అవిశ్వాసంపై చర్చ లేకుండా సభ వాయిదా!

అవిశ్వాసంపై చర్చ లేకుండా సభ వాయిదా!

కేంద్ర ప్రభుత్వంపై తమకు నమ్మకం పోయిందంటూ వచ్చిన అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని, వాటిపై చర్చించాలని తనకు ఉన్నప్పటికీ, సభ ఆర్డర్ లో లేదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వ్యాఖ్యానించారు. సభలో చర్చకు సానుకూల పరిస్థితి ఉన్నట్టు తనకు కనిపించడం లేదని, అందువల్లే అవిశ్వాసంపై చర్చ చేపట్టలేకపోతున్నానని అన్నారు. అన్ని పార్టీల సభ్యులూ ఇలా పోడియంలో నిరసనలు తెలుపుతూ నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లో తాను మాత్రం ఏం చేయగలనని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, టీడీపీ సభ్యుడు తోట నర్సిహం నోటీసులు ఇచ్చారని, వాటిని తాను స్వీకరించానని చెప్పిన సుమిత్రా మహాజన్, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సోమవారానికి సభను వాయిదా వేయాల్సి ఉంటుందన్నారు. సభ సజావుగా ఉంటేనే అవిశ్వాస తీర్మానాలను పరిగణనలోకి తీసుకుంటానని హెచ్చరించిన ఆమె, సభ్యులు ఎంతకూ సర్దుకోకపోవడంతో సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 


PostedOn: 16 Mar 2018 Total Views: 65
నేను పుట్టింది ఇక్కడే.. చచ్చేది ఇక్కడే.....

నేను పుట్టింది ఇక్కడే.. చచ్చేది ఇక్కడే..!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి శైలజానాథ్ ఈరోజు భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీపై మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన స్పందించారు. నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌స్య‌లు, త‌న వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల&zwnj...

18 Jul 2018

అవిశ్వాసానికి కేంద్రం సై!

అవిశ్వాసానికి కేంద్రం సై!

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అందిందని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. టీడీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని 10 రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అవిశ్వాసానికి ఎంతమంది ఎంపీల...

18 Jul 2018

జగన్ కి జన నీరాజనం!

జగన్ కి జన నీరాజనం!

ఒక పక్క వర్షాలు వస్తున్నా జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు జనాదరణ తగ్గడం లేదు. వేలాదిగా ప్రజలు తన వెంటరాగా వైసిపి చీఫ్ జగన్ కాకినాడ రూరల్ ప్రాంతానికి చేరుకున్నారు. అనపర్తి నియోజకవర్గంలో ప్రజలు జగన్ కి జన నీరాజనమే పట్టారు. అదే ఊపులో ఆయన జిల్లాలో కీలకమైన కాకినాడ రూరల్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయిపోయారు. కొవ్...

18 Jul 2018

విశాఖ మహిళా నేతలు మళ్ళీ గెలుస్తారా?

విశాఖ మహిళా నేతలు మళ్ళీ గెలుస్తారా?

ఇక్కడ కనిపిస్తున్న ముగ్గురు మహిళల్లో ఒకరు అరకు ఎంపీ కొత్తపల్లి గీత. మరొకరు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. ఇంకొకరు.. వంగలపూడి అనిత. వీరి ముగ్గురికి ఓ సారూప్యత ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఈ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే. ఎంతోకష్టపడి ప్రభుత్వ కొలువు సంపాదించి.. ఏళ్ల తరబడి సేవలు అందించారు. 2014లో అనూహ్య...

17 Jul 2018

ఇష్టం లేకపోయినా పవన్ పిలిచినప్పుడు వెళ్ల...

ఇష్టం లేకపోయినా పవన్ పిలిచినప్పుడు వెళ్లా..!

సీఎం చంద్రబాబుతో ప్రముఖ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ నిన్న సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సమావేశం గురించి మరిన్ని విషయాలను తాజాగా ఆయన ప్రస్తావించారు. ఉండవల్లి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, నిన్నటి భేటీలో ఎలాంటి రాజకీయాంశాలు తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. చంద్రబాబుతో భేటీ అయ్యానని జగన్ అభిమానులు ఏమ...

17 Jul 2018

కంభంపాటికి ఐస్ ఫ్రూట్ తెచ్చిన ‘తంటా’..!

కంభంపాటికి ఐస్ ఫ్రూట్ తెచ్చిన ‘తంటా’..!

వ్యాపారం చేయటం తప్పే కాదు.. కానీ.. కంభంపాటి మాదిరి చేయకూడదన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. కంభంపాటి నేతగా సుపరిచితుడు కానీ.. ఆయన పెద్ద వ్యాపారవేత్త అన్న విషయం సామాన్యులకు పెద్దగా తెలీని విషయం. శ్రీజయలక్ష్మి ఆటోమోటివ్స్ కు ఎండీగా వ్యవహరించే కంభంపాటి.. నివాసిత ప్రాంతం లో ఎలాంటి అనుమతులు లేకుండా కార్ల...

17 Jul 2018

పెద్దబాబుకు ఇంగ్లీష్ రాదు.. చినబాబుకు తె...

పెద్దబాబుకు ఇంగ్లీష్ రాదు.. చినబాబుకు తెలుగు రాదు!

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అప్పుడే రంగంలోకి దిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు వారి వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారని… రాష్ట్ర ప్రయోజనాలు వారికి అవసరం లేదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇంగ్లీష్ రాద...

17 Jul 2018

జగన్, పవన్‌లకు లోకేష్ చురకలు!

జగన్, పవన్‌లకు లోకేష్ చురకలు!

తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి నారా లోకేష్ మరోసారి స్పందించారు. తనపై ఆరోపణలు చేశారు కానీ, ఆధారాలు చూపమంటే మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని అన్నారు. ఆధారాలతో ముందుకు వస్తే తన తప్పు కూడా తెలుసుకుంటానని వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ...

17 Jul 2018