కేసీఆర్‌కు ఎదురులేదు

కేసీఆర్‌కు ఎదురులేదు

 


ప్రజాదరణలో నంబర్
-43 నుంచి 46 శాతానికి పెరుగుదల
-మళ్లీ అధికారం టీఆర్‌ఎస్‌దే
-కూటమి కునారిల్లక తప్పదు
-గత సెప్టెంబర్‌తో పోల్చితే.. కేసీఆర్‌కు మూడుశాతం పెరిగిన జనాదరణ
-టీడీపీతో దోస్తీ కాంగ్రెస్‌కు మైనస్సే
-ఇండియాటుడే- పీఎస్‌ఈ తాజా సర్వే వెల్లడి
-రాజస్థాన్‌లో కాంగ్రెస్.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీ

న్యూఢిల్లీ/హైదరాబాద్, నవంబర్ 8: సర్వే ఏదైనా, ఏ సంస్థ చేసినా.. ఫలితం ఒక్కటే. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను తప్ప మరోపార్టీని ఆదరించేది లేదని జనం కుండబద్దలు కొడుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని కోరుకుంటున్న ఓటర్లు.. సీట్ల కుంపట్లలో కొట్టుమిట్టాడుతున్న మహాకూటమిని తిరస్కరిస్తున్నారు. తెలంగాణలో గులాబీ పార్టీదే ప్రభంజనమని ఇండియాటుడే ప్రసారం చేసిన తాజా సర్వే తేల్చిచెప్పింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా.. అధికారపార్టీకి భారీ సానుకూలత కనిపిస్తున్నదని సర్వే వెల్లడించింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 6వ తేదీ మధ్య తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల పరిధిలో పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ (పీఎస్‌ఈ) సంస్థ ఈ శాంపిల్ సర్వే నిర్వహించింది. 6,877మంది ఓటర్ల నుంచి ఫోన్ ద్వారా వివరాలు సేకరించింది. ఈ సర్వే వివరాలను గురువారం విడుదల చేశారు. ఏకంగా 75శాతం మంది ప్రజలు టీఆర్‌ఎస్ వైపే ఉన్నారని, గులాబీ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని వారంతా నమ్ముతున్నారని అందులో స్పష్టమైంది. 44శాతం ఓట్లతో టీఆర్‌ఎస్ ఘనవిజయం సాధిస్తుందని.. 46శాతం మంది ప్రజలు కే చంద్రశేఖర్‌రావు మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారని సర్వే వెల్లడించింది. మరోవైపు శాసనసభ ఎన్నికలు జరుగుతున్న రాజస్థాన్‌లో బీజేపీకి గడ్డుపరిస్థితులు నెలకొన్నాయని సర్వేసంస్థ వివరించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నదని పేర్కొన్నది.

మిషన్ భగీరథ నుంచి డబుల్ బెడ్‌రూం ఇండ్ల వరకు.. మిషన్ కాకతీయ నుంచి కంటివెలుగు దాక.. తెలంగాణలో గత నాలుగున్నరేండ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో ఎవరు సర్వే జరిపినా.. తమ ఓటెవరికో తెలంగాణ ప్రజలు ఒక్కగొంతుకై వెల్లడిస్తున్నారు. తాజాగా ఇండియాటుడే-పీఎస్‌ఈ సర్వేలోనూ ఇదేవిషయం స్పష్టమైంది. డిసెంబర్ 7న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రసమితి క్లీన్‌స్వీప్ చేసే అవకాశముందని సర్వే తేల్చింది. 75శాతం మంది ఓటర్లు టీఆర్‌ఎస్‌పట్ల సానుకూలంగా ఉన్నారని వెల్లడించింది. కూటమి కట్టినా విపక్షాలను ఓటరు కనీసం ఊసులోకైనా తీసుకోవడం లేదని ఈ శాంపిల్ సర్వే ఫలితాలు స్పష్టంచేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా బలమైన సానుకూల పవనాలు వీస్తున్నాయి. సామాజిక- సంక్షేమ కార్యక్రమాలకు తోడు అన్నివర్గాల ప్రజల్లో కేసీఆర్ పట్ల ఉన్న విశేష ఆదరణ అధికారపార్టీకి ఉపయోగపడుతున్నది. 75శాతం మంది ఓటర్లు గులాబీపార్టీ పట్ల సానుకూలంగా ఉన్నారు అని సర్వే పేర్కొన్నది. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న కేసీఆర్ నిర్ణ యం.. విపక్షాలపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని, ఆ శరాఘాతం నుంచి ప్రతిపక్ష పార్టీలు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోయాయని సర్వే సంస్థ వ్యాఖ్యా నిం చింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. 44 శాతం ఓటర్లు టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుం దని అభిప్రాయపడగా, 22శాతం మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిపారు.

కూటమికి ఓట్లు రాలవు
తెలంగాణలో విపక్షాలు కూటమిగా ఏర్పడినా పెద్దగా ప్రయోజనం లేదని సర్వే వెల్లడించింది. తెలుగుదేశంపార్టీతో పొత్తు ఎలాంటి అదనపు ఓట్లను రాబట్టకపోగా, అది కాంగ్రెస్‌కు నష్టం చేకూరుస్తుందని పేర్కొన్నది. టీడీపీ అధినేత చంద్రబాబును ఇప్పటికీ కుట్రదారుగానే తెలంగాణ ప్రజలు చూస్తున్నందున, ఆ పార్టీతో కలయిక కారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల తిరస్కరణకు గురయ్యే ప్రమాదముందని అత్యధికులు అభిప్రాయపడినట్లు పీఎస్‌ఈ తెలిపింది. హైదరాబాద్‌లో కాస్తో కూస్తో ఉన్న కాంగ్రెస్ విజయావకాశాలకు అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐ ఎం పార్టీ గండికొట్టే అవకాశముందని పేర్కొన్నది.

రాజస్థాన్‌లో ఓటమి అంచున బీజేపీ
రాజస్థాన్ శాసనసభకు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఇండియాటుడే-పీఎస్‌ఈ సర్వే ప్రకటించింది. రాష్ట్రంలో వసుంధరారాజే ప్రభుత్వంపై కాం గ్రెస్ గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే.. ఆ పార్టీ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్‌నే తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని పేర్కొన్నది. 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని 10,136మంది ఓటర్ల నుంచి టెలిఫోన్ ద్వారా అభిప్రాయాలను సేకరించారు. కేవలం 35శాతం మంది మాత్రమే రాజే ప్రభుత్వానికి మద్దతిస్తున్నారని అందులో వెల్లడైంది. వెనుకబడిన తరగతులు, ముస్లింలలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పట్టణ ప్రాంతాల్లోని తన సంప్రదాయక ఓటు బ్యాంకును కూడా కమలం పార్టీ క్రమంగా కోల్పోతున్నది. ఓ వైపు వసుంధరారాజే ప్రభుత్వం తీవ్రమైన ప్రజావ్యతిరేకత వ్యక్తమవుతుండగా.. మరోవైపు నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ఉండాలని అత్యధికులు కోరుకుంటుండటం ఆసక్తికర పరిణామం. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వసుంధరా రాజే కాకుండా మరో నేతను బీజేపీ ప్రకటించగలిగితే ప్రస్తుత సమీకరణాలు మారే అవకాశముంది అని సర్వే సంస్థ వివరించింది.

మధ్యప్రదేశ్‌లో నువ్వా.. నేనా?
మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగనున్నది. రాష్ట్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి రావడానికి 52శాతం మాత్రమే అవకాశముందని శాంపిల్ సర్వే వెల్లడించింది. ఇరుపార్టీలకు ప్రజాదరణలో కేవలం 1 నుంచి 3శాతం మాత్రమే ఓట్ల తేడా ఉందని తేలింది. పట్టణ ప్రాంతాల్లో బీజేపీ అధిక ఓట్లను సాధిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక కాంగ్రెస్-బీఎస్పీ చేతులు కలిపినప్పటికీ, పొత్తు ప్రభావమేదీ జనంపై పెద్దగా కనబడడం లేదు. మాయావతి పార్టీ కేవలం 6శాతం మాత్రమే ఓట్లను సాధిస్తున్నట్లు తేలింది అని సర్వే సంస్థ విశ్లేషించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియాకు యువ ఓటర్ల నుంచి మంచి మద్దతు లభిస్తున్నదని తెలిపింది. ఈనెల 28న ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. 29 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 11,712మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించారు. బీజేపీ విపక్షం కన్నా కేవలం రెండుశాతం అధికంగా మాత్రమే ఓట్లను సాధించవచ్చు. ఇక శివరాజ్‌సింగ్‌చౌహాన్ మరోసారి సీఎం కావాలని 42శాతంమంది ఓటర్లు కోరుకుంటుండగా, మరొకరిని ఎంపిక చేయాలని 40శాతం మంది అభిప్రాయపడ్డారు అని సర్వే పేర్కొన్నది.

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీని కాపాడుతున్న పొత్తు
ఛత్తీస్‌గఢ్‌లో విపక్షాల ఓట్లు చీలడం బీజేపీకి లాభించేలా కనిపిస్తున్నది. బీజేపీ విజయావకాశాలు 55 శాతం ఉన్నాయని ఇండియాటుడే- పొలిటికల్ స్టాక్ ఎక్స్చేంజ్ సర్వే తెలిపింది. అజిత్ జోగి నేతృత్వంలోని జనతాకాంగ్రెస్, బీఎస్పీ పొత్తు పొట్టుకుని బరిలోకి దిగాయి. ఈ కూటమి ఏడుశాతం ఓట్లను సాధిస్తుందని, ఫలితంగా కాంగ్రెస్ ఓట్లు చీలనున్నాయని అం చనా వేసింది. సీఎం రమణ్‌సింగ్ ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ల పంపిణీ కార్యక్రమం బీజేపీకి కొంతవరకు సానుకూలంగా మారింది. బస్తర్‌లాంటి నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం బీజేపీకి ఇప్పటికీ పెద్దగా జనాదరణ లేదు. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ప్రజల్లో అత్యధికులు రమణ్‌సింగ్‌నే సీఎంగా కోరుకుంటున్నారు అని సర్వే వివరించింది. ఇక రమణ్‌సింగ్ తర్వాత సీఎంగా ఉండాలని భూపేశ్ భాగెల్ (కాంగ్రెస్), అజిత్ జోగి(జనతాకాంగ్రెస్)లను ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నది.

జనహృదయనేతగా కేసీఆర్
జనాదరణలో సీఎం కేసీఆర్‌కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ సీఎం కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నది. తదుపరి సీఎంగా కూడా కేసీఆరే ఉండాలని కోరుకుంటున్నవారి సంఖ్య రెండునెలల కాలంలో మూడుశాతం అదనంగా పెరిగిందని ఈ సర్వే తెలిపింది. 46శాతం మంది ఓటర్లు కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తున్నారని వెల్లడించింది. గత సెప్టెంబర్‌లో నిర్వహించిన శాంపిల్ సర్వేలో 43శాతం మంది ఓటర్లు తదుపరి సీఎంగా కేసీఆర్‌ను కోరుకోగా, తాజా సర్వేలో వారి సంఖ్య 46శాతానికి పెరిగింది. కేసీఆర్‌కు అన్నివర్గాల ప్రజల్లో ఉన్న ఆదరణ క్రమంగా పెరుగుతున్నదని స్పష్టమైంది.


PostedOn: 09 Nov 2018 Total Views: 64
శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో భద్రత లేదంటూ నిందితుడి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి ప్రభుత్వ ప్లీడరు వివరణ కోరారు. అయితే శ్రీనివాస...

18 Jan 2019

సభకు ఐదుగురు ఎమ్మెల్యేల ఆబ్సెంట్...?

సభకు ఐదుగురు ఎమ్మెల్యేల ఆబ్సెంట్...?

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా - అనంతరం అక్షర క్రమంలో మిగతా...

17 Jan 2019

గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్ర...

గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప రెడ్డి...

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యమని పదేపదే ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు.. శుక్రవారం (జనవరి 18) సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ...

17 Jan 2019

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పో...

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పోరాటం..

అధికారాన్ని ఎలా చేక్కించుకోవాలనే ఆలోచనే తప్ప రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే తలంపు చంద్రబాబుకు ఏకోశాన లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.వైయస్‌ జగన్‌పై కావాలనే బురదజల్లుతున్నారన్నారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసింది కాంగ్రెస్,టీడీపీలే అని దుయ్యబట్టా...

17 Jan 2019

ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతిస్తే పొత్తు అంటకడ...

ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతిస్తే పొత్తు అంటకడతారా..?

రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతిస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైయస్‌ఆర్&...

17 Jan 2019

మహా కూటమితో వారికి ఓటమే!

మహా కూటమితో వారికి ఓటమే!

-బలహీన ప్రభుత్వం ఏర్పాటుకే విపక్షాలు ఏకం-దేశ చరిత్రలో మచ్చలేని ప్రభుత్వం మాదే-చౌకీదార్ ఎవ్వరినీ వదిలిపెట్టడు: ప్రధాని మోదీ-అదొక విఫల ప్రయోగం-అవినీతి కోసమే విపక్షాలు ఏకం-సుస్థిర పాలన, బలమైన సర్కారే మా లక్ష్యం-బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పా...

13 Jan 2019

మోదీ పాలనలో అసహనం

మోదీ పాలనలో అసహనం

- నోట్ల రద్దు, జీఎస్టీలతో తీవ్రంగా దెబ్బతిన్న భారత్- దేశం ముందు నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు ప్రధాన సమస్యలు- దుబాయ్‌లో ప్రవాస భారతీయులతో రాహుల్‌గాంధీ వెల్లడి దుబాయ్, : ప్రధాని మోదీ నాలుగున్నరేండ్ల పాలనలో అసహనం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యునైటెడ్ అరబ...

12 Jan 2019

.కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమాను...

.కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమానులే!

దాదాపు 14 నెలల తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప కు వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట దాదాపు 3640 ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై వారికష్టాలు తెలుసుకున్నారు.వైఎస్ జగన్ కడప రానున్న నేపధ్యంలో కడపలో వీధి వీధి వాడ వాడల పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు బ్యానర్ లు కట్టారు...

11 Jan 2019