.జగన్ గూటికి నటుడు అలీ.. ముహూర్తం ఖరారు!

.జగన్ గూటికి నటుడు అలీ.. ముహూర్తం ఖరారు!

 


సినీనటుడు అలీ వైసీపీ కండువా కప్పుకోనున్నారు. గత నెల 28న ఓ ఎయిర్‌పోర్టులో జగన్, అలీ కలుసుకోవడంతో అప్పటి నుంచి అలీ వైసీపీకి వెళ్తున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వ్యాఖ్యలను నిజం చేస్తూ అలీ వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలిపారు. ఈ నెల 9న వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వైసీపీలో చేరేందుకు అలీ నిర్ణయించుకున్నారు. అదే విధంగా పార్టీ ఆదేశిస్తే పోటీకి కూడా తాను సిద్దమంటూ అలీ తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆశించి అలీ భంగపడ్డారు. ఆ తర్వాత వ్యూహాత్మకంగానే వైసీపీకి దగ్గరయ్యారు. పార్టీలో చేరికను ధృవీకరించారు. అయితే ఈ సారి ఎన్నికల్లో అలీ పోటీ చేస్తారా..? లేదా కేవలం ప్రచారానికే పరిమితమవుతారా..? అన్నది వేచి చూడాలి. కాగా.. పవన్‌కు సన్నిహితుడిగా పేరున్న అలీ.. జనసేనలోకి కాకుండా వైసీపీలోకి చేరుతుండటంపై సినీ, రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారింది.


PostedOn: 04 Jan 2019 Total Views: 141
విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?

విపక్షాల విమర్శలకు ఈసీ రియాక్షన్ ఏంటి?

ఈవీఎమ్స్‌లో లోపాలు , వీవీప్యాట్ల లెక్కింపుపై విపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి. ఢిల్లీలో సమావేశమైన ఎన్డీయేతర పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిపై వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వీవీప్యాట్లు లెక్కించేందుకు ఈసీకి ఉన్న సమస్య ఏంటని ప్రశ్నించిన విపక్షాలు తాము లేవనెత్తిన సమస్యలకు ఈసీ వెంటనే పరి...

21 May 2019

చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయం

చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయం

చంద్రబాబు లక్షశాతం ఓడిపోవడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు .విశాఖలో ఆయనతో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఓడిపోతుందని తెలిసి దొంగ సర్వేలతో పబ్బం గడపాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.కాంట్రాక్టర్లకు కక్కుర్తిపడి బాబుకు అనుకూలంగా లగడపాటి సర్వే అంటూ దుయ్యబట్టారు.గత...

21 May 2019

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

లగడపాటి సర్వేపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ప్రజల నాడి తెలిసిన వాళ్లే ఎగ్జిట్ పోల్స్‌ చేయాలని, ప్రతి పనికి మాలిన వాళ్లు సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ నేత మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈ సర్వేలు ప్రజలకు అవసరం లేదని, రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయన్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చేసిన సర్వేపై అయ్యన్నపాత్రుడు తీవ్...

21 May 2019

ఖమ్మందే తొలి ఫలితం..

ఖమ్మందే తొలి ఫలితం..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 నియోజకవర్గాలకు సంబంధించి 35 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతీ నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. దీంతో తక్కువ పోలింగ్‌ స్టేషన్లు ఉన్న ఖమ్మం ఫలితం మొదట వెలువడనుంది. ఇక 185 మంది బరిలో నిల్చిన నిజా...

21 May 2019

కేసీఆర్ క్యాంప్ ఎవరికి మద్దతు ఇవ్వబోతోంద...

కేసీఆర్ క్యాంప్ ఎవరికి మద్దతు ఇవ్వబోతోంది?

ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్‌ తర్వాత దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై గులాబీ పార్టీ కన్నేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పెర్ఫ్మామెన్స్‌పై విశ్లేషణ ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌లో మహాకూటమి కట్టిన పార్టీలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపబోవని అంచనాకి వచ్చింది. కొత్త ప్రభుత్వ ఏర్పాట...

21 May 2019

బాబు పిలవకున్నా పని కట్టుకోని వెళ్లి ఏపి...

బాబు పిలవకున్నా పని కట్టుకోని వెళ్లి ఏపి పరువు తీస...

ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా రావడంతో బాబు తన ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత రామచంద్రయ్య విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన అయన బాబుపై ఈ వాఖ్యలు చేసారు . కొన్ని గంటల్లో విడుదల అవనున్నా ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండడం అయన జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దావా చేసార...

21 May 2019

హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌లో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్ , సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాలకు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు అధికారులు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. సిటీలో మొత్తం 14 కౌంటింగ్ సెంటర్స్‌లో కౌంటింగ్ చేపట్టనున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 14 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కౌ...

21 May 2019

జగన్ సీఎం అయితే..? గెలుపుపై సరికొత్త బెట...

జగన్ సీఎం అయితే..? గెలుపుపై సరికొత్త బెట్టింగ్స్.....

టీడీపీ గెలిస్తే లక్షకు లక్షన్నర.. అదే జగన్ సీఎం అయితే లక్షకు రెండున్నర లక్షలు ఇస్తామంటూ ఏపీలో భారీ ఆఫర్లు నడుస్తున్నాయి. బ్రోకర్ల ఆఫర్లకు టెంప్ట్ అవుతోన్న బెట్టింగ్ రాయుళ్లు కోట్ల రూపాయల్లో పందేలు కాస్తున్నారు. దాంతో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 200 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంద...

21 May 2019