ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసిన పవన్.. ఈ పాటలు వైసీపీ నేతలకు మేలుకొలుపు అంటూ కామెంట్స్

ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసి...

పవన్‌ నోట చిరు పాట పలికింది. రుద్రవీణ రాగాలు పలికించింది. అయితే, సరదాగా ఈ పాటలు ప్రస్తావించలేదు పవన్. వైసీపీ నేతలకు రుద్రవీణ పాటలు మేలుకొలుపు అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, పవన్ రుద్రవీణ ట్వీట్‌పై, వైసీపీ సోషల్ మీడియా సైతం ఘాటుగానే స్పందిస్తోంది. దీంతో రుద్రవీణ పాటలపై, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో రణరంగమవుతోంది.

విశాఖలో లాంగ్ మార్చ్ ‌తర్వాత, ఫుల్‌‌జోష్‌లో కనిపిస్తున్నట్టున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేసే పవన్, ఈసారి మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. లాంగ్‌ మార్చ్‌ను రాంగ్‌ మార్చ్‌ అంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై కొత్త తరహాలో మండిపడ్డారు. వైసీపీ నేతలకు, రుద్రవీణ పాటలైనా మేల్కొల్పాలంటూ, పవన్ చేసిన ట్వీట్‌‌, సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. ఇదే రుద్రవీణ ట్వీట్‌పై, వైసీపీ సోషల్ మీడియా టీం కూడా, అదే రేంజ్‌లో కౌంటర్ ఇస్తోంది.

ఇంతకీ ట్విట్టర్‌లో పవన్‌ రుద్రవీణ ట్వీట్ ఏంటంటే, 'రుద్రవీణ... నాకు స్ఫూర్తిని ఇచ్చే చిత్రం. భవన నిర్మాణ కార్మికులు రోజువారీ కూలి దొరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా జీతభత్యాలు తీసుకొంటున్న వైసీపీ నేతలకు రుద్రవీణలోని పాటలు మేలుకొలుపు'' అని అన్నారు పవన్‌. దీనికి 'చుట్టూ పక్కల చూడరా...' అన్న పాటను యాడ్ చేశారు జనసేనాని. మరో ట్వీట్‌లో... ''వైసీపీ మ్యానిఫెస్టోకు, వారి వాగ్దానాలకు ఓటేసిన ప్రజల కళ్లు తెరిపించే పాట మరోటి ఉంది. వాస్తవంగా హామీల అమలు పరిస్థితిని అది అద్దంపడుతుంది'' అన్నారు పవన్. దానికి 'నమ్మకు నమ్మకు ఈ రేయినీ...' అన్న సాంగ్‌ను యాడ్ చేశారు. అయితే, పవన్ కల్యాణ్ రుద్రవీణ ట్వీట్‌ సాంగ్‌లపై, వైసీపీ సోషల్ మీడియా టీం కూడా కౌంటర్‌లు ఇస్తోంది. అన్నాతమ్ముళ్లు ఇద్దరూ ఇద్దరేనంటూ విమర్శలు చేస్తోంది. టీడీపీకి బీ టీం, ఇప్పుడు పాటలు కూడా పాడుతోందని సెటైర్‌లు పేలుస్తోంది. మొత్తానికి పవన్ రుద్రవీణ ట్వీట్‌, సోషల్‌ మీడియాలో సరాగాల సమరానికి జెండా ఊపింది.



PostedOn: 08 Nov 2019 Total Views: 33




పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భే...

పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మద్దతు కోరిన టీడీపీ నేతలు. విజయవాడలోని నివాసంలో జనసేనానితో సమావేశమైన సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య. పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భేటీజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేతలు కలిశారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, ...

13 Nov 2019

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజ...

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజలకు చంద్రబ...

ఏపీ ప్రజలకు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణ స్ఫూర్తిగా.. అందరూ ఏకమై పోరాడదాం రండి అంటూ లేఖలో పేర్కొన్న చంద్రబాబు. తన దీక్షకు కారణాలు ఏంటో చెప్పిన బాబు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలకు లేఖ రాశారు. ఈ నెల 14న తాను...

12 Nov 2019

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!! సీఎస్ విషయంలో సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నదల్లా బీజేపీ, టీడీపీ నాయకులే. నిజానికి పరిపాలనా సంబంధమైన నిర్ణయాల్లో జాప్యం ఒక్కటే సీఎస్ బదిలీకి కారణం కాకపోవచ్చని కొందరు ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు సీఎస్ గా ఎల్వీ గార్ని నియమించింది ఈసీయే అయి...

08 Nov 2019

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడ...

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడకు భరోసా..

రాష్ట్ర రవాణా, సమాచారం శాఖా మంత్రి పేర్ని నాని మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. పెన్షన్ ఇవ్వలేదు అన్నయ్య అంటూ పెద్దావిడ మంత్రి వద్ద కన్నీరు పెట్టుకుంటే.. పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది అంతవరకు నేను నెలనెల నీకు పంపిస్తాను.. ఆరోగ్యం జాగ్రత్త నేను నీ వెంటే ఉంటా.. అని భరోసా ఇచ్చారు.. దీంతో అధికారులు, అక్...

08 Nov 2019

నీ జీవితంలో వైయస్‌ జగన్‌ స్థాయికి ఎదగలేవ...

నీ జీవితంలో వైయస్‌ జగన్‌ స్థాయికి ఎదగలేవు

లాంగ్‌మార్చ్‌ అని పేరుపెట్టి చైనాలో పదివేల కిలోమీటర్లు నడిచిన వారిని పవన్‌ కల్యాణ్‌ అవమానించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పండుల రవీంద్రబాబు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయికి పవన్‌ కల్యాణ్‌ జీ...

08 Nov 2019

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిసాదినేని యామినిఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ...

08 Nov 2019

సీఎం జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ...

సీఎం జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన‌్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. పార్టీలోకి రావాలని తమపై ఒత్తి చేస్తున్నారంటున్న జేసీ.. లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటున్న మాజీ ఎంపీ. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌...

07 Nov 2019