మోదీది అధికార దుర్వినియోగం

మోదీది అధికార దుర్వినియోగం

 

 


-కోదాడ సభలో రాహుల్‌గాంధీ విమర్శ
-బీజేపీకి హెలికాప్టర్లు తప్ప ఓట్లు లేవు: ఏపీ సీఎం చంద్రబాబు

కోదాడ టౌన్/అశ్వారావుపేట/ సత్తుపల్లి: నరేంద్రమోదీ పాలనలో భారతదేశ శక్తి క్షీణిస్తున్నదని రాహుల్‌గాంధీ విమర్శించారు. ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై దాడులుచేస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో ప్రజాకూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు. ఈ బహిరంగసభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి కుంతియా, కాంగ్రెస్ అభ్య ర్థి పద్మావతి, కొడాలి నాని, బండ్ల గణేష్ పాల్గొన్నారు.

అశ్వారావుపేట, సత్తుపల్లిలో బాబు ప్రచారం
మోదీ పాలనలో దేశం క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లిందని, దేశ ప్రజల సంక్షేమం కోసమే 35 ఏండ్లుగా రాజకీయంగా విభేదించిన కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. మోదీ పాలనలో సీబీఐ సైతం అవినీతిమయమైందని ఆరోపించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రజాకూటమి ఎన్నికల సభల్లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి ఓట్లులేవని, హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయని ఎద్దేవాచేశారు. మాయమాటలతో గారడీ చేయటంలో మోదీ దిట్ట అని విమర్శించారు. బీజేపీ దేశమంతా ముస్లింలపై దాడులు జరిపిస్తూ.. హిందూ ముస్లింలను వేరుచేస్తూ.. హిందువుల ఓట్ల కోసం కుట్రలు పన్నుతున్నదన్నారు.

ఫలితాల తర్వాతే సీఎం అభ్యర్థి నిర్ణయం
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ
ప్రజాఫ్రంట్ సీఎం అభ్యర్థిని ఎన్నికల ఫలితాల తర్వాతే నిర్ణయిస్తామని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చెప్పారు. కూటమి అధికారంలోకివస్తే.. రైతులకు ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్లను అందుబాటులో ఉంచుతామన్నారు. బుధవారం తాజ్‌కృష్ణహోటల్‌లో ప్రజాఫ్రంట్ నేతలతోకలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తీసుకున్న నోట్లరద్దు నిర్ణయంతో దేశ ఆర్థికవ్యవస్థ సర్వనాశనమైందన్నారు. కేవలం 15 మందికి రూ.మూడులక్షల కోట్లను మోదీ పంచిపెట్టారని ఆరోపించారు. తాము నిరుద్యోగులకు ఉపాధికల్పన, వ్యవసాయం, విద్యకు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ.. జాతీయ రాజకీయాలకు తెలంగాణ ఎన్నికలు నాందికావాలన్నారు . టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాఫ్రంట్ అధికారంలోకివస్తే హైదరాబాద్ నుంచే పాలన సాగుతుందని చెప్పారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ అజెండా అమలు బాధ్యత తనదని పేర్కొన్నారు. సీపీఐ జాతీయకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సైద్ధాంతిక రాజకీయ విభేదాలున్నా.. కూటమిగా ఏర్పడ్డామని, ప్రజలకు స్వేచ్ఛను కల్పిస్తామన్నారు. సమావేశంలో గద్దర్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష మాదిగ, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


PostedOn: 06 Dec 2018 Total Views: 111
మద్యం ప్రియులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత...

మద్యం ప్రియులకు షాకివ్వనున్న జగన్ ప్రభుత్వం?

ఐదేళ్లలో విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని విధించే దిశగా ఏపీ సర్కార్ ఒడిఒడి అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు జగన్ సర్కార్ సన్నద్ధమవుతుంది. ముఖ్యంగా మద్యం అమ్మకాల సమయాల్లో మార్పులు చేర్పులు చేపట్టే దిశగా ప్రణాళిక సిద్దం చేస్తోంది జగన్ సర్కార్. అయితే ఏపీలో ప్రస్...

09 Jul 2019

నోటీసు ఇచ్చిన తహశీల్దార్లకు తెలంగాణా సర్...

నోటీసు ఇచ్చిన తహశీల్దార్లకు తెలంగాణా సర్కార్ షాక్!

తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వర్క్ తో రూల్ నోటీసు ఇచ్చిన తహశీల్దార్ లకు షాక్ ఇచ్చింది తెలంగాణా సర్కార్. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం వర్క్ టూ రూల్ సమ్మె నోటీసు ఇచ్చారు తహశీల్దార్లు. అయితే, ఈరోజు ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ విధుల్లో ఉన్న 18 మంది తహశీల్దార్ లను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత...

09 Jul 2019

వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయ...

వ్యవసాయాన్ని పండుగ చేసిన మహానుభావుడు వైయస్‌ఆర్‌

రైతు సంక్షేమం అంటే దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు గుర్తుకువస్తుంది. వ్యవసాయం దండగ కాదు.. పండుగలా చేస్తానని ముందుకు వచ్చిన ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ నేటికీ ప్రజలందరి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆయన జన్మదినాన్ని రాష్ట్ర రైతు దినోత...

09 Jul 2019

‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

‘ప్రజావేదిక’పై సీఎం జగన్‌ సంచలన నిర్ణయం

గత టీడీపీ ప్రభుత్వం ఉండవల్లిలో నిర్మించిన ప్రజావేదిక అక్రమ నిర్మాణమని, దీన్ని కూల్చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిఆదేశించారు. సోమవారం కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మనం కూర్చున్న ఈ భవనం నిబంధనలకు విరుద్ధంగా కట్టారని తెలిపారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక...

24 Jun 2019

మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్...

మనం పాలకులం కాదు.. సేవకులం : వైఎస్‌ జగన్‌

‘మనం పాలకులం కాదు.. సేవకులం’ అని ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి,కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని సూచించారు. మేనిఫెస్టో అన్నది ఓ...

24 Jun 2019

ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస...

ప్రతి సోమవారం ‘స్పందన’ కార్యక్రమం : వైఎస్‌ జగన్‌

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రివైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికలెక్టర్లకు సూచించారు. ఇది కేవలం కలెక్టరేట్‌కు మాత్రమే పరిమితం కాకుండా జిల్లాల్లో ఎక్కడైనా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. సోమవారం నిర్వహి...

24 Jun 2019

పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా ...

పేద తల్లులు... పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి

ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొద్ది రోజులుగా భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాటన్నింటికీ తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఈ ప్రకటన చేసింది. ‘అమ్మ ఒడి’ విషయం...

24 Jun 2019

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

అక్రమ లాభార్జనపై 10% జరిమానా

ఎలక్ట్రిక్‌ వాహనాలపై, ఎలక్ట్రిక్‌ చార్జర్లపై పన్ను తగ్గింపు ప్రకటన జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి వెలువడుతుందని భావించగా, నిర్ణయాన్ని ఫిట్‌మెంట్‌ కమిటీకి నివేదిస్తూ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తొలిసారి అధ్యక్షత వహరించిన జీఎస్టీ కౌన...

22 Jun 2019