సెలబ్రిటీల విడాకులకు అదే కారణం.. ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్స్!
కాంట్రవర్సీలు క్రియేట్ చేయడంలో ముందుండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి విడాకుల అంశంపై ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సెలబ్రిటీల విడాకుల కేసులు పెరుగుతుండటంపై ఆర్జీవీ స్పందిస్తూ.. పెండ్లి చేసుకున్న చాలా మంది విడిపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, నాలెడ్జ్. ‘మ్యారేజ్ అనేది ఓ లవ్ కిల్లర్ లాంటిది. ఇప్పుడు అందరూ స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటున్నారు. కలిసుంటే సుఖం లేదు.. అందుకే నేనూ విడిపోయా. విడిపోయాను కాబట్టే ఇంత సంతోషంగా ఉన్నాను’ అని ఆర్జీవీ వ్యాఖ్యానించాడు.