Home Health బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా? ఇందులో నిజమెంత?

బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా? ఇందులో నిజమెంత?

0

బీర్లు తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతాయా? ఇందులో నిజమెంత?

మారిన జీవనశైలి వల్ల చాలా మంది కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. మధుమేహం, కిడ్నీలో రాళ్లు లాంటి వ్యాధులు ఇప్పుడు చాలామందిని సతమతం చేస్తున్నాయి. కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయి, వాటి రిస్క్ గురించి చాలా మందిలో సరైన అవగాహన ఉండట్లేదు. వరల్డ్ కిడ్నీ డే (మార్చి 9వ తేదీన) సందర్భంగా ఆన్​లైన్ హెల్త్​కేర్ సేవల సంస్థ ప్రిస్టీన్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో ఆశ్యర్యకరమైన విషయాలు బయటికొచ్చాయి. సర్వేలో అభిప్రాయాలు తెలిపిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు.. బీర్ తాగితే కిడ్నీ స్టోన్స్ తగ్గుతున్నాయని చెప్పారు. సర్వేలో 1,000 మంది వరకు పాల్గొన్నారు.

కిడ్నీ స్టోన్స్ ట్రీట్​మెంట్​ను ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు జాప్యం చేశామని 50 శాతం మంది సర్వేలో చెప్పారు. భారత్​లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయనడానికి నిదర్శనంగా 2021తో పోలిస్తే 2022లో కిడ్నీ సమస్యల కోసం ఆన్ లైన్ అపాయింట్​మెంట్​ తీసుకోవడం 180 శాతానికి పెరిగాయి. వీటిల్లో ఎక్కువ కన్సల్టేషన్లు కిడ్నీ స్టోన్ల కోసమేనని సర్వేలో తేలింది. మహిళలతో పోలిస్తే పురుషుల్లో ఈ సమస్య మూడు రెట్లు అధికంగా ఉంది. కిడ్నీస్టోన్స్​కు డయాబెటిస్ ప్రధాన కారణాలుగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Exit mobile version