విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?

విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?

ఈవీఎమ్స్‌లో లోపాలు , వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిపై వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించిన విపక్షాలు తాము లేవనెత్తిన సమస్యలకు ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే, సమస్య మరింత పెద్దది అవుతుందని హెచ్చరించారు.

ఢిల్లీలో ఎన్డీయేతర పార్టీల సమావేశం జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన విపక్షాలు ప్రధానంగా ఎన్నికల కమిషన్ వైఖరిపై చర్చించారు. సీఈసీ పక్షపాత ధోరణిపై వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ లీడర్స్‌ అహ్మద్‌పటేల్‌, అశోక్‌ గెహ్లాట్, గులాంనబీ ఆజాద్‌‌ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి బీఎస్పీ నేత సతీష్ చంద్ర మిశ్రా... డీఎంకే నాయకురాలు కనిమొళి తృణమూల్ నుంచి ఒబ్రెయిన్‌ సహా మొత్తం 19 పార్టీల నేతలు హజరయ్యారు. అయితే, ఈ మీటింగ్‌కు డుమ్మాకొట్టి సడన్‌ షాకిచ్చారు కర్నాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి.

సమావేశం తర్వాత సీఈసీని కలిసిన ఎన్డీయేతర పార్టీల నేతలు 8 పేజీల మెమొరాండాన్ని అందజేశారు. ముఖ్యంగా వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించారు. అలాగే వీవీప్యాట్ల లెక్కింపుపై సరైన మార్గదర్శకాలు ఎందుకు ఇవ్వలేదంటూ ఈసీని నిలదీశారు. తాము లేవనెత్తిన సమస్యలు చిన్నవి కావని, ఈసీ వెంటనే పరిష్కారం చూపకుంటే, సమస్య మరింత పెద్దది అవుతుందని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలమైందని, విపక్షాలు లేవనెత్తిన ఏ అంశాన్ని కూడా పట్టించుకోలేదంటూ నిలదీసిన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషనర్ ముందు నిరసన వ్యక్తంచేశారు. అయితే ఎన్డీ‍యేతర పార్టీలు లేవనెత్తిన అంశాలపై రేపు చర్చించనున్నట్లు ఈసీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈసీ అఫీషియల్ రియాక్షన్ తర్వాతే విపక్షాలు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.PostedOn: 21 May 2019 Total Views: 161
సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకన...

సోమిరెడ్డికి ఝలక్.. వైసీపీలో చేరిన కీలకనేత..

ఎన్నికల అనంతరం టీడీపీకి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే నలుగురు ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీనుంచి చేజారిపోయారు. తాజాగా నెల్లూరు జిల్లాకు చెందిన ఆ పార్టీ కీలకనేత. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కోడూరు కమలాకర్‌రెడ్డి శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌...

21 Sep 2019

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డ...

శంకరమ్మ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ హుజార్ నగర్ శాసనసభ టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరునే తెలంగాణ సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నేతలతో చర్చించి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్: హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పేరు...

21 Sep 2019

కొత్తగా ట్రై చేయండి జగన్ గారు... లోకేష్ ...

కొత్తగా ట్రై చేయండి జగన్ గారు... లోకేష్ సెటైర్

బాక్సైట్ తవ్వకాల గురించి లోకేష్ వరుస ట్వీట్లు చేశారు.గిరిజనుల మనోభావాలకు, వారి మనుగడకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలు జరపబోమని 2004లోనే చంద్రబాబు తేల్చి చెప్పారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఏద...

20 Sep 2019

కోడెల మరణాన్ని పొలిటికల్ సేల్ చేసేందుకు ...

కోడెల మరణాన్ని పొలిటికల్ సేల్ చేసేందుకు చంద్రబాబు ...

పరీక్ష పేపర్ లీకై ఉంటే అప్పుడే పత్రికల్లో రాయోచ్చు కదా అని నిలదీశారు. పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత పేపర్ లీకయ్యిందంటూ ప్రభుత్వం ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాశాయని ఆరోపించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీ...

20 Sep 2019

పోలవరం టిడిపి దోపిడిదారులపాలిటి కల్పవృక్...

పోలవరం టిడిపి దోపిడిదారులపాలిటి కల్పవృక్షం

“పోలవరంతెలుగుదేశంపార్టీనేతలకుఏటీఎంలామారింది”.ఈమాటఅన్నదిఎవరోకాదుసాక్షాత్తూదేశప్రధానినరేంద్రమోదీ.మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారారంలో భాగంగారాజమహేంద్రవరంలోజరిగినప్రచారసభలోపాల్గొన్నమోదీఈకీలకవ్యాక్యలుచేశారు.రాష్ట్రవిభజనబిల్లులోపేర్కొన్నట్లుగాపోలవరంనుజాతీయప్రాజెక్టుగాకేంద్రంప్రకటించింది.ఈప్...

20 Sep 2019

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్థాంతమా: వ...

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్థాంతమా: వైసీపీపై బా...

లక్ష రూపాయల సామాగ్రికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారని.. ప్రభుత్వ సామాగ్రిని తీసుకున్న వాళ్లంతా దొంగలైతే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా దొంగలేనని బాబు ఎద్దేవా చేశారు. పల్నాడులో దళితులపై జరిగిన దాడులకు సీఎం, డీజీపీలపై అట్రాసిటీ కేసులు పెట్టాలా అని బాబు ప్రశ్నించారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై త...

20 Sep 2019

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవ...

సుబ్రహ్మణ్యస్వామి పిల్ తోనే విముక్తి, ఈవో బాధ వర్ణ...

29మంది ఉన్న బోర్డును నిర్వహించడంలో ఈవో పడే బాధ వర్ణనాతీతమంటూ ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ఇకపోతే భక్తి భావాలు కలిగిన వాళ్ళు బోర్డులో ఉండాలంటే అది ఏ నాడూ జరగలేదని విమర్శించారు. అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుల సంఖ్య పెంచడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, బీ...

19 Sep 2019

ఫైర్ బ్రాండ్: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్...

ఫైర్ బ్రాండ్: తెలంగాణ కాంగ్రెసులో రేవంత్ రెడ్డి చి...

ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కునారిల్లుతున్న తెలంగాణ కాంగ్రెెసుకు అంతర్గత విభేదాలు సమస్యగా మారాయి. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కుంతియాకు ఫిర్యాదు చేశారు. మరోవైపు సంపత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెసు పరిస్థితి ఏ మాత్రం బాగుపడే సూచనలు కనిపించడ...

19 Sep 2019