ఎన్పీకుంట ‘మేఘా’ పవర్ గ్రిడ్ కు లిమ్కా రికార్డ్

ఎన్పీకుంట ‘మేఘా’ పవర్ గ్రిడ్ కు లిమ్కా ర...
  • ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ స్థానం
  • కేవలం ఏడు నెలల్లోనే ఎన్పీ కుంట వద్ద సబ్ స్టేషన్ ఏర్పాటు చేసిన ఎంఈఐఎల్

దేశంలోనే అతితక్కువ సమయంలో పవర్ గ్రిడ్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఇన్ఫ్రా రంగంలో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతిష్ఠాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా ఏషియా, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నూ సాధించింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా నంబులపూల కుంట (ఎన్పీ కుంట) వద్ద ఎంఈఐఎల్ 400/220 కేవీ పవర్ సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేసింది. 12 నెలల్లో పూర్తి చేయాల్సిన సబ్ స్టేషన్ ను కేవలం ఏడు నెలల్లో పూర్తి చేయడం, నాణ్యతా ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండటంతో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) ఈ వివరాలను తన వెబ్ సైట్లో ప్రచురించింది. అంతేకాకుండా పీజీసీఐఎల్ నుంచి ప్రతిష్ఠాత్మక బెస్ట్ డెబ్యుటెంట్ అవార్డ్ ను, మెమెంటో తోపాటు ప్రశంసా పత్రాన్ని ఎంఈఐఎల్ దక్కించుకుంది.

మూడేళ్లుగా నిరాటంకంగా విద్యుత్ సరఫరా:

సాధారణంగా ఒక విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం పడుతుంది. అయితే మేఘా ఇంజనీరింగ్ ఈ  ప్రాజెక్టు పనులను 25 సెప్టెంబర్ 2015న ప్రారంభించి కేవలం ఏడు నెలల్లోనే అంటే 25 ఏప్రిల్ 2016న ప్రారంభోత్సవం చేసింది. క్లిష్టమైన నమూనాలు, కఠినమైన నిబంధనలు, ఏ మాత్రం అనుకూల పరిస్థితులు లేని, వర్షాలు కురుస్తున్న ఈ ప్రాంతంలో గడువుకన్నా ముందే ‘మేఘా’ సబ్ స్టేషన్ పనులను పూర్తిచేసింది. గత మూడేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరుగుతున్నది.

అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఆల్ట్రా మెగా సోలార్ పవర్ ప్లాంట్ ను పవర్ గ్రిడ్ కు అనుసంధానించడం కోసం ఎన్పీ కుంట సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ ఆల్ట్రా మెగా సోలార్ ప్లాంట్ నుంచి 1500 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఈ సబ్ స్టేషన్ ప్రాజెక్టును చేపట్టారు.

ఈ ప్రాజెక్టులో భాగంగా ఎంఈఐఎల్.. 500 ఎంవీఏ, 400/200 కేవీ మూడు ఆటో ట్రాన్స్ ఫార్మర్లు, 125 ఎంవీఏఆర్ ఒక బస్ రియాక్టర్ ను నిర్మించింది. 400 కేవీ 100 ఏవీఏఆర్ స్టేషన్ ఒకటి, 400 కేవీ బేస్ లైన్లు రెండు, 400 కేవీ టైబేస్ లు నాలుగు, 220 కేవీ లైన్ బేస్ లు నాలుగు,  220 కేవీ బస్ కప్ లార్ బే ఒకటి, ఒక 220 కేవీ ట్రాన్స్ ఫార్మర్ బస్ కప్ లార్ బేను ఏర్పాటు చేసింది. అలాగే సివిల్ పనులైన డ్రైన్, రహదారులు, కల్వర్టులు, కంట్రోల్ రూమ్, బే క్యూస్క్, ట్రాన్సిట్ క్యాంపు, ఫైర్ ఫైటింగ్, పంప్ హౌజ్ నిర్మాణాలను మేఘా పూర్తి చేసింది.


PostedOn: 11 Mar 2019 Total Views: 58
పిడుగుపాటుతో ముగ్గురి మృతి

పిడుగుపాటుతో ముగ్గురి మృతి

వికారాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దారుర్ మండలం రాజాపూర్‌ గ్రామంలోని పొలాల్లో పిడుగులు పడటంతో ముగ్గురు మృతి చెందారు. పొలంలో పనిచేస్తుండగా ప్రమాదం జరగడంతో తల్లి, కొడుకు, కూతురు అక్కడికక్కడే దర్మరణం చెందారు. తండ్రి ఫకృద్ధీన్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు.

20 May 2019

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. 50 ఏళ్లుగా ఆ ఉర్లో మగవ...

పిల్లా లేదు.. పెళ్లీ లేదు.. పిల్లనిచ్చి పెళ్లి చేసే మామ లేడు.. ఏక్ నిరంజన్.. ఆ ఊళ్లో వాళ్లు.. ఈ పాటే పాడుకోవాల్సి వస్తోంది. ఆ ఊరికి వెళితే 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయస్సు ఉన్న బ్రహ్మచారులే కనబడతారు. ఆడ తోడు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. ఆ గ్రామంలో పెళ్లీ భజెంత్రీలు మోగి 50 ఏళ్లు కావస్తోంది. బీహార...

20 May 2019

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

అత్తింటి వేధింపులకు వివాహిత బలి

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆర్బీనగర్‌లో అక్షిత అనే వివాహిత ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. రెండేళ్ల క్రితం రాఘవేందర్‌ రెడ్డి అనే వ్యక్తితో అక్షిత వివాహం జరిగింది. మొదట వీరి సంసారం సాఫీగా సాగినా అనంతరం మనస్పర్దలు ఎక్కువయ్యాయి. దీంతో అక్షిత ఉరివేసుకుని ప్...

20 May 2019

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21అంతస్తుల భవనం.. క్షణాల్లో కూల్చేశారు!

21 అంతస్ధుల బిల్డింగ్‌ చూస్తుండగానే నేలమట్టమైంది. అంత పెద్ద టవర్‌ కళ్లముందే కూలిపోయిన ఘటన అమెరికా పిన్సిల్వేనియాలో జరిగింది. ఉప్పుకర్మాగారమైన మార్టీన్‌ టవర్‌ గత కొంతకాలంగా ఖాళీగా ఉంది. ఎలాంటి కార్యకలాపాలు లేకపోవడంతో టవర్‌ను పేల్చేశారు. ఈ టవర్ స్థానంలో కమర్షియల్‌ కాంప్లె...

20 May 2019

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పో...

శేషన్న కోసం కొనసాగుతున్న ఏపీ, తెలంగాణ పోలీసుల వేట

నయీం అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా వేట సాగిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత నుంచి శేషన్న కోసం గాలిస్తున్న పోలీసులు కర్నూల్‌ జిల్లా సున్నిపెంటకు చెందిన మాజీ మావోయిస్టు వట్టి వెంకటరెడ్డి అలియాస్‌ వాలిని గుర్తించారు. ఆయన ఇంట్లో ఆదివారం ఏపీ, తెలంగాణ పోలీసుల...

20 May 2019

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్...

చెరువును కాపాడుకునేందుకు ఆ గ్రామస్తుల ప్రయత్నం

ఊరు బాగు కోసం చెరువు ఉనికి కోసం గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. కబ్జాకు గురవుతున్న చెరువు శిఖం కాపాడుకునేందుకు నడుం బిగించారు. నిజామాబాద్ జిల్లా వెల్మల్ గ్రామస్ధులు. వేయి ఎకరాల ఆయకట్టుకు నీరందించే గంగి చెరువు, శిఖం కబ్జాకు గురవుతున్నా స్థలంలో కందకాలు తవ్వారు. మూడు చెరువులో దాదాపు 200 ఎకరాలు కబ్జాకు గురైం...

20 May 2019

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

చమురు,సహజ వాయువు రంగంలో ‘ఎంఈఐఎల్’

ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా – పంపిణీలలో ఎన్నో విజయాలు అధిగమించిన ఎంఈఐఎల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తన కార్యకలాపాలను విస్తరిస్తున్నది. హైడ్రోకార్బన్స్‌ డివిజన్‌ ద్వారా చమురు వెలికి తీత మరియు గ్యాస్ పంపిణీ సహజ వాయువు రంగంలో వివిధ ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చ...

20 May 2019

నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్‌లో డాక్టర...

నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్‌లో డాక్టర్‌ను నిలదీ...

హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో ఓ మంత్రి అనుచరులు హంగామా సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే వైద్య సిబ్బందిపై నానా దుర్భాషలాడారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వైద్యం డాక్టర్లు వైద్య చికిత్స అందించడం లేదని వైద్యులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమర్జన్సీ వార్డులో చికిత్స్ అందిస్తున్న ...

20 May 2019