చంద్ర‌బాబు స్మార్ట్ చీటింగ్‌

చంద్ర‌బాబు స్మార్ట్ చీటింగ్‌
– సెల్‌ఫోన్లు, రూ 10 వేలు నగదు అంతా మాయ
– వైసీపీని ఇరికించి జనాన్ని బుట్టలో వేసుకునేందుకు మాస్టర్‌ ప్లాన్‌
 
‘మన ప్రభుత్వం రాగానే’ బేషరతుగా డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా.., మహిళలపై దాడి జరిగితే వారికి యావజ్జీవ శిక్ష పడేలా చేస్తా...’ మరొక్క అవకాశం ఇవ్వండి. అది 2013 మే నెల.. సలసల కాగిపోయే ఎండల్లో విజయవాడలో మహిళా గర్జనలో చంద్రబాబు ఇచ్చిన హామీ.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా నన్ను గెలిపిస్తే మీకు అన్నగా అండగా ఉంటానని మహిళలకు ఇచ్చిన హామీ ఇది. తాను కోరుకున్నట్టుగానే నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబుకు ఇచ్చిన హామీకి ఐదేళ్లు గడిచిపోయింది. ఇంతవరకు డ్వాక్రా రుణాలు మాఫీ జరిగిందే లేదు. రుణాలు మాఫీ చేయలేదేమి అని అడిగితే... నేనెక్కడన్నా అన్నాడు. అదే ముఖ్యమంత్రి నంద్యాల ఎన్నికలప్పుడు ఒక్కసారిగా మహిళల మీద ప్రేమ పుట్టుకొచ్చింది. రూ. పదివేలు రుణాలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చాడు. ఒటేయించుకున్నాడు. మహిళలను అలాగే వదిలేశాడు. ఇక మహిళల రక్షణ అంటారా.. కొత్తగా చెప్పేదేం లేదు. ఒక రిషితేశ్వరి, వనజాక్షి సంఘటనలే ఉదాహరణలు.. ఈ నాలుగున్నరేళ్ల  చంద్రబాబు పాలనలో మహిళల రక్షణ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదేమో. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలొస్తున్నాయి. చంద్రబాబు మళ్లీ మహిళలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యాడు. నంద్యాల్లో గెలిపించిన పది వేల ఫార్ములాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ అందులో పెద్ద తిరకాసు ఉంది. రుణమాఫీ చేస్తానని చెప్పిన బాబు.. నేనెప్పుడు చెప్పానని మాట దాట వేశాడు. నంద్యాల ఎన్నికల్లో లబ్ధి కోసం... రూ. 10 వేలు మాత్రమే పంపిణీ చేశాడు. అదీ మూడు విడతల్లో.. అందులోనూ ఒకట్రెండు విడతలకు మాత్రమే డబ్బు పొందిన వారున్నారు. చాలా మందికి మూడు విడతలు డబ్బులు రాలేదు. ఇప్పుడు కూడా ఎన్నికల ముందు రూ. 10 వేల ఫార్ములాకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. మూడు విడతల్లో పంపిణీ చేస్తారంట ఆయన. అయితే దానికే ఒటేస్తారా అని భయం పట్టుకుంది. ఎంతైనా అసెంబ్లీ ఎన్నికలు కదా.. స్మార్ట్‌గా ఆలోచించి పది వేలతోపాటు స్మార్ట్‌ ఫోన్‌ కూడా పంపిణీ చేస్తానని ఆడంబరంగా ప్రకటించాడు. ఎన్నికల ముందు ఇలా డబ్బు పంచడం అంటే.. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేయడమే. ఫిబ్రవరిలో 2500.. అంటే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే నెల, మార్చిలో 3500.. అంటే ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే నెల. ఏప్రిల్‌లో 4 వేలు.. అంటే ఓటు వేయడానికి వెళ్లే ముందు ఇచ్చే బహుమతి అన్నమాట. అయితే ఇలా ఎన్నికలకు ముందు తాయిళాలు ప్రకటించడం చూసి.. ఈ అయిదేళ్లు చేసిన అరాచకాలను జనం మరిచిపోయి పది వేలు తీసుకుని తనకే ఓటేయాలనేది చంద్రబాబు కోరిక. ఈ మూడు విడతల్లో ప్రభుత్వం పంపిణీ చేయబోయేది ఒక్క విడతే... ఎలాగంటారా.. అక్కడికే వస్తున్నా. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపు ఒక్క విడతలో రూ. 2500 మాత్రమే పంపిణీ చేయడానికి వీలవుతుంది. రెండో విడత పంపిణీ నాటì కి ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది కాబట్టి పంపిణీ జరగదు. అలా కాకపోయినా ఓటర్లను ప్రభావితం చేస్తారని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ఈసీని ఆశ్రయించి ఎలాగూ ఆపేస్తారు.. అదే జరిగితే ఆ నెపాన్ని వారి మీదకే నెట్టేయవచ్చు. అలా లాభం పొందవచ్చనేది చంద్రబాబు వ్యూహం... ఇక స్మార్ట్‌ ఫోన్లంటారా.. ప్రతి జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉండే మండలాన్ని ఎంచుకుని అంతవరకే పంపిణీ చేసి.. ఎన్నికల కోడ్‌ రావడంతో ఆపేస్తారు. మళ్లీ ఎన్నికలు కాగానే పంపిణీ చేస్తామని ప్రకటిస్తారు. అలా దానినీ అటకెక్కిస్తారు.. 
 
సందీప్ కుమార్ మ‌ల్లాది
డిజిట‌ల్ స్ట్రాట‌జిస్ట్‌
సెల్ నంబ‌ర్‌..9160 239239

PostedOn: 26 Jan 2019 Total Views: 47
స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ...

స్వరూపనందేంద్ర స్వామిపై సాధినేని యామిని ఫైర్?

కొండవీడు ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం.. ప్రజామోదం పొందే వారికే సీట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ నుండి వెళ్లిన నేతలను చిత్తు చిత్తుగా ఓడించాల్సిన భాధ్యత అందరిపై ఉందన్న చంద్రబాబు.. కాపులకు న్యాయం చేశామని పార్టీ నుండి వెళ్లారా? ఎందుకు వెళ్లారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలన...

18 Feb 2019

ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి

ఈడీ ముందుకు రేవంత్‌రెడ్డి

ఏపీ, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ అలజడి రేపుతోంది. గత కొద్ది రోజులుగా ఓటుకు నోటు కేసు వ్యహారం తెరపైకి రావడంతో ఉత్కంఠ నెలకొంటుంది. ఈ కేసులో ఇవాళ ఉదయసింహా ఈడీ అధికారుల ఎదుట హాజరుకాగా… కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి… రేపు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక...

18 Feb 2019

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అం...

పాకిస్తాన్‌ కోడలు.. తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ ఏం...

‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్‌ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్‌ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. ...

18 Feb 2019

మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు

మాగుంటతో భేటీ అయిన టీడీపీ నేతలు

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో సమావేశమయ్యారు తెలుగుదేశం పార్టీ నేతలు… ఈ భేటీకి ఎమ్మెల్సీ కరణం బలరాం, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒంగోలు, బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంద...

18 Feb 2019

రైతుల‌పై బాబు ఎన్నిక‌ల ప్రేమ‌

రైతుల‌పై బాబు ఎన్నిక‌ల ప్రేమ‌

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కొచ్చే కొద్దీ చంద్ర‌బాబులో అధికార కాంక్ష అన‌కొండ‌లా మారిపోతోంది. హామీల మీద హామీలు గుప్పిస్తూ, ప్ర‌జ‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేయాల‌ని అనుకుంటున్నాడు. కౌలురైతుల‌కు ఏటా 15000 అలాంటి మ‌రో హామీ. 2014లో రైతుల‌కిచ్చిన హామీ...

18 Feb 2019

వైయస్‌ జగన్‌ మగధీరుడు

వైయస్‌ జగన్‌ మగధీరుడు

ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక మగధీరుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని టీడీపీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీలో చేరిక అనంతరం ఎంపీ రవీ...

18 Feb 2019

వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

వైయ‌స్ జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌ జంగా కృష్ణ‌మూర్తికి ఎమ్మెల్సీ ప‌ద‌వి నాన్నే నాకు స్ఫూర్తి వైయస్‌ జగన్‌తో మళ్లీ రాజన్న రాజ్యం.. వైయస్‌ జగన్‌తోనే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యం ఉదయించే సూరీడు వైయస్‌ జగన్‌ నూతన ఒరవడి ...

17 Feb 2019

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌

బీసీల‌కు వైయ‌స్ జ‌గ‌న్ వ‌రాల వెల్లువ‌

ప్ర‌జాశీస్సుల‌తో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే... జ‌గ‌న్ అనే నేను ....ఏపీ బీసీల‌కు ఏమి చేస్తానంటే.... బీసీల సంక్షేమానికి ఏటా రూ. 15 వేల కోట్లు వెచ్చిస్తాం 5 ఏళ్ల‌లో రూ. 75 వేల కోట్లు ఖ‌ర్చు చేస్తాం బీసీ స‌బ్ ప్లానుకు చ‌ట్ట బ‌ద్ధ&...

17 Feb 2019