మోదీ పాలనలో అసహనం

మోదీ పాలనలో అసహనం

 


- నోట్ల రద్దు, జీఎస్టీలతో తీవ్రంగా దెబ్బతిన్న భారత్
- దేశం ముందు నిరుద్యోగం, రైతుల ఇబ్బందులు ప్రధాన సమస్యలు
- దుబాయ్‌లో ప్రవాస భారతీయులతో రాహుల్‌గాంధీ వెల్లడి

దుబాయ్, : ప్రధాని మోదీ నాలుగున్నరేండ్ల పాలనలో అసహనం రాజ్యమేలుతున్నదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆరోపించారు. యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు 2019 సంవత్సరం సహన పూరిత సంవత్సరం కాగా.. భారతలో నాలుగున్నరేండ్ల నుంచి అసహనం రాజ్యమేలుతున్నది అని తెలిపారు. రెండు రోజుల దుబాయ్ పర్యటనలో ఉన్న రాహుల్ శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకే ఆలోచన, ఒకే సిద్ధాంతం సరైనది అనే భావన తప్పు. మేము అధికారంలోకి వస్తే అందరి ఆలోచనలకు పెద్ద పీట వేస్తాం అని రాహుల్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రభుత్వ తప్పుడు ఆలోచనల భారత్ తీవ్రంగా దెబ్బతిన్నదని తెలిపారు. ఇండియా ముందు రెండు ప్రధాన సవాళ్లు ఉన్నాయని అందులో ఒకటి నిరుద్యోగాన్ని రూపుమాపడం, రెండోది రైతులను ఆదుకోవడం అని చెప్పారు. నిరుద్యోగాన్ని ఎదుర్కోవాలంటే భారీగా ఉద్యోగాలను సృష్టించాలని, తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకోవడానికి రెండో హరిత విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
భారత్ ఆశయాలను హృదయాల్లో దాచుకొని మీరు (ప్రవాస భారతీయులు) ఇక్కడికి వచ్చారు. నేను మరణించే వరకు నా చెవులు, గుండె, నా ఇంటి తలుపులు ఎల్లప్పుడూ మీ కోసం తెరిచే ఉంటాయి అని రాహుల్ చెప్పారు. ఈ రోజు భారత్ కులాలు, మతాలు, ప్రాంతాల వారీగా విడిపోయిందని, దీనికి ప్రధాన కారణం రాజకీయ కుట్రేనని తెలిపారు. వర్గాల వారీగా విడిపోయిన క్రికెట్ టీం మ్యాచ్‌ను గెలుస్తుందా? అలాగే మతాలు, కులాల వారీగా విడిపోయిన దేశం విజయం సాధిస్తుందా? అందుకే మళ్లీ భారత్‌ను ఏకం చేయడానికి అందరం కలిసి ముందుకుసాగుదాం అని రాహుల్ చెప్పారు. బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నదని.. కానీ తాము బీజేపీ ముక్త్ భారత్ అనటం లేదని రాహుల్ పేర్కొన్నారు. దుబాయ్ నిర్మాణంలో భారతీయ కార్మికుల కృషి మరువలేనిదని చెప్పారు. దుబాయ్‌లో పెద్దపెద్ద భవనాలు, విమానాశ్రయాలు, మెట్రోలు నిర్మించారంటే అందులో మీ కృషి ఎంతో ఉంది. మీరు లేకుంటే ఇవి నిర్మాణం జరిగేవి కావు. దుబాయ్ నిర్మాణంలో మీ రక్తం, చెమట దాగి ఉన్నది. మిమ్మల్ని చూస్తే భారత్ గర్వపడుతున్నది అని కార్మికులను ప్రశంసించారు. నేను ఇక్కడికి వచ్చింది మన మన్‌కీ బాత్(ప్రధాని మోదీ కార్యక్రమం) గురించి చెప్పడానికి కాదు. మీ(కార్మికుల) మన్‌కీ బాత్ వినడానికి అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న తమ హామీని రాహుల్‌గాంధీ పునరుద్ఘాటించారు.

 

 


PostedOn: 12 Jan 2019 Total Views: 71
రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్నను మంత్రిని చేస్తా

రాజశేఖరన్న గురించి చెప్పాలి. నేను అడిగిన వెంటనే తన సీటును కూడా వదులుకున్నాడు. సామాజిక న్యాయం చేయాలని అడిగితే.. ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేదు. రాజశేఖరన్నను నా గుండెల్లో పెట్టుకుంటా.. చిలకలూరిపేటను మీరు గెలిపించండి రాజశేఖరన్నను మంత్రిని కూడా చేస్తా అని మాటిస్తున్నా. అన్నిరకాలుగా తోడుగా ఉంటానని మరోసారి చె...

24 Mar 2019

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

వైసీపీలో చేరబోతున్నా : సినీ నిర్మాత

ఏపీలో ఎన్నికల వేళ వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇప్పటికే టీడీపీ నుండి పలువురు నాయకులు చేరిన విషయం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ పార్టీలో చేరబోతున్నట్టుగా ప్రకటించారు. గత 1981 నుంచి కాంగ్రెస్‌లో ఉన్న నట్టి కుమార్, ఏపీలో టీపీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య కొనసాగుతున్న చ...

24 Mar 2019

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ ర...

న‌మ్మాలి.. న‌డ‌క‌లో చంద్ర‌బాబు ప్ర‌పంచ రికార్డు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో సాధించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్ర‌దేశ్‌ను అవినీతిలో నంబ‌ర్-1గా నిలిపి ప్ర‌పంచంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి సాధించ‌ని ఘ‌న‌త‌ను సాధించారు...

22 Mar 2019

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

శనివారం మూడు జిల్లాల్లో జగన్ ప్రచారం..

ప్రచారానికి రెండురోజుల విరామం ఇచ్చిన జగన్ శనివారం నుంచి మళ్ళీ సుడిగాలి పర్యటనకు సిద్ధమయ్యారు. శనివారం మూడు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేస్తారని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురామ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శనివారం శ్రీకాకుళం, విశాఖపట్నం, త...

22 Mar 2019

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

ఆసక్తికర పరిణామం.. కేఏ పాల్ షాక్..

వైసీపీని తీవ్రంగా విమర్శించే ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. నామినేషన్ వైసీపీ ఎంపీ అభ్యర్థిని కలుసుకున్నారు. ఈ సందర్బంగా ఒకరికొకరు కౌగలించుకుని సరదాగా మాట్లాడుకున్నారు. ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా కేఏ పాల్ , వైసీపీ ఎంపీ అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు నరసాపురం లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ...

22 Mar 2019

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జ...

21 Mar 2019

'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019ఈ మధ్యకాలంల...

21 Mar 2019

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలో చేరిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే

వైసీపీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు వైఎస్సార్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్‌లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ స...

21 Mar 2019