కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

కాషాయకుట్రలు భగ్నమైనందుకేనా...!!!

సీఎస్ విషయంలో సీఎం జగన్ పై విరుచుకుపడుతున్నదల్లా బీజేపీ, టీడీపీ నాయకులే. నిజానికి పరిపాలనా సంబంధమైన నిర్ణయాల్లో జాప్యం ఒక్కటే సీఎస్ బదిలీకి కారణం కాకపోవచ్చని కొందరు ఉన్నత స్థాయి అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ముందు సీఎస్ గా ఎల్వీ గార్ని నియమించింది ఈసీయే అయినా అప్పటినుంచే పావులు కదుపుతున్నది బీజేపీయే అన్నది స్పష్టం అవుతోంది.


అధికారుల మీద కన్నెర్ర చేస్తూ మాట్లాడే చంద్రబాబు పాలనకు విరుద్ధంగా అన్నా అంటూ అందరినీ పిలిచే సీఎం జగన్ తీరు ఐఎఎస్, ఐపీఎస్ల మెప్పు పొందింది. సీఎస్వీ బదిలి వార్త రాగానే ముందుగా స్పందించింది బీజేపీ నేతలే. దాంతోపాటే ఆయనకు కేంద్ర సర్వీసులకు పిలుపు ఉంటోందని లీకులు ఇచ్చారు. ఐదునెలల పదవీ కాలం ఉన్న ఎల్వీకి కేంద్రంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా సర్వీసు పొడిగింపు అవకాశాలున్నాయి. బీజేపీ నాయకులతో ఎల్వీ సాన్నిహిత్యం గురించి వస్తున్న వార్తల్లో నిజానిజాలు తేలాల్సి ఉంది. అదే నిజమైతే రాష్ట్రానికి ఆయన చేసింది తీరని ద్రోహమే అవుతుంది.


సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న సమయంలో చంద్రబాబు ఎల్వీపై ఎంతటి వ్యతిరేకత ప్రదర్శించాడో మర్చిపోలేం. నేడు సీఎస్ బదిలీకి కుల, మతాల రంగు పూస్తున్న ఐవైఆర్ కృష్ణారావు గారిని చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి ఎంతో బాధాకరంగా తప్పించిన తీరు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఎల్వీ గారి విషయంలో అలాంటి అవమానకర అంశాలేవీ జరగలేదు. కానీ ఈ అంశాన్ని వైయస్ జగన్ ని బ్రాహ్మణ ద్వేషి చిత్రించేందుకు బీజేపీ, టీడీపీ తెగ ఉబలాటపడుతున్నాయి. అందుకు ఆర్ఎస్ఎస్ భావసామీప్యులు, బీజేపీ ఆశ్రితులైన కొందరు సాయం కూడా చేస్తున్నారు.


ఇదే సీఎం జగన్ తిరుమలలో అన్యమతస్తులు ఉద్యోగం చేయకూడదని నిర్ణయం చేసాడు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసాడు. చంద్రబాబు కూల్చిన ఆలయాలు తిరిగి నిర్మించేందుకు పూనుకున్నాడు. పూజారుల వేతనాల పెంపు చేసాడు. ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు బడ్జెట్ కేటాయించాడు. అర్చకుల వంశపారంపర్య హక్కును కాపాడాడు. తాజాగా రమణదీక్షితులు గారిని ఆగమ సలహాదారుగా నియమించారు. త్వరలో ఆయన ప్రధానార్చక బాధ్యతలను తిరిగి పొందుతారని కూడా అంటున్నారు. అలాంటి వ్యక్తిపై బురద చల్లాలని కమలనాథులు ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇక రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సీనియర్ ఉన్నతాధికారులకు కేంద్ర సర్వీసులు, సర్వీసు పెంపుల ఆశ చూపడం వెనుక రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బీజేపీ పెద్దలు నడుపుతున్న కుట్రలనే భావించాలి. ఇంటిలిజెన్స్ ద్వారా ఈ విషయాలపై నివేదిక అందుకునే సీఎం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. పాచిక పారకపోవడంతో బీజేపీ నేతల అసహనం, ఆక్రోశం వారి తీరులో బయటపడుతోంది.


PostedOn: 08 Nov 2019 Total Views: 112
పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భే...

పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భేటీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మద్దతు కోరిన టీడీపీ నేతలు. విజయవాడలోని నివాసంలో జనసేనానితో సమావేశమైన సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య. పవన్ మద్దతు కోరిన టీడీపీ.. జనసేనానితో భేటీజనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను టీడీపీ నేతలు కలిశారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన అచ్చెన్నాయుడు, ...

13 Nov 2019

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజ...

తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజలకు చంద్రబ...

ఏపీ ప్రజలకు లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు. తెలంగాణ స్ఫూర్తిగా.. అందరూ ఏకమై పోరాడదాం రండి అంటూ లేఖలో పేర్కొన్న చంద్రబాబు. తన దీక్షకు కారణాలు ఏంటో చెప్పిన బాబు. తెలంగాణను స్ఫూర్తిగా తీసుకొని.. ఏపీ ప్రజలకు చంద్రబాబు లేఖటీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ప్రజలకు లేఖ రాశారు. ఈ నెల 14న తాను...

12 Nov 2019

ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసి...

ట్విట్టర్‌లో రుద్రవీణ సాంగ్స్‌ షేర్ చేసిన పవన్.. ఈ...

పవన్‌ నోట చిరు పాట పలికింది. రుద్రవీణ రాగాలు పలికించింది. అయితే, సరదాగా ఈ పాటలు ప్రస్తావించలేదు పవన్. వైసీపీ నేతలకు రుద్రవీణ పాటలు మేలుకొలుపు అంటూ ట్వీట్‌ చేశారు. అయితే, పవన్ రుద్రవీణ ట్వీట్‌పై, వైసీపీ సోషల్ మీడియా సైతం ఘాటుగానే స్పందిస్తోంది. దీంతో రుద్రవీణ పాటలపై, ట్విట్టర్, ఫేస్&zw...

08 Nov 2019

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడ...

మంత్రి పేర్ని నాని మంచి మనసు.. పెద్దావిడకు భరోసా..

రాష్ట్ర రవాణా, సమాచారం శాఖా మంత్రి పేర్ని నాని మరోసారి తన మంచి మనసుని చాటుకున్నారు. పెన్షన్ ఇవ్వలేదు అన్నయ్య అంటూ పెద్దావిడ మంత్రి వద్ద కన్నీరు పెట్టుకుంటే.. పెన్షన్ ఇచ్చే బాధ్యత నాది అంతవరకు నేను నెలనెల నీకు పంపిస్తాను.. ఆరోగ్యం జాగ్రత్త నేను నీ వెంటే ఉంటా.. అని భరోసా ఇచ్చారు.. దీంతో అధికారులు, అక్...

08 Nov 2019

నీ జీవితంలో వైయస్‌ జగన్‌ స్థాయికి ఎదగలేవ...

నీ జీవితంలో వైయస్‌ జగన్‌ స్థాయికి ఎదగలేవు

లాంగ్‌మార్చ్‌ అని పేరుపెట్టి చైనాలో పదివేల కిలోమీటర్లు నడిచిన వారిని పవన్‌ కల్యాణ్‌ అవమానించాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పండుల రవీంద్రబాబు అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయికి పవన్‌ కల్యాణ్‌ జీ...

08 Nov 2019

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

టీడీపీకి సాదినేని యామిని రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి మరో షాక్‌ తగిలింది. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిసాదినేని యామినిఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె గురువారం తన రాజీనామా లేఖను పోస్టు చేశారు. టీడీపీలో తనకు ఇబ్బందులు, అంతర్గత విభేదాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. కాగా, ఏపీ...

08 Nov 2019

సీఎం జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ...

సీఎం జగన్‌పై జేసీ దివాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన‌్‌మోహన్‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి. పార్టీలోకి రావాలని తమపై ఒత్తి చేస్తున్నారంటున్న జేసీ.. లేకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారంటున్న మాజీ ఎంపీ. మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌...

07 Nov 2019