ్బులు సంపాదించవచ్చు అని చెపే ప్రకటనలు నమ్మవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

https://www.hmtvlive.com/just-in/ebiz-scam-revealed-cyberabad-commissionerate-17849


PostedOn: 13 Mar 2019 Total Views: 49
పిడుగుపాటుతో ముగ్గురి మృతి

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్‌ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

20 May 2019

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార...

20 May 2019

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో అక్షిత వివాహం జరిగింది. మొదట వీరి సంసారం సాఫీగా సాగినా అనంతరం మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో అక్షిత ఉరివేసుకుని ప్...

20 May 2019

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లె...

20 May 2019

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పో...

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పోలీసుల వేట

నయీం అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేట సాగిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నుంచి శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు కర్నూల్‌ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్టు వట్టి వెంకటరెడ్డి అలియాస్‌ వాలిని గుర్తించారు. ఆయన ఇంట్లో ఆదివారం ఏపీ, తెలంగాణ పోలీసుల...

20 May 2019

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్...

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్రయత్నం

ఊరు బాగు కోసం చెరువు ఉనికి కోసం గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం కాపాడుకునేందుకు నడుం బిగించారు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామస్ధులు. వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందించే గంగి చెరువు, శిఖం కబ్జాకు గురవుతున్నా స్థలంలో కందకాలు తవ్వారు. మూడు చెరువులో దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురైం...

20 May 2019

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా – పంపిణీలలో ఎన్నో విజయాలు అధిగమించిన ఎంఈఐఎల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. హైడ్రోకార్బన్స్‌ డివిజన్‌ ద్వారా చమురు వెలికి తీత మరియు గ్యాస్ పంపిణీ సహజ వాయువు రంగంలో వివిధ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చ...

20 May 2019

నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్‌లో డాక్టర...

నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్‌లో డాక్టర్‌ను నిలదీ...

హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ మంత్రి అనుచరులు హంగామా సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బందిపై నానా దుర్భాషలాడారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వైద్యం డాక్టర్లు వైద్య చికిత్స అందించడం లేదని వైద్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జన్సీ వార్డులో చికిత్స్ అందిస్తున్న ...

20 May 2019