మరోసారి అధికారం టీఆర్‌ఎస్‌దే

మరోసారి అధికారం టీఆర్‌ఎస్‌దే

 

-ఈస్ట్ ఇండియా కంపెనీ కూటమికి పరాభవం తప్పదు
-మద్దతిస్తాం.. మంత్రివర్గంలో చేరం
-రాహుల్‌గాంధీది ఫ్యూడల్ మైండ్‌సెట్
-ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ

ప్రత్యేక ప్రతినిధి, : రాష్ట్రంలో ప్రజాకూటమికి పరాభవం తప్పదని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి తాము పూర్తి మద్దతిస్తున్నా ప్రభుత్వంలో చేరబోమని ప్రకటించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఫ్యూడలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ నేతృత్వంలోని కూటమికి తెలంగాణలో పరాభవం తప్పదన్నారు. రాష్ట్రంలో ప్రజాకూటమిని ఈస్ట్ ఇండియా కంపెనీ-2018గా ఆయన అభివర్ణించారు. తమది ఏ టీమ్ బీ టీమ్ కాదని తమది హైదరాబాద్ టీమ్ అని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ఎంఐఎం ఎందుకు టీఆర్‌ఎస్ పార్టీకి బహిరంగంగా మద్దతు ఇస్తున్నదన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. టీఆర్‌ఎస్ ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎన్నో పథకాలను చేపట్టిందని చెప్పారు.

షాదీముబారక్ గరీబుల పెండ్లిళ్లకు బాగా ఉపయోగపడిందని.. దాదాపు 50వేల మందికి సాయం అందిందని వివరించారు. చరిత్రలో మొదటిసారిగా రెండేండ్లలో 900 మంది ముస్లిం యువతకు విదేశాల్లో విద్యనభ్యసించడానికి భారీగాఆర్థికసహాయం అందిందని వివరించారు. ముస్లింలలో నిరక్షరాస్యత సమస్యగా ఉన్నదని.. దానిని అధిగమించడానికి సీఎం కేసీఆర్ ముస్లిం మైనార్టీలకు గురుకుల పాఠశాలలను ఏర్పాటుచేశారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణ, సుపరిపాలనలో సమర్థంగా వ్యవహరించిందన్నారు. ఇన్ని మంచిపనులు చేసినందుకే తాము టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.


శాంతిభద్రతల్లో అగ్రభాగాన తెలంగాణ
శాంతిభద్రతల విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, మతకలహాలు లేకుండా అరాచకశక్తులను అణచివేయగలిగిందని ఆయన ప్రశంసించారు. మరోవైపు యూపీ లాం టి రాష్ర్టాల్లో నడిరోడ్డుపైనే పోలీస్ అధికారులను కాల్చిచంపుతున్నారని.. కానీ అక్కడి సీఎం తన రాష్ర్టాన్ని వదిలి ఇక్కడ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్‌షా, ఆదిత్యనాథ్ తదితరులు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, మజ్లీస్‌పైకి ఒక వర్గంవారిని ఉసిగొల్పేలా మాట్లాడారని ఆరోపించారు. గోషామహల్ ఎ మ్మెల్యే తన తలకాయ నరుకుతానంటే కూడా వారు వారించలేదని చెప్పారు. తాను సెక్యూరిటీ లేకుండా తిరుగుతానని తన తల ఎప్పుడైనా నరకవచ్చని తాను ఆత్మాహుతికి సిద్ధమని ప్రకటించారు. మోదీ నుంచి రాహుల్ వరకు ఎం ఐఎంను టార్గెట్‌చేసి మాట్లాడారని అది తమకే మంచిదన్నారు.

రాహుల్ అసమర్థుడు
రాహుల్‌గాంధీ అసమర్థంగా వ్యవహరించబట్టే చాలా రాష్ర్టాల్లో బీజేపీ గెలుస్తున్నదని ఒవైసీ విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకున్నవారు కూడా రాహుల్ తెలివితక్కువ పనివల్ల బీజేపీకి ఓటువేయాల్సిన దుస్థితి నెలకొంటున్నదని చెప్పారు. రాహుల్ ఫ్యూడలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారని.. ఆయన తన తల్లి సోనియాగాంధీ వద్ద సంస్కారం నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలకు రక్షణ కల్పిస్తుందన్న నమ్మకం పోయిందన్నారు. తాను మహారాష్ట్ర, అసోంలో బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇవ్వడం వల్ల కాంగ్రెస్ ఓడిపోయిందని రాహుల్ అనడంలో అర్థంలేదని పేర్కొన్నారు. తాము మద్దతిచ్చినందుకు అక్కడ ఓడిపోతే మరి మిగతా రాష్ర్టాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. తాము ఎన్నోసార్లు కాంగ్రెస్‌ను ఆదుకున్నామని కానీ ఆ పార్టీ ముస్లింలకు ఒరగబెట్టింది ఏమీలేదన్నారు.


PostedOn: 06 Dec 2018 Total Views: 80
రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చె...

24 Mar 2019

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చ...

24 Mar 2019

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ ర...

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్ర‌దేశ్‌ను అవినీతిలో నంబ‌ర్-1గా నిలిపి ప్ర‌పంచంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధించ‌ని ఘ‌న‌త‌ను సాధించారు...

22 Mar 2019

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, త...

22 Mar 2019

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ...

22 Mar 2019

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019