వికీపీడియాలోనూ అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తున్న ఐటీ మంత్రి లోకేష్

వికీపీడియాలోనూ అబ‌ద్ధాలు ప్ర‌చారం చేస్తు...
మేనేజ్ చేయ‌డంలో తండ్రిని మించిన త‌న‌యుడు అని డేటా చోరీ కేసుతో నిరూపించుకున్నాడు నారా లోకేష్. స‌మాచారం కోసం అంద‌రూ ఎక్కువ‌గా ఉప‌యోగించే వికీపీడియాలోనూ త‌న ఐటీ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు. ప్ర‌స్తుతం ఆయ‌న పోటీ చేయ‌బోతున్న మంగ‌ళ‌గిరి స్థానంలో 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి గెలిచారు.
 
కానీ వికీపీడియాలో అసెంబ్లీ అభ్య‌ర్థుల లిస్టులో మాత్రం అప్పుడు ఓడిపోయిన టిడిపి అభ్య‌ర్థి గంజి చిరంజీవి గెలిచిన‌ట్టుగా క‌నిపిస్తోంది. లోకేష్ అభ్య‌ర్థిత్వం ఖ‌రారైన నేప‌థ్యంలో వికీలో సెర్చ్ చేస్తున్న వారికి 2014 మంగ‌ళ‌గిరిలో గెలిచింది టిడిపి అని చ‌దివి ముక్కున వేలేసుకుంటున్నారు.
 
ఇలా ఇంకెన్ని త‌ప్పులు వికీలో చేర్చారా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఏపీలో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఓట్ల‌ను తొల‌గించి అడ్డ‌దారిలో గెల‌వాల‌ని చూడ‌ట‌మే కాకుండా, అంత‌ర్జాతీయ స‌మాచార స్ర‌వంతిలోనూ అబ‌ద్ధాల‌ను పోస్టు చేయ‌డం ఏమిట‌ని నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు.
 
పోనీ పేరు పొర‌పాటు ప‌డింది అనుకున్నా ప‌క్క‌నే తెదేపా అభ్య‌ర్థి గెలిచిన‌ట్టు ఎలా చూపిస్తార‌ని నెటిజ‌న్లు త‌ప్పు ప‌డుతున్నారు. ఐటి గ్రిడ్ తో స‌మాచారాన్ని చోరీ చేసిన ఐటీ మంత్రి వికీపీడియాను మేనేజ్ చేసి త‌ప్పుడు స‌మాచారాన్ని పోస్టు చేస్తున్నాడ‌ని ఆరోపిస్తున్నారు. సొంత‌వి కాని వీడియోలు, పోస్టుల‌పై కాపీరైట్ ఉంద‌ని అబ‌ద్ధ‌పు కంప్లైంట్ల‌తో సోషల్ మీడియా యూజ‌ర్ల‌ను బ్లాక్ చేయిస్తున్న ఐటీ మంత్రి టీమ్ చివ‌ర‌కు వికీపీడియాను కూడా వ‌ద‌ల‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వికీ యాజ‌మాన్యం ఈ విష‌యాన్ని సీరియ‌స్ గా తీసుకుని నిజాల‌ను పోస్టు చేయాల‌ని, ఫాల్స్ డేటా రాకుండా త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతున్నారు. ఏపీలో ఎల్లో మీడియా మాత్ర‌మే టిడిపికి ప్ర‌చారం చేస్తోంద‌నుకుంటున్న ప్ర‌జ‌లు ఇప్పుడు వికీపీడియా కూడా తోడైన‌ట్టుంద‌ని చ‌ర్చించుకుంటున్నారు.
 
 
 
 
 

PostedOn: 13 Mar 2019 Total Views: 110
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే అధికారం

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌లో క్రెడిబులిటీ ఉన్న సంస్థలన్నీ తేల్చిచెప్పాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్&...

20 May 2019

ఎగ్జిట్‌ పోల్స్‌పై లక్ష్మీనారాయణ కామెంట్...

ఎగ్జిట్‌ పోల్స్‌పై లక్ష్మీనారాయణ కామెంట్‌

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆధారంగా ఫలితాలను లెక్కగట్టడం సరైనది కాదని, ఎగ్జిట్ పోల్స్ వెల్లడించే సంస్థలు తమ ఖచ్చితత్వాన్ని నిరూపించుకోవాలని జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్ధి వి.వి.లక్ష్మీనారాయణ సవాలు విసిరారు. తాము సేకరించిన నమూనాలపై నమ్మకం వుంటే బాండ్ పేపర్ పై రాసి ఇవ్వాలని లక్ష్మీనారాయణ అన్నారు. మద్యం, డబ...

20 May 2019

17సీతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి

17సీతో వీవీప్యాట్‌ స్లిప్పులు సరిపోవాలి

ఈ నెల 23 న జరిగే ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. వీవీప్యాట్‌ స్లిప్పులు ఫారమ్‌ 17 సీ లెక్కలతో సరిపోవాలన్నారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలు తలెత్తితే తొలుత బాగున్న ఈవీఎంలను లెక్కించి ఆ తర్వాత పాడైన ఈవీఎంల తాలూకు వీవీప్యాట్‌...

20 May 2019

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదు: క...

ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదు: కుమారస్వామి

ఎగ్జిట్‌ పోల్స్‌ పై కర్నాటక సీఎం కుమారస్వామి విమర్శలు గుప్పించారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఎగ్జాట్ పోల్స్‌ కాదన్నారు. దేశంలో తన హవా ఇంకా కొనసాగుతుందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు వీటిని మోడీ వాడుకున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు మోదీ ప్లాన్‌ ...

20 May 2019

యూపీఏ భేటీకి బీటలు

యూపీఏ భేటీకి బీటలు

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వైపు ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుంటే సమావేశానికి ఒక్కో పార్టీ హ్యాండ్‌ ఇస్తోంది. బీజేపీయేతర పార్టీల సమావేశానికి ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి రావడం లేదని ఆ పార్టీ ప్రకటించగా తాజాగా డీఎంకే ...

20 May 2019

గెలుపు ఓటముల్లో కీలకం కానున్న పోస్టల్ బ్...

గెలుపు ఓటముల్లో కీలకం కానున్న పోస్టల్ బ్యాలెట్స్.....

నువ్వానేనా అన్న స్థాయిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై అభ్యర్ధులు ధీమా వ్యక్తం చేస్తుండగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎవరికి పడ్డాయన్నది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఎంత మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకున్నారు ఎటు మొగ్గు చూపారు అభ్యర్ధుల తలరాతను మార్చే విధంగా తీర్పు ఉంటుందా అన్న చర్చ జోరుగ...

20 May 2019

జనసేన ఆశలపై నీళ్లు జల్లిన సర్వేలు.. పవన్...

జనసేన ఆశలపై నీళ్లు జల్లిన సర్వేలు.. పవన్ కళ్యాణ్ ప...

సార్వత్రిక ఎన్నికల తుది విడత పోలింగ్ ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ వెలువడిన విషయం తెలిసిందే. ప్రజలు ఎప్పుడెప్పుడా అని తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసి ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్. అయితే ఏపీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు భిన్నంగా వచ్చాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు హోరాహోరిగా పోటి పడ్డాయి అందులో వైసీ...

20 May 2019

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభంజనం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభంజనం

ఆంధ‌్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభంజనం ఖాయమని మెజారిటీ జాతీయ ఛానెళ్లు, సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌‌‌ అంచనా వేశాయి. ఊహించినదానికంటే అత్యధిక స్థానాలు వైసీపీకి రాబోతున్నాయని వెల్లడించాయి. ఏపీకి కాబోయే సీఎం జగన్‌ అంటూ అత్యధిక ఎగ్జ...

20 May 2019