Friday, June 9, 2023

ట్యూషన్స్ చెప్పే స్థాయి నుంచి కోట్లకు అధిపతి… సక్సెస్ అంటే ఈమెదే గురూ!

Must Read

ట్యూషన్స్ చెప్పే స్థాయి నుంచి కోట్లకు అధిపతి… సక్సెస్ అంటే ఈమెదే గురూ!

అనుకుంటే కాని పని అంటూ ఏదీ ఉండదు. దృఢంగా నిశ్చయించుకుంటే ఏదైనా సాధించొచ్చు. చిత్తశుద్ధి, ఆత్మవిశ్వాసం, సాధించాలనే సంకల్పం ఉంటే అసంభవమనేది ఏదీ ఉండదంటారు. ఈ మాటలకు రూపం పోస్తే పోస్తే అదే ‘త్రినా దాస్’ అని చెప్పొచ్చు. పై మాటలకు ఊరికే ఉపయోగించలేదు. పిల్లలకు ట్యూషన్ చెప్పే స్థాయి నుంచి ఈ రోజు ఎంతోమందికి ఉద్యోగాలు కల్పిస్తూ కోట్లకు అధిపతి అయ్యారు త్రినా దాస్. ఆమె సాధించిన విజయాలకు, ఎదిగిన తీరుకు పైవ్యాఖ్యలు సరిగ్గా సరిపోతాయి. అసలు ఎవరీ త్రినా దాస్? ఆమె విజయగాథ ఏంటో తెలుసుకుందాం..

పశ్చిమ బెంగాల్‌లో జన్మించిన త్రినా దాస్కు మొదటి నుంచి తాను వ్యాపారవేత్త కావాలని ఉండేది. ప్రపంచంలో మార్పులు తీసుకొచ్చేందుకు తప్పకుండా తనవంతుగా కృషి చేయాలని ఆమె కలలు కనేవారు. ఈ రోజు ఆ స్వప్నాన్ని నిజం చేసుకున్నారు. కోల్‌కతాలోని బల్లిగంజ్ శిక్షా సదన్‌లో త్రినా దాస్ ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేశారు. బెంగాల్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్‌లో ఆమె ఇంజినీరింగ్ చదివారు. అప్పట్లో పాకెట్ మనీ కోసం ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్ చెప్పేవారు త్రినా. ఆ తర్వాత తన తండ్రి కోరిక మేరకు 16 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఇందుకోసం ఒక్కొక్కరి దగ్గర కేవలం రూ. 400 ఫీజు మాత్రమే తీసుకునేవారు.

ఫ్రాంచైజ్ మోడల్‌తో సక్సెస్

16 మందితో ప్రారంభమైన ట్యూషన్ కాస్తా ఏడాది ఆఖరు నాటికి 1,800కి చేరింది. అనంతరం ఆ పిల్లలకు వసతులు కల్పిస్తూ ఆమెకు సహాయంగా మరికొంతమంది అధ్యాపకులను నియమించుకున్నారు త్రినా దాస్. తద్వారా ఏడాదికి రూ. 8 నుంచి 10 లక్షలు సంపాదించారు. అతి తక్కువ కాలంలోనే ఆమె సక్సెస్ అయ్యారు. ఏకంగా ఫ్రాంచైజ్ మోడల్ ద్వారా 86 కోచింగ్ సెంటర్లను మొదలుపెట్టి.. 2014-15 నాటికి రూ. 5 కోట్లు ఆర్జించారు త్రినా దాస్.

ఆ జాబ్స్‌పై దృష్టి

ఆ తర్వాత 2017లో తన ఇద్దరు మిత్రులైన నీరజ్ దహియా, అరుణ్ సెహ్రావత్‌తో కలసి టాలెంట్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ అనే సంస్థను త్రినా దాస్ ప్రారంభించారు. దీని ద్వారా ఒక ఏడాదిలో ఏకంగా రూ. 20 కోట్లు సంపాదించారు. ఫస్ట్ లాక్‌డౌన్ సమయంలో వారు బ్లూ కాలర్ జాబ్స్ మీద దృష్టి సారించి.. ఉద్యోగాలు కోల్పోయిన వారికి గుర్గావ్, ఢిల్లీలోని అనేక సంస్థలకు సెక్యూరిటీ వర్కర్లు, డెలివరీ బాయ్స్, ఆఫీస్ వర్కర్స్ను అందించడం మొదలుపెట్టారు. దీంతో దాదాపు 6 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించారు.

ఒబామా నుంచి ప్రశంసలు

ఏటికేడు త్రినా దాస్ ఎదుగుతూ పోయారు. 2022 ఏప్రిల్లో ఉద్యోగులకు జాబ్స్ అందించడం కంటే.. కంపెనీలకు ఉద్యోగులను అందించాలని త్రినా దాస్ నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ఎంప్లాయీస్ మంచి జీతం, హోదా పొందొచ్చని ఆమె ఆశించారు. అందుకోసం గిగ్‌చెయిన్ను మొదలుపెట్టి.. వివిధ సంస్థలకు ఉద్యోగులను అందించారు. ప్రస్తుతం ఆమె ఏడాది టర్నోవర్ రూ.102 కోట్లు. ఇక, 2012లో బరాక్ ఒబామా నుంచి ప్రశంసలు అందుకున్నారు త్రినా దాస్. దీంతో ఆమెకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. 2021లో తోటి వ్యాపారవేత్తను ఆమె వివాహం చేసుకున్నారు. మొత్తానికి త్రినా అనుకున్న దాని కంటే ఎక్కువగా విజయాలు సాధించి సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా నిలిచారు.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

- Advertisement -
Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -