'118' మూవీ రివ్యూ

'118' మూవీ రివ్యూ

చిత్రం: 118 నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, షాలిని పాండే, నివేద థామస్, ప్రభాస్ సీను, రాజీవ్ కనకాల, నాజర్ తదితరులు సంగీతం: శేఖర్ చంద్ర ఛాయాగ్రహణం: కేవీ గుహన్ ఎడిటింగ్‌: తమ్మిరాజు నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు దర్శకత్వం: కేవీ గుహన్ బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ విడుదల తేదీ: 01/03/2019

ఈ మధ్యకాలంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఒక మంచి హిట్ అందుకొని చాలా రోజులైంది. చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ ప్రేమకథతో 'నా నువ్వే' అనే సినిమాతో మన ముందుకు వచ్చిన కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించలేక పోయాడు. ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లో రెండు భాగాలలో తన తండ్రి ఎన్టీఆర్ హరికృష్ణ పాత్రను పోషించిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు మళ్ళీ హీరోగా '118' సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ ఈ సినిమాతో తెలుగులో దర్శకుడిగా మారాడు. మహేష్ ఎస్ కోనేరు ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా ను నిర్మించారు. 'అర్జున్ రెడ్డి' ఫేమ్ శాలిని పాండే మరియు నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య ఇవాళ అనగా మార్చి ఒకటవ తేదీన విడుదలైన. ఈ సినిమా పై నందమూరి అభిమానులు మాత్రమే కాక కళ్యాణ్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పించిందో చూసేద్దామా.

కథ: గౌతమ్ (కల్యాణ్ రామ్) ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు. అన్యాయాలను, అక్రమాలను ఎదిరించడం అంటే మహా ఇష్టం అతనికి. మేఘా (షాలిని పాండే)ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే ప్రతీ పౌర్ణమి రోజున ఆద్య (నివేదా థామస్) అనే అమ్మాయి దాడికి గురైనట్టు గౌతమ్ కి కల వస్తూ ఉంటుంది. కలలో కనిపించిన ఆ అమ్మాయి ఉన్న ప్రాంతాలు గౌతమ్‌కు నిజ జీవితంలో కూడా తారసపడుతాయి. దాంతో ఆద్య నిజంగానే ఉందని అనుకుని తన కోసం వెతుకులాట మొదలుపెడుతాడు. ఆ క్రమంలో కొన్ని భయంకర నిజాలు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఉంటాడు గౌతమ్. ఆద్య నిజంగానే గౌతమ్ కి తారసపడిందా? ఒకవేళ కలిస్తే ఆద్యను గౌతమ్ ఎలా కలుసుకున్నారు? ఆద్య మీద దాడి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? ఆద్య కోసం వెతికే క్రమంలో గౌతమ్ కలిసే ప్రతీ వ్యక్తి ఎందుకు చనిపోతారు? చివరికి ఆద్యకు ఎం జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే '118' సినిమా తెరపై చూడాల్సిందే.

నటీనటులు: ఈ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ నటన అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాకి కళ్యాణ్ రామ్ నటన హైలైట్ గా మారింది. రొమాంటిక్ సన్నివేశాల్లో నే కాకా యాక్షన్ సన్నివేశాల్లో కళ్యాణ్ రామ్ నటించిన విధానం అందర్నీ మెప్పిస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ యాక్షన్ సన్నివేశంలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు అని చెప్పుకోవచ్చు. కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కళ్యాణ్ రామ్ ఏమాత్రం బోర్ కొట్టించకుండా కథను ముందుకు తీసుకు వెళ్ళాడు. హీరోయిన్లు ఇద్దరూ సినిమాకు సరిగ్గా సూటయ్యారు. శాలిని పాండే సీన్లు తక్కువే అయినప్పటికీ ఆమె నటన చాలా బాగా వచ్చింది. కళ్యాణ్ రామ్ తో సన్నివేశాలు చాలా బాగుంటాయి. నివేదాథామస్ కు ఈ సినిమాలో పర్ఫామెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. ఈ అవకాశాన్ని ఏ మాత్రం వృధా కానివ్వకుండా నివేదాథామస్ తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ను కనబరిచింది. ఈ సినిమాలో ఆమె నటన కచ్చితంగా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. సినిమా మొత్తం దాదాపు అన్ని సీన్ల లో కళ్యాణ్ రామ్ పక్కనే ఉంటూ ప్రభాస్ సీను నటన చాలా బాగుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు చాలా మంచి పాత్ర దక్కింది. డాక్టర్గా నాజర్ నటన సినిమాలో సినిమాకు మరింత బలాన్ని చేకూర్చింది. ఎప్పటిలాగానే రాజీవ్ కనకాలకు ఈ సినిమాలో కూడా ఒక ఆసక్తికరమైన పాత్ర లభించింది. రాజీవ్ కనకాల కూడా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. మిగతా నటీనటులు కూడా తమకున్న స్కోప్ లో బాగానే నటించారు. సాంకేతిక వర్గం: ఈ సినిమాలో దర్శకుడు కె.వి గుహన్ కథకు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. కొత్తగా మరియు ఆసక్తికరంగా రచించారు కె.వి.గుహన్. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు ప్రేక్షకులలో ఆసక్తిని మెయింటెన్ చేయడం అంత సులువైన విషయం కాదు కానీ '118' సినిమాతో దీన్ని సాధించారు గుహన్. ఎక్కడా బోరు కొట్టకుండా కొత్తగా మరియు ఆసక్తికరంగా కథను తీర్చిదిద్దిన విధానం సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. కథలో ఎన్ని ట్విస్టులు ఉన్నప్పటికీ అందరికీ అర్థమయ్యే విధంగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడిగా మాత్రమే కాక సినిమాటోగ్రాఫర్ గా కూడా ఈ సినిమాలో తన పనితనాన్ని కనబరిచారు. ఈ సినిమాలో విజువల్స్ చాలా బాగా వచ్చాయి అంటే దానికి కారణం గుహన్ అని చెప్పుకోవచ్చు. మహేష్ ఎస్ కోనేరు అందించిన నిర్మాణ విలువలు సినిమాకు బాగా పనికొచ్చాయి. శేఖర్ చంద్ర అందించిన సంగీతం ఈ సినిమాకి బాగానే సెట్ అయింది. తమ్మిరాజు ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. బలాలు: నివేదా థామస్ పెర్ఫార్మెన్స్ కల్యాణ్ రామ్ నటన సినిమాటోగ్రఫి ప్రొడక్షన్ వ్యాల్యూస్ బలహీనతలు బలమైన కథ లేకపోవడం కథనం స్లో నేరేషన్ చివరి మాట: రొటీన్‌ ఫార్ములా కు భిన్నంగా ఓ సస్పెన్స్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కేవీ గుహన్. ఆసక్తికరమైన పాయింట్‌ తో సినిమాను మొదలుపెట్టి తన ఎంగేజింగ్‌ స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు. అనవసరమైన సన్నివేశాలను హైలైట్ చేయకుండా సినిమా అంతా ఓకె మూడ్‌లో సాగుతుంది. ఫస్ట్‌ హాఫ్ ఫాస్ట్ గా థ్రిల్లింగ్‌ సీన్స్‌తో గడిచిపోగా, ద్వితీయార్థంలో కాస్త స్లో చేశాడు గుహన్. అయితే ప్రీ క్లైమాక్స్‌ లో కొంచెం లాజిక్‌ను పక్కన పెట్టినట్టు అనిపించింది. బాటమ్ లైన్: '118' అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే థ్రిల్లర్.



PostedOn: 21 Mar 2019 Total Views: 176




సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమ...

సీఎం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేష్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్ నియమితులయ్యారు. అలాగే, ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్‌ సలహాదారుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరి నియామక...

07 Jun 2019

నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్

నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్

నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ గ్రామ వాలంటీర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల మొత్తం 4 లక్షల ఉద్యోగాలు అర్హత:10వ తరగతి 18 నుంచి 39 ఏళ్లలోపువారు అర్హులు జులై ఆఖరిలోపు దరఖాస్తులు అప్లికేషన్‌కు ఎలాంటి ఫీజు లేదు ఆగస్టు 15 లోపు ఫలితాల వెల్లడి

07 Jun 2019

మరో కీలక పధకం అమలు దిశగా సీఎం జగన్ ..

మరో కీలక పధకం అమలు దిశగా సీఎం జగన్ ..

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా కొన్ని రోజుల కిందట ప్రమాణస్వీకారం చేసిన జగన్ తన పాలనలో తనదైన మార్క్ ని చూపిస్తున్నారు .. ఇప్పటికే పలు పధకాల అమలుకు శ్రీకారం చుట్టిన అయన మరో పధకాన్ని అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నారు .. త్వరలో గ్రామ వాలంటీర్లును నియమించనున్నట్లు అయన ఇంతకు ముందే తెలిపారు . అయితే వారి...

07 Jun 2019

చంద్రబాబు విమానం దారి మళ్లింపు

చంద్రబాబు విమానం దారి మళ్లింపు

ప్రతికూల వాతావరణం నేపథ్యంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విమానాన్ని దారి మళ్లించారు. రాత్రి 7.20కి విజయవాడ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో రాత్రి 9.20కి చంద్రబాబు ప్రయాణిస్తున్న విమానం బెంగళూరు చేరుకుంది. ప్రస్తుతం వాతావరణం అనుకూలించడంత...

07 Jun 2019

అక్కడా.. మాటలూ, మాట్లాడుకోవడాలూ లేవ్!

అక్కడా.. మాటలూ, మాట్లాడుకోవడాలూ లేవ్!

ఈ నెల 13 , 14 తేదీల్లో కిర్గిస్తాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్తాన్ పీఎం ఇమ్రాన్ ఖాన్ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇద్దరి మధ్యా ప్రత్యేకంగా భేటీ ఉంటుందని ఇంతవరకూ అందరూ అనుకున్నారు. అయితే, ఈ సమావేశంలో వారిద్దరూ అధికారికంగా భేటీ...

07 Jun 2019

రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్లకు సీఎం...

రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరుముట్లకు సీఎం పిలుపు!

మంత్రివర్గ కూర్పుపై ముఖ్యమంత్రి వై ఎస్ జగన్‌ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. శనివారం మంత్రివర్గం ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో కేబినెట్‌లో ఎవరెవరికి చోటు కల్పించాలన్న అంశంపై దాదాపు స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పదహారు మంది ఎమ్మెల్యేలకు మంత్రి మండలిలో చోటు దక్కుతుందని ప్రచారం జ...

06 Jun 2019

ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌బాబు అరెస్టు

ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌బాబు అరెస్టు

సీఎల్పీని తెరాసలో విలీనం చేసే ప్రక్రియను తీవ్రంగా నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో నిరసన చేపట్టిన కాంగ్రెస్‌ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. సీఎల్పీ విలీనం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవడాన్ని నిరసిస్తూ పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు,...

06 Jun 2019

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు: సీ...

కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది ఉండొద్దు: సీఎం జగన్‌

కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ గమనించారు. తన పర్యటనలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం వైఎస్‌ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయానికి వెళ్లినప్పుడు కాన్వాయ్ వలన ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని వైఎస్‌ జగన్ గమనించారు. దీంతో ఎయిర్&zw...

06 Jun 2019