Friday, June 2, 2023

నిఫ్టీ అసలు నిర్వచనం ఇదే..

Must Read

బిజినెస్ ట్రేడింగ్ అనగానే మనకు గుర్తొచ్చేది నిఫ్టీ. కానీ నిఫ్టీ అంటే ఏంటో అందరికీ పూర్తి స్థాయిలో తెలియదు. ఎప్పుడు విన్నా కొత్తగానే ఉంటుంది. ఈ ఆర్టికల్ ద్వారా నిఫ్టీ అంటే ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకుందాం. నిఫ్టీ అనేది నేషనల్ స్టాక్ ఎక్సేంజ్(NSE), ఫిఫ్టీ(50) అనే పదాల కలయిక వల్ల వచ్చింది. ఇది దేశంలోని 50 అత్యుత్తమ పనితీరు గల ఈక్విటీ స్టాక్ లను ప్రదర్శిస్తుంది. ఇది జాతీయ స్టాక్ ఎక్సేంజ్ మెయిన్ బెంచ్ మార్క్ సూచిక.
నిఫ్టీ ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పునర్ నిర్మించబడుతుంది. ఆ సమయంలో కంపెనీల్లోని తాజా స్టాక్స్, అమ్మకాలు, కొనుగోళ్లను పరిశీలిస్తుంది. షేర్లు అర్హతా ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నాయో? లేవో? తనిఖీలు చేస్తుంది. ఇండెక్స్ నిర్వాహకులు పాత స్టాక్ లను బెంచ్ మార్క్ నుంచి తీసేస్తారు. లేదా కొత్త స్టాకుల్లో చేరుస్తారు. ఇందుకోసం నిఫ్టీ పునర్ నిర్మాణానికి 4 వారాల ముందు కంపెనీలతో చర్చలు జరుపుతుంది.

నిఫ్టీలో అర్హత సంపాదించాలంటే..

  • సదరు కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ లో రిజిస్టర్ అయి ఉండాలి.
  • ఆరు నెలల్లో కంపెనీ ట్రేడింగ్ ఫ్రీక్వెన్సీ 100 శాతం ఉండాలి.
  • కంపెనీకి మూలధనం మార్కెట్ మూలధనం సూచికలోని అతి చిన్న కంపెనీ కంటే 1.5 రెట్లు ఎక్కువగా ఉండాలి.
  • డిఫరెన్షియల్ ఓటింగ్ హక్కులతో షేర్ లను కలిగి ఉన్న కంపెనీలు కూడా నిఫ్టీలో భాగం కావొచ్చు.

నిఫ్టీ ఫార్ములా:

సూచిక వాల్యూ = ప్రజెంట్ మార్కెట్ వాల్యూ / (1000* మార్కెట్ మూలధనం)

నోట్: ఈ సూత్రం ఒక్కటే నిఫ్టీని లెక్కించలేదు. కంపెనీ విధానాలలో మార్పులు, స్టాక్ స్పిల్ట్స్, రైట్స్ ఇన్సూరెన్స్ వంటి మరిన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

సూచీలు స్టాక్ మార్కెట్ దిశను సూచిస్తాయా?

మన స్టాక్ మార్కెట్లో ప్రతి రోజూ 7వేల వరకు కంపెనీలు ట్రేడవుతున్నాయి. అన్ని కంపెనీలు పరిగణనలోకి తీసుకుని స్టాక్ లెక్కించాలంటే ఎంతో కష్టతరం అవుతుంది. అందుకే ఈ ఏడు వేల కంపెనీల్లోని ప్రముఖ కంపెనీలను తీసుకుని వాటి షేర్లను లెక్కిస్తారు. వెయిటేడ్ సగటు (weighted average) తీసి సూచీ విలువను లెక్కగడతారు.

వెయిటేడ్ సగటు ఎందుకు?

అన్ని కంపెనీలూ ఒకే మార్కెట్ విలువను కలిగి ఉండవు. అందుకే కంపెనీల విలువ ప్రకారం కంపెనీలకు వెయిట్ ఇచ్చి వెయిటేడ్ సగటుతో సూచీ తయారు చేస్తారు. ఇలా నిఫ్టీలోని 50 కంపెనీలు దాదాపు 13 వ్యాపార రంగాల నుంచి ఉన్నాయి.

సూచీలు ఎలా పెరుగుతాయి? ఎలా తగ్గుతాయి?

Example: నిఫ్టీలోని 50 కంపెనీల్లో అతిపెద్ద 10 కంపెనీలకు సూచీలో వెయిటేజీ 45% ఉందనుకుందాం. అయితే ఒకానొక రోజు ఈ 10 కంపెనీలన్నీ ఒక్కొక్కటీ ఒక్క శాతం చొప్పున పెరిగాయనుకుందాం. మిగిలిన 40 కంపెనీలు నిన్నటి ముగింపు ధరతో కంపేర్ చేస్తే అలా ఉందని అనుకుందాం. అంటే వాటి పెరుగుదల ఈ రోజు 0శాతం అన్నమాట. అప్పుడు మన సూచీ ఈరోజు వెయిటేడ్ సగటు ప్రకారం 0.45శాతానికి పెరుగుతుంది.

ఇంకొక ఉదాహరణ ద్వారా పూర్తిగా దీని గురించి తెలుసుకుందాం.. విప్రో కంపెనీ సూచీలో 10 శాతం వెయిటేటీ ఉందని భావిద్దాం. అయితే మిగతా 49 కంపెనీలు ఒకరోజు పెరగకుండా ఉండి విప్రో మాత్రం ఆ రోజు 10 శాతం పెరిగింది అనుకుందాం. విప్రో షేర్ వెయిటేజీ 10 శాతం కాబట్టి సూచి 10శాతంలో 10శాతం అంటే 1 శాతం సూచీ పెరుగుతుంది. ఇదేవిధంగా కంపెనీల షేర్ల ధరలు తగ్గినప్పుడు వాటి వెయిటేజీ ప్రకారం సూచీ నికర విలువ తగ్గుతుంది.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
- Advertisement -
Latest News

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..!

చౌక ధరలో మడతపెట్టగలిగే ఫ్యాన్.. ఫీచర్స్ ఇవే..! వేసవికాలం అలా మొదలైందో లేదో సూర్యుడు భగభగమంటున్నాడు. రోజరోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఎండల బాధకు ప్రజలు విలవిలలాడుతున్నారు. మధ్యాహ్నం...
- Advertisement -

More Articles Like This

- Advertisement -