ట్రంప్‌కు షాక్!

ట్రంప్‌కు షాక్!

 

-అమెరికా మధ్యంతర ఎన్నికల్లో కంగుతిన్న రిపబ్లికన్ పార్టీ
-ఫలితాల్లో డెమోక్రాట్ల విజయ ఢంకా
-ప్రతినిధుల సభలో ఆధిపత్యం సాధించిన విపక్షం
-సెనేట్‌లో మెజారిటీని కాపాడుకోగలిగిన రిపబ్లికన్ పార్టీ
-నలుగురు భారతీయ అమెరికన్ల విజయం
-రిపబ్లికన్లది చారిత్రక గెలుపు: అధ్యక్షుడు ట్రంప్

వాషింగ్టన్, నవంబర్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనపై రిఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల్లో ఆ దేశ ప్రజలు ట్రంప్‌కు షాక్ ఇచ్చారు. కీలకమైన మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకుంది. దీంతో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. బుధవారం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మొత్తం 435స్థానాలకు గాను 229 సీట్లతో డెమోక్రటిక్ పార్టీ విజయదుందుభి మోగించింది. మరోవైపు 100మంది సభ్యుల సెనేట్‌లో 53 సీట్లను కైవసం చేసుకున్న రిపబ్లికన్ పార్టీ తన ఆధిక్యతను కాపాడుకోగలిగింది. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థుల మధ్య పోటీ ఎంతటి తీవ్రస్థాయిలో ఉండనుందో ఈ మధ్యంతర ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. ప్రతినిధుల సభపై ఎనిమిదేండ్ల విరామం తర్వాత డెమోక్రాట్లు ఆధిపత్యాన్ని సాధించడంతో.. ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు మున్ముందు బ్రేక్ పడే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇకపై కీలక నిర్ణయాలు తీసుకోవడంలో డెమోక్రాట్ల ఆమోదం లేకుండా ట్రంప్ ముందుకెళ్లే పరిస్థితి లేదని వారంటున్నారు.
హౌస్‌లో డెమోక్రాట్ల హవా.. సెనేట్‌లో రిపబ్లికన్ల ఆధిక్యం
అమెరికన్ కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో మొత్తం 435స్థానాలకు అన్నింటికీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 229 సీట్లతో డెమోక్రటిక్ పార్టీ విజయదుందుభి మోగించింది. ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు 206స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నికలకు ముందు ప్రతినిధుల సభలో.. రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీలు 235-193 బలాబలాన్ని కలిగి ఉండగా.. ఒక నామినేటెడ్ స్థానం, ఆరు ఖాళీ స్థానాలు ఉండేవి. తాజా ఫలితాల్లో.. ఖాళీ స్థానాలు, రిపబ్లికన్ పార్టీ ప్రాతినిధ్య స్థానాలను కలుపుకొని మొత్తం 23సీట్లను డెమోక్రటిక్ పార్టీ కొల్లగొట్టింది. మరోవైపు సెనేట్‌లో మాత్రం రిపబ్లికన్లు తమ ఆధిక్యతను కాపాడుకోగలిగారు. 35స్థానాలకు ఎన్నికలు జరుగగా 26చోట్ల అధికార రిపబ్లికన్ పార్టీ గెలుపొందింది. దీంతో 100మంది సభ్యుల సెనేట్‌లో రిపబ్లికన్‌పార్టీ సభ్యుల సంఖ్య 53కు చేరింది. అంతకుముందు 51-49 తేడాతో డెమోక్రటిక్ పార్టీపై స్వల్ప ఆధిక్యత కలిగిన రిపబ్లికన్ పార్టీ.. ప్రస్తుత ఫలితాలతో 53-47తో సభపై పట్టును పెంచుకోగలిగింది. హౌస్, సెనేట్‌తోపాటు 50రాష్ర్టాల్లో ఖాళీఅయిన 36 గవర్నర్ స్థానాలు, మేయర్లు, స్థానిక ప్రభుత్వాధికారుల స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. వచ్చే జనవరిలో నూతన సభ్యులు ప్రమాణం చేయనున్నారు.
రికార్డుస్థాయిలో మహిళలు గెలుపు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మహిళలు రికార్డుస్థాయిలో ప్రతినిధుల సభకు 98మంది, సెనేట్‌కు 12మంది ఎన్నికయ్యారు. న్యూయార్క్ స్థానం నుంచి గెలిచిన అలెగ్జాండ్రియా ఒకాసియో కార్టెజ్ (29).. అమెరికన్ చట్టసభకు ఎన్నికైన అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు. కాన్సాస్ నుంచి గెలుపొందిన డెమోక్రాట్ ష్రాయిస్ డేవిడ్స్.. చట్టసభకు ఎన్నికైన తొలి అమెరికన్ మూలవాసి మహిళగా నిలిచారు.
సత్తా చాటిన భారత సంతతి నేతలు
మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీకి చెందిన నలుగురు భారత సంతతి అమెరికన్లు విజయం సాధించారు. ప్రతినిధుల సభకు వీరంతా తిరిగి ఎన్నికయ్యారు. ఇల్లినాయిస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజా కృష్ణమూర్తి రెండోసారి ఎన్నికవగా, డాక్టర్ అమి బెరా కాలిఫోర్నియా 7వ జిల్లా నుంచి మూడోసారి ఎన్నికయ్యారు. ఆయన కేవలం ఆరుశాతం ఓట్ల తేడాతో బయటపడ్డారు. రో ఖన్నా.. కాలిఫోర్నియా లోని 17వ జిల్లా నుంచి 44శాతం ఓటు పాయింట్లతో మెజారిటీతో విజయం సాధించారు. ప్రమీలా జయపాల్ వాషింగ్టన్ నుంచి 66శాతం పాయింట్లతో మెజారిటీతో గెలుపొందారు. హవాయి నుంచి రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న తులసి గబార్డ్ వరుసగా నాలుగోసారి గెలుపొందారు. అలాగే వేర్వేరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో డజను వరకు ఇండో అమెరికన్లు విజయం సాధించారు. విస్కాన్సిన్ రాష్ర్టానికి అటార్నీ జనరల్‌గా ఎన్నికైన తొలి ఇండో-అమెరికన్‌గా జోష్ కౌల్ రికార్డు సృష్టించారు.
నీమా కులకర్ణి కెంటకీ అసెంబ్లీకి, అమీశ్‌షా అరిజోనా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉత్తర కరోలినా స్టేట్ సెనేట్‌కు ఇద్దరు భారతీయులు ముజ్తబా మహ్మద్, జై చౌదరి ఎన్నికయ్యారు. నీరజ్ అటానీ ఓహియో శాసనసభకు వరుసగా మూడోపర్యాయం గెలుపొందారు. వీరితోపాటు స్టేట్ అసెంబ్లీలకు ఎన్నికైన వారిలో మన్కా ధింగ్రా, వందన స్లాటర్ (వాష్టింగన్), సబీ కుమార్ (టెన్నెస్సీ), ఆకా కార్లా (కాలిఫోర్నియా), కుమార్ భర్వే (మేరీల్యాండ్), సిటీ కోర్టులకు జరిగిన ఎన్నికల్లో జూలీ మ్యాథ్యూ, కేజీ జార్జ్ (టెక్సాస్), శాలినీ బెహాల్ (మాసాచూసెట్స్) గెలుపొందారు. అమెరికా జనాభాలో ఒక్కశాతంగా ఉన్న ప్రవాసీయులు ఎక్కువసంఖ్యలో గెలుపొందడం శుభపరిణామం. ఓటర్ల అభిమానం వల్లే వీరిలో పలువురు తిరిగి గెలుపొందారు అని ప్రవాసభారతీయుడు గౌతమ్ రాఘవన్ తెలిపారు.

ఒకప్పుడు శరణార్థులు.. ఇప్పుడు చట్టసభ సభ్యులు
rashidaమధ్యంతర ఎన్నికల్లో ఇద్దరు ముస్లిం మహిళలు ఇల్హాన్ ఒమర్, రషీదా తలీబ్ (డెమోక్రటిక్ పార్టీ తరఫున) తొలిసారిగా అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అమెరికన్ పార్లమెంట్‌కు (కాంగ్రెస్‌కు) ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా వారు నిలిచారు. 12ఏండ్ల వయసులో ఇల్హాన్ ఒమర్ అమెరికాకు సోమాలియా నుంచి శరణార్థిగా రాగా, రషీదా తలీబ్ తండ్రి పాలస్తీనా నుంచి అమెరికా శరణార్థిగా వచ్చారు. తాజా ఎన్నికల్లో ఇల్హాన్ ఒమర్ మిన్నెసోటా నుంచి, 42ఏండ్ల రషీదా తలీబ్ మిషిగాన్ నుంచి గెలుపొందారు. మరోవైపు కొలరాడో నుంచి గెలిచిన డెమోక్రటిక్ పార్టీ నేత జేర్డ్ పోలిస్ అమెరికాలో గవర్నర్ పదవిని చేపట్టనున్న తొలి స్వలింగ సంపర్కుడిగా రికార్డులకెక్కారు.
ప్రశ్నించిన జర్నలిస్టుపై నిషేధం
-మీడియాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ట్రంప్
-ప్రశ్నించిన సీఎన్‌ఎన్ ప్రతినిధిపై వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధం
-వైట్‌హౌస్ మహిళా ఉద్యోగి చేయి పట్టుకున్నారని ఆరోపణ
-ట్రంప్ సర్కార్ తీరుపై అమెరికా మీడియా సంస్థల మండిపాటు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మీడియా పట్ల వ్యతిరేకతను బయటపెట్టుకున్నారు. తనను ప్రశ్నించిన ఓ విలేకరిపై అనుచితంగా ప్రవర్తించటమేగాక, తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌లో మీడియా సమావేశాలకు రాకూడదంటూ నిషేధం విధించారు. ఇటీవల మధ్యంతర ఎన్నికల ప్రచారం సందర్భంగా వలస ప్రజానీకంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల గురించి సీఎన్‌ఎన్ సీనియర్ జర్నలిస్టు జిమ్ అకోస్టా.. ట్రంప్‌ను వైట్‌హౌస్‌లో మీడియా సమావేశం సందర్భంగా నిలదీశారు. దీంతో ట్రంప్ సహనం కోల్పోయారు. ప్రశ్నించడం ఆపేసి కూర్చోవాలని ఆదేశించారు. కానీ, అకోస్టా అలాగే నిలబడి మరో ప్రశ్న వేయడానికి ప్రయత్నించడంతో ట్రంప్ ఆగ్రహం కట్టలు తెంచుకున్నది.ఆయన వద్ద ఉన్న మైక్రోఫోన్ ను లాక్కోవాలని తన సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఓ మహిళా ఉద్యోగి అకోస్టా వద్దకు వచ్చి మైక్రోఫోన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. అకోస్టా అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె చేయిని పట్టుకున్నాడు. దీనిని సాకుగా చూపించి, అకోస్టా మీడియా పాస్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది తీసేసుకున్నారు. అంతేకాదు, తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ఆయన వైట్‌హౌస్ మీడియా సమావేశాలకు రావద్దంటూ నిషేధం విధించారు. దీనిపై అమెరికా మీడియా సంస్థలు మండిపడుతున్నాయి.


PostedOn: 09 Nov 2018 Total Views: 40
మూడు కోట్లకో టికెట్!

మూడు కోట్లకో టికెట్!

-కాంగ్రెస్‌లో కాయ్ రాజా కాయ్-లిక్విడ్ క్యాష్ కొట్టు.. టికెట్ పట్టు!-అంగట్లో కాంగ్రెస్ టికెట్ల దందా-స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్ కొడుకే పాత్రధారి-వసూళ్ల కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు-లోకల్‌గా స్క్రీనింగ్ కమిటీకి ఏజెంట్లు-డబ్బులు మాత్రం ఢిల్లీలో అందజేయాలి-ఎస్సీ నియోజకవర్గాల్ల...

16 Nov 2018

కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పట్టివేత

కాంగ్రెస్ అభ్యర్థి డబ్బులు పట్టివేత

నాగర్ కర్నూల్: ఎన్నికల వేళ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈసందర్భంగా జిల్లాలోని ఉప్పునుంతల మండలం లత్తిపూర్ గేటు వద్ద హైదరాబాద్-శ్రీశైలం రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న రూ.5.88 లక్షల కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవి అచ్చంపేట‌ కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష...

16 Nov 2018

సుహాసిని పోటీపై జూనియర్, కళ్యాణ్ రామ్ అస...

సుహాసిని పోటీపై జూనియర్, కళ్యాణ్ రామ్ అసంతృప్తి

హైదరాబాద్: మహా కూటమి తరుపున టీడీపీ నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గంలో నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని నిలబెట్టనున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె వైజాగ్‌లో ఏపీ సీఎం చంద్రబాబును కూడా కలిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ వార్తలన్నింటికీ ఇవాళ ఫుల్‌స్టాప్ ప...

16 Nov 2018

చంద్ర‌బాబును స‌మ‌ర్థించిన మ‌మ‌తా బెన‌ర్జ...

చంద్ర‌బాబును స‌మ‌ర్థించిన మ‌మ‌తా బెన‌ర్జీ

కోల్‌క‌తా: సీబీఐ అంత‌ర్గ‌త క‌ల‌హాల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో సీబీఐ త‌మ రాష్ట్రంలో ఎటువంటి సోదాలు చేయ‌కూడ‌దంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు తెలిపారు. త‌న...

16 Nov 2018

కమ్మవారికి సీట్లు ఎలా ఇస్తారు?

కమ్మవారికి సీట్లు ఎలా ఇస్తారు?

మహాకూటమి తరఫున కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని ఖరారు చేయడంపై ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్‌ స్థానికులకు కాకుండా నందమూరి ఫ్యామిలీ పేరుతో కేటాయించడానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగార...

16 Nov 2018

కేటీఆర్ కోసం విజయారెడ్డి త్యాగం!

కేటీఆర్ కోసం విజయారెడ్డి త్యాగం!

ఖైరతాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును ఖరారు చేసిన తరువాత, ఇదే స్థానాన్ని ఆశించిన దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి అలకబూనగా, కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించారు. దీంతో మెట్టుదిగిన ఆమె, రెబల్ గా బరిలోకి దిగరాదని నిర్ణయించుకున్నారు. ఎన్నో ఆలోచించి దానం నాగేం...

16 Nov 2018

అక్కను గెలిపించే బాధ్యత ఎన్టీఆర్, కల్యాణ...

అక్కను గెలిపించే బాధ్యత ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లపై...

కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లతో మాట్లాడిన చంద్రబాబునందమూరి కుటుంబం నుంచి ఎవరైనా ఉంటే మహాకూటమికి ఊపుకూకట్ పల్లిలో ఉన్న అభిమానుల దృష్ట్యా గెలుపు సులభమేనన్న చంద్రబాబుదివంగత నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినిని కూకట్ పల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని నిర్ణయించుకున్న చంద్రబాబు, ఆమెను గ...

16 Nov 2018

చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీ...

చంద్రబాబు ప్రభుత్వం సంచలన నిర్ణయం.. సీబీఐకి రాష్ట్...

సీబీఐ ఇక ఏపీ అవతలేసమ్మతి ఉత్తర్వు వెనక్కికేంద్రానికి చెంపపెట్టే అంటున్న రాజకీయ విశ్లేషకులుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఇక రాష్ట్రంలో ప్రవేశించే అవకాశాన్ని ఎత్తివేసింది. అందుకు సంబంధించిన ‘సమ్మతి’ ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ఆ సంస్థ ప్రమ...

16 Nov 2018