మోదీకి తెలంగాణ పాఠాలు

మోదీకి తెలంగాణ పాఠాలు

 రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కొందరికి గుణపాఠం చెప్తే, మరికొందరికి సరికొత్త పాఠాలు నేర్పబోతున్నాయి. మరో నెలరోజుల్లో తెలంగాణలో జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, మళ్లీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని విశ్లేషకుల అంచనా. ఈ గెలుపుతో ప్రతిపక్షాలకు కనువిప్పు కలిగితే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కొత్త పాఠాలు అనుభవంలోకి వస్తాయని పేర్కొన్నారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ఎన్నికలను నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు. ప్రధానిగా మోదీ, తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన కొత్తలో ఇద్దరి మధ్య చాలా పోలికలు ఉండేవని, అయితే నాలుగున్నరేండ్ల పాలనలో సీఎం కేసీఆర్ చాలా విషయాల్లో మోదీని దాటేశారని స్పష్టం చేస్తున్నారు. పాలనా విధానాల్లో.. రాజకీయ ఎత్తుగడల్లో సీఎం కేసీఆర్ రెండుమూడు మెట్లు పైనే ఉన్నారని అంటున్నారు. ఇందుకు పలు ఉదాహరణలు సూచిస్తున్నారు.
-కాసాని మహేందర్‌రెడ్డి

-సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ మంచి వక్తలు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రజలను ఆకట్టుకునేలా మాట్లాడగలిగిన నేర్పు ఇద్దరిలోనూ ఉన్నది. అయితే.. మోదీ పంచ్ డైలాగులను ఎక్కువగా నమ్ముకుంటారు. విషయాన్ని స్పష్టంగా చెప్పినా.. స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వరు.
-సీఎం కేసీఆర్ విషయాన్ని సూటిగా, స్పష్టంగా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేలా మాట్లాడుతారు. స్థానిక పరిస్థితులనే ఉదాహరణగా చెప్తారు. స్థానిక నాయకుల పేర్లను, స్థానికంగా చేసిన అభివృద్ధిని వివరిస్తారు. తమ పాలనలో అక్కడ వచ్చిన మార్పును తన ప్రసంగంలో కండ్లకు కట్టినట్టు వివరిస్తారు. ప్రతిసారి ఆయన మాటలు కొత్తగా అనిపిస్తాయి. అందుకే కేసీఆర్ ప్రసంగం వినడానికి ప్రజలు ఆసక్తి చూపుతుంటారు.
-హామీల అమలు విషయంలో సీఎం కేసీఆర్ ఒక మెట్టు ముందే ఉంటారు. ఎన్నికల ప్రచారమైనా, ఇతర ఏ కార్యక్రమమైనా.. అమలు చేయగలిగే హామీని మాత్రమే ఇవ్వడం సీఎం కేసీఆర్ ప్రత్యేకత. అందుకే కేసీఆర్ ఒక మాట చెప్తే.. ఒక హామీ ఇస్తే.. కచ్చితంగా అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో బలంగా ఏర్పడింది. కానీ మోదీపై ప్రజల్లో ఆ నమ్మకం కనిపించడం లేదు.

-ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ వినూత్న పథకాలను అమలుచేస్తున్నారు. అయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేయడం కేసీఆర్ ప్రత్యేకత. ముఖ్యంగా రైతులు, పేదల కోసం విప్లవాత్మక అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి, అమలు చేస్తున్నారు. సబ్బండ వర్గాలకు పథకాల ఫలాలు అందుతుండటంతో ప్రతి కుటుంబం ఆయనను ఇంటిపెద్దగా భావిస్తున్నది. ఓవైపు పారిశ్రామిక అనుకూల పాలసీలు అమలుచేస్తూ పరిశ్రమలను రప్పిస్తూనే.. మరోవైపు రైతు అనుకూల విధానాలు అమలుచేసి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. కానీ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పరిశ్రమలకు రెడ్‌కార్పెట్ పరుస్తూ.. రైతులకు నామమాత్రపు సహాయంతో సరిపెడుతున్నది.
-ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బీజేవైఎం సదస్సులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, ఇతర వక్తలు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 22 కోట్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాయని చెప్పారు. అంటే 130 కోట్ల జనాభాలో 16.6 శాతం కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూర్చారన్నమాట. కానీ.. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రత్యక్షంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి చేరాయి. 100 శాతం కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సంఖ్య ఏడు కోట్లకు పైనే. అంటే సగటున ఒక్కో వ్యక్తి రెండు పథకాలతో లబ్ధి పొందుతున్నారన్నమాట.
-సంపద సృష్టిలో కేసీఆర్‌కు, మోదీకి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. సీఎం కేసీఆర్.. తెలంగాణ రాష్ర్టాన్ని రెండంకెల వృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారు. ఏటా సగటున 17 శాతానికిపైగా వృద్ధి నమోదవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన ప్రతి పాలసీ సంపద పెంపునకు దోహదపడింది. అంతేకాకుండా రాష్ట్ర సంపద పెంచుతూ.. పథకాల రూపంలో వాటిని పేదలకు పంచడంలో సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. కానీ.. మోదీ నేతృత్వంలో జీడీపీ ఏడు శాతానికి దిగువనే కొట్టుమిట్టాడుతున్నది. మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు వంటి నిర్ణయాలు దేశ ఆర్థికరంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి.

-సీఎం కేసీఆర్ అవినీతిని సహించరని అందరికీ తెలుసు. ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రకటించిన ఘనత ఆయనది. 2015లో అవినీతి ఆరోపణలు రావడంతో ఏకంగా అప్పటి డిప్యూటీ సీఎం రాజయ్యను ఆ పదవి నుంచి తొలిగించారు. అవినీతి ఆరోపణలు వచ్చిన ఎంతోమంది అధికారులకు స్థాన చలనం కలిగించారు. వారిలో కేసీఆర్‌కు దగ్గర అని భావించేవారూ ఉన్నారు. కానీ.. ప్రధాని మోదీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉన్నారు. ఎంతమంది కేంద్ర మంత్రులపై ఆరోపణలు వచ్చినా క్యాబినెట్ నుంచి తొలగించలేదు. ఇటీవలే మీటూ ఉద్యమ క్రమంలో కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పై లైం గిక ఆరోపణలు వెల్లువెత్తినా మోదీ చర్యలు తీసుకోలేదు. అన్ని పక్షాల నుంచి ఒత్తిడులు రావడంతో ఎంజే అక్బర్ రాజీనామా చేశారు కానీ తొలగించే సాహసం చేయలేకపోయారు. ఇక అవినీతి అధికారుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇటీవల సీబీఐలో చెలరేగిన చిచ్చే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ.
-పార్టీలోని సీనియర్లను, తనకు అవసరం లేదనుకున్నవారిని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టడం మోదీ నైజం. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వారిని ప్రజాక్షేత్రం నుంచి కనుమరుగు చేశారు. కానీ.. పెద్దలను గౌరవించడం సీఎం కేసీఆర్ గొప్ప నైజం. సీనియర్ల సేవలను పార్టీ పటిష్ఠానికి వినియోగించుకుంటారు. పథకాల అమలులో వారి సలహాలు, సూచనలను కచ్చితంగా తీసుకుంటారు.


తెలంగాణ ఓ మోడల్
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మళ్లీ అధికారంలోకి రావడానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారిస్తారని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రతిపక్షాలను ఎదుర్కొనే విషయంలో సీఎం కేసీఆర్ చర్యలను నిశితంగా గమనించాలని సూచిస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు మహాకూటమి పేరుతో ఒక్కటయ్యాయి. అనైతిక పొత్తులు కుదుర్చుకున్నాయి. జాతీయ స్థాయిలోనూ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేతులు కలుపుతున్నాయి. ఇన్నాళ్లూ బద్ధశత్రువులుగా మెలిగినవారు ఇప్పుడు చేతులు కలుపుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ తన చాణక్యంతో ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్తున్నారు. శాసనసభ రద్దు, అభ్యర్థుల ప్రకటన వంటి ప్రతిపక్షాలు ఊహించని చర్యలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బయటికి చెప్పకపోయినా.. ప్రతిపక్షాలు దాదాపు ఓటమిని ఒప్పుకునేలా చేశారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావాలంటే బీజేపీ సైతం ఇలాంటి దూకుడైన విధానాలను అవలంబించాలని తెలంగాణ ఎన్నికలను ఓ మోడల్‌గా తీసుకోవాలని సూచిస్తున్నారు.


PostedOn: 09 Nov 2018 Total Views: 63
శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

శ్రీ‌నివాస్‌కు భ‌ద్ర‌త లేదా?

జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాస్‌రావును రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు శ్రీనివాసరావుకు విజయవాడ జైలులో భద్రత లేదంటూ నిందితుడి తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి ప్రభుత్వ ప్లీడరు వివరణ కోరారు. అయితే శ్రీనివాస...

18 Jan 2019

సభకు ఐదుగురు ఎమ్మెల్యేల ఆబ్సెంట్...?

సభకు ఐదుగురు ఎమ్మెల్యేల ఆబ్సెంట్...?

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణస్వీకారం చేయించారు. మొదట సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. ఆ తర్వాత ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేయగా - అనంతరం అక్షర క్రమంలో మిగతా...

17 Jan 2019

గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్ర...

గజ్వేల్‌లో కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప రెడ్డి...

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేచింది. కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యమని పదేపదే ప్రకటించిన కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిపోయిన వంటేరు.. శుక్రవారం (జనవరి 18) సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ...

17 Jan 2019

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పో...

రాష్ట్ర ప్రయోజనాలు కోసమే వైయస్‌ జగన్‌ పోరాటం..

అధికారాన్ని ఎలా చేక్కించుకోవాలనే ఆలోచనే తప్ప రాష్ట్ర్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే తలంపు చంద్రబాబుకు ఏకోశాన లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.వైయస్‌ జగన్‌పై కావాలనే బురదజల్లుతున్నారన్నారని మండిపడ్డారు. వ్యవస్థలను నాశనం చేసింది కాంగ్రెస్,టీడీపీలే అని దుయ్యబట్టా...

17 Jan 2019

ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతిస్తే పొత్తు అంటకడ...

ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వాగతిస్తే పొత్తు అంటకడతారా..?

రాష్ట్రాల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన ఫెడరల్‌ ఫ్రంట్‌ను ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతిస్తే చంద్రబాబుకు ఎందుకు కడుపు మంట అని వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైయస్‌ఆర్&...

17 Jan 2019

మహా కూటమితో వారికి ఓటమే!

మహా కూటమితో వారికి ఓటమే!

-బలహీన ప్రభుత్వం ఏర్పాటుకే విపక్షాలు ఏకం-దేశ చరిత్రలో మచ్చలేని ప్రభుత్వం మాదే-చౌకీదార్ ఎవ్వరినీ వదిలిపెట్టడు: ప్రధాని మోదీ-అదొక విఫల ప్రయోగం-అవినీతి కోసమే విపక్షాలు ఏకం-సుస్థిర పాలన, బలమైన సర్కారే మా లక్ష్యం-బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పా...

13 Jan 2019

మోదీ పాలనలో అసహనం

మోదీ పాలనలో అసహనం

- నోట్ల రద్దు, జీఎస్టీలతో తీవ్రంగా దెబ్బతిన్న భారత్- దేశం ముందు నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు ప్రధాన సమస్యలు- దుబాయ్‌లో ప్రవాస భారతీయులతో రాహుల్‌గాంధీ వెల్లడి దుబాయ్, : ప్రధాని మోదీ నాలుగున్నరేండ్ల పాలనలో అసహనం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యునైటెడ్ అరబ...

12 Jan 2019

.కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమాను...

.కడపలో వీధి వీధి వాడ వాడల వైసీపీ అభిమానులే!

దాదాపు 14 నెలల తర్వాత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప కు వచ్చారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట దాదాపు 3640 ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో మమేకమై వారికష్టాలు తెలుసుకున్నారు.వైఎస్ జగన్ కడప రానున్న నేపధ్యంలో కడపలో వీధి వీధి వాడ వాడల పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు బ్యానర్ లు కట్టారు...

11 Jan 2019