కేసుల్లో ఏపీకి ఏ మాత్రం పోలిక లేనట్లుగా తెలంగాణ?

కేసుల్లో ఏపీకి ఏ మాత్రం పోలిక లేనట్లుగా ...

కరోనా వేళ..అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు తాజా పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ బులిటెన్ ను విడుదల చేస్తుంటాయి. తాజాగా ఈ రోజు (సోమవారం) బులిటెన్ ను విడుదల చేశారు. ఓపక్క మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఓపక్క ఏపీలో పదకొండు వేల వరకు రోజులో కేసులు నమోదు అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అందులో పది.. పన్నెండు శాతానికి మించని రీతిలో కేసులు నమోదు కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఈరోజు విడుదలైన బులిటెన్ ను చూస్తే.. మొత్తం కేసులు 1256 మాత్రమే కావటం గమనార్హం. అదే సమయంలో ఏపీలో 10820 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు భారీగా కేసులు నమోదైన హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇవాల్టి బులిటెన్ ప్రకారం జీహెచ్ఎంసీలో 389 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో పోలిస్తే.. ఏపీలోని ఏ జిల్లాలో అయినా అంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితి. తాజాగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. తెలంగాణను చూసి ఏపీ ఆసూయపడేలా ఉందని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. ఏపీ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర నిలుస్తోంది. ఇప్పుడా రాష్ట్రంలో రోజుకు 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం ఒక్కరోజులో 12.822 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న ఏపీలో 10820 కేసులు నమోదయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రను ఏపీ దాటేస్తుందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. మహారాష్ట్ర.. ఏపీ తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా తమిళనాడు.. కర్ణాటకలు ఉన్నాయి. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆ మధ్య వరకు కేసుల నమోదును పెద్ద ఎత్తున కంట్రోల్ చేసినట్లుగా ప్రశంసలు అందుకున్న కేరళలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేరళ కంటే పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో 859 కేసులు మాత్రమే నమోదు కావటం గమనార్హం. మరణాల విషయంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. తమిళనాడు రెండోస్థానంలో ఉంది. ఈ విషయంలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తెలంగాణలో అతి తక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జగన్ సర్కారు సమర్థవంతంగా కోవిడ్ ను కంట్రోల్ చేస్తున్నట్లుగా చెబుతున్నప్పుడు.. ఆ రాష్ట్రంలో వేలాది కేసులు ఎందుకు నమోదవుతున్నట్లు? ఎక్కడ తప్పు జరుగుతున్నట్లు?


PostedOn: 10 Aug 2020 Total Views: 135
YS Jagan launches Police Seva App, which...

YS Jagan launches Police Seva App, which connects ...

AP Police Seva App: Andhra Pradesh government, which has already brought in several reforms in governance, has embarked on another innovative program. For the first time in the country, the state police department has introduced a new app. Chief Minister YS Jagan Mohan Reddy on Monday unveiled a new...

21 Sep 2020

Emotional daughter of late SI Durgarao s...

Emotional daughter of late SI Durgarao speaks to N...

TDP has held YSRCP responsible for the eventual death of SI Allu Durga Rao. A TDP delegation called on the family members of late SI Allu Durga Rao belonging to West Godavari district. They have expressed their deep condolences to the bereaved family members. TDP National General Secretary Nara Loke...

21 Sep 2020

Caught on Camera: Man washed away in Sar...

Caught on Camera: Man washed away in Saroornagar l...

In a shocking incident, a man who was trying to help a two-wheeler to cross a gushing stream washed away into Saroornagar lake on Sunday night and the incident created panic among the locals. According to the sources, the victim identified as Naveen, a 45-year-old electrician from Tapovan Colony tri...

21 Sep 2020

Andhra Pradesh: Schools to partially reo...

Andhra Pradesh: Schools to partially reopen from t...

After a gap of more than five months due to the Coronavirus pandemic, schools and junior colleges are going to reopen from today in Andhra Pradesh. According to the reports, teachers and lecturers must visit their respective schools and colleges on the first day and from day 2, 50 per cent staff mus...

21 Sep 2020

Australian Judge resigns from Hong Kong ...

Australian Judge resigns from Hong Kong top court

A veteran Australian judge, one of the 14 foreign judges on Hong Kong’s highest court has resigned citing unspecified reasons related to the new national security law imposed by Beijing on the city. It was announced in the government gazette published on Friday. Justice James Spigelman is the first ...

19 Sep 2020

National Education Policy will strengthe...

National Education Policy will strengthen future o...

National Education Policy will strengthen future of youth: President Ram Nath Kovind President Ram Nath Kovind on Saturday said the new National Education Policy (NEP) is a milestone in strengthening the future of youngsters and would also pave the way for the country to become 'Atmanirbhar Bharat'....

19 Sep 2020

MHA asks all states, UTs to ensure unint...

MHA asks all states, UTs to ensure uninterrupted O...

The Home Ministry has asked all the States to ensure free movement of oxygen carrying vehicles without any restriction as medical oxygen is an important prerequisite for managing moderate and severe COVID-19 cases. In a letter to Chief Secretaries of all states and Union Territories, Home Secretary ...

19 Sep 2020

Indian Navy aircraft carrier 'Viraat' to...

Indian Navy aircraft carrier 'Viraat' to begin las...

Viraat, the decommissioned aircraft carrier of the Indian Navy, will begin its last journey today from Mumbai’s Naval Dockyard to Alang in Gujarat, where it will be dismantled. The vessel had served the Indian Navy for 30 years before being decommissioned in 2017. There were attempts to convert 'Vir...

19 Sep 2020