ఏబీసీడీల నుంచి ప్రారంభించండి

ఏబీసీడీల నుంచి ప్రారంభించండి-రాహుల్‌కు చురకలంటించిన రక్షణమంత్రి
-దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజం
-పార్లమెంటులో క్షమాపణలు చెప్పి.. పదవి నుంచి వైదొలగాలని డిమాండ్

న్యూఢిల్లీ, జనవరి 6: రాహుల్ విమర్శలపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. హాల్ విషయంలో దేశ ప్రజలను రాహుల్‌గాంధీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సిగ్గుపడాల్సిన విషయం ఇది. 2014-18 మధ్య కాలంలో హాల్‌కు సంబంధించి రూ.26,570 కోట్ల కాంట్రాక్టులపై సంతకాలు జరిగాయి. మరో 73వేల కోట్లకు సంబంధించిన ఆర్డర్లు చర్చల దశలో ఉన్నాయి. బీజేపీ హయాంలో హాల్‌కు కనీసం ఒక్క రూపాయి కూడా ఆర్డర్లు ఇవ్వలేదంటూ రాహుల్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం. నాపై ఆరోపణలు చేసే ముందు సదరు పత్రికలో వచ్చిన వ్యాసాన్ని రాహుల్ పూర్తిగా చదివి ఉండాల్సింది. ఆర్డర్లపై సంతకాలు జరిగినట్లు నేనెక్కడా చెప్పలేదు. వాటికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాను. అవసరమైతే లోక్‌సభ రికార్డులను సైతం తనిఖీ చేసుకోవచ్చు. నాపై తప్పుడు ఆరోపణలు చేసిన రాహుల్ పార్లమెంటు వేదికగా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. తన పదవికి ఆయన రాజీనామా చేయాలి అని ట్విట్టర్‌లో నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. రాహుల్ పరిజ్ఞానం చూస్తూంటే ఆయన ఇక ఏబీసీడీల నుంచి ప్రారంభించాల్సి ఉందని అవగతమవుతున్నదని ఎద్దేవా చేశారు.

ఆర్డర్లు లేవు.. అడ్వాన్సులూ లేవు: హాల్ ఉద్యోగుల ఆవేదన
హాల్‌కు లక్ష కోట్ల ఆర్డర్ల మాట దేవుడెరుగు..! కనీసం అడ్వాన్సులు కూడా లేవని సంస్థ ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేశారు. అసలు లక్ష కోట్ల ఆర్డర్లు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయో కూడా తమకు తెలియదని వారు వాపోయారు. ఉద్యోగుల జీతభత్యాల కోసం సంస్థ తొలిసారిగా రూ.962 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుందని చెప్పారు. 83 యుద్ధ విమానాలు, 15 హెలీకాప్టర్లకోసం ఆర్డర్లు తుది దశలో ఉన్నాయని, ఇవి కార్యరూపం దాల్చిన అనంతరం డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదముద్ర పడిన తర్వాతే తమకు ఆర్డర్లు అందుతాయని సంస్థ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. హాల్‌కు ప్రధాన వినియోగదారైన భారత వాయుసేన పాత బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని ఒక అధికారి పేర్కొన్నారు.

 


PostedOn: 07 Jan 2019 Total Views: 68
రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చె...

24 Mar 2019

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చ...

24 Mar 2019

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ ర...

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్ర‌దేశ్‌ను అవినీతిలో నంబ‌ర్-1గా నిలిపి ప్ర‌పంచంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధించ‌ని ఘ‌న‌త‌ను సాధించారు...

22 Mar 2019

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, త...

22 Mar 2019

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ...

22 Mar 2019

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019