బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

బాబుది బీసీలను అణగదొక్కే రాజకీయం

చంద్రబాబు బీసీల గర్జన అంటూనే బీసీలను రాజకీయంగా అణగదొక్కేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ జగన్‌ నివాసంలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ కాండ్రు కుటుంబ సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు ఎన్నో అబద్ధాలు చెబుతున్నారన్నారు. బీసీలను అణగదొక్కుతూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి పక్కనబెట్టి కుటుంబ అభివృద్ధి కోసం చంద్రబాబు పాలన చేస్తున్నాడన్నారు. మంగళగిరి టికెట్‌ బీసీలకు ఇస్తామని చెప్పి వంచించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన మోసాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీని వీడి వైయస్‌ఆర్‌ సీపీలో చేరడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలందరూ అప్రమత్తం కావాలని, వంచన చేస్తున్న చంద్రబాబును ఓడించాలని కోరారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యం మళ్లీ చూడొచ్చనే ఉద్దేశంతో పార్టీలో చేరడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లాలో వైయస్‌ జగన్‌ ముగ్గురు మహిళలను బరిలోకి దించితే.. చంద్రబాబు మాత్రం ఒకే సామాజికవర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. 

టికెట్‌ ఇస్తానని మోసం చేశారు..: షోకత్‌

టికెట్‌ ఇస్తానని చంద్రబాబు, గల్లా జయదేవ్‌ మోసం చేశారని టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్‌ టికెట్‌ ఆశించి భంగపడిన షోకత్‌ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో షోకత్‌ వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం షోకత్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. మైనార్టీలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వైయస్‌ఆర్‌ సీపీ గుంటూరు ఈస్ట్‌ అభ్యర్థి ముస్తఫా, వెస్ట్‌ యేసురత్నం, గుంటూరు ఎంపీ మోదుగులను గెలిపించేందుకు కృషి చేస్తానన్నారు. 


PostedOn: 21 Mar 2019 Total Views: 85




ఆపార్టీపై జనంలో నమ్మకం పోయింది.. ఇక గూలా...

ఆపార్టీపై జనంలో నమ్మకం పోయింది.. ఇక గూలాబీకి ప్రత్...

తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది రెవెన్యూ అధికారులా లేక టీఆర్ఎస్ నాయకులా అని ప్రశ్నించారు బీజేపీ నేత డీకే అరుణ. నల్లగొండ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. చట్టాల్లో మార్పు కోసం తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంసరైంది కాదని హితవుపలికారు. కేవలం ఓటమి భయంతోనే పార్లమెంట్ ఎన...

20 Apr 2019

చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్ష...

చంద్రబాబుకు జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు

69వ పుట్టిన రోజు జరుపుకుంటున్న ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన శుభకాంక్షలు తెలియజేశారు. ఇక చంద్రబాబు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. విజయవాడలో పార్టీ నేత గోనుగ...

20 Apr 2019

బాబుకు ఆర్జీవీ వినూత్నంగా పుట్టినరోజు శు...

బాబుకు ఆర్జీవీ వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ సీఎం చంద్రబాబుకు వినూత్నంగా పుట్టిన రోజు శుభకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా టీఆర్ఎస్ అధినేతపై తాను రూపొందిస్తున్న టైగర్ కేసీఆర్ చిత్ర ఫస్ట్ లుక్‌ను చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఈ మేరకు తాను చ...

20 Apr 2019

దమ్ముంటే..ఆ 40 మంది పేర్లు బయట పెట్టు: జ...

దమ్ముంటే..ఆ 40 మంది పేర్లు బయట పెట్టు: జగన్‌కు దేవ...

ఒకే సామాజిక వర్గానికి చెందిన డీఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చారన్న జగన్ ఆరోపణలకు మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు. ప్రమోషన్లు పొందిన 40 మంది డీఎస్పీల వివరాలు బయటపెట్టాలని జగన్‌కు సవాల్ విసిరారు. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. దుర్మర్గంగా ప్రభుత్వంపై బురద ...

17 Apr 2019

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు

కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై కేసు న‌మోదు

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై బంజారాహిల్స్‌ పీఎస్‌లో కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ డబ్బు వ్యవహారంలో సందీప్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఎస్‌ఐని బంధించి చిత్ర హింసలకు గురిచేశారన్న ఆరోపణలపై ఐపీసీ 332, 342, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస...

16 Apr 2019

పోలవరం పనుల్లోఅపశ్రుతులు .రాడ్డు మీదపడిక...

పోలవరం పనుల్లోఅపశ్రుతులు .రాడ్డు మీదపడికార్మికుడు ...

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతంలో గేట్లు అమర్చే సమయంలో ప్రమాదవశాత్తు ఒక కార్మికుడు మృతిచెందాడు. మరో కార్మికుడు తీవ్రగాయాలతో రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాజెక్టు స్పిల్‌వే 32వ బ్లాక్‌లో సోమవారం ఉదయం గేట్ల పనులు జరుగుతున్నాయి. క్రేన్‌ సహాయంతో గేట్లు ది...

16 Apr 2019

గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

గవర్నర్‌ను కలిసిన వైఎస్‌ జగన్‌

తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడువైఎస్‌ జగన్‌‌‌మోహన్‌రెడ్డికలిశారు. ఆయన సారథ్యంలోని పార్టీ ప్రతినిధి వర్గం మంగళవారం ఉదయం 11గంటల ప్రాంతంలో గవర్నర్‌ను హైదరాబాద్‌లోని ర...

16 Apr 2019

టీడీపీ ఆఫీస్ కు టూలెట్ బోర్డు ఖాయం

టీడీపీ ఆఫీస్ కు టూలెట్ బోర్డు ఖాయం

‘‘తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కు ఇప్పటికే తాళం పడింది. అమరావతిలో కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు తాళం వేయడమే కాదు.. టూలెట్‌ బోర్డు వేసుకోవడం ఖాయం’’ అని మాజీ ఎమ్మెల్సీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెహమాన్ అన్నారు. కొన్ని దుష్ట శక్తులు వైఎస్సార్‌ కు...

16 Apr 2019