Home Lifestyle ఇలా శృంగారంలో పాల్గొంటే మీ పంట పండినట్టే

ఇలా శృంగారంలో పాల్గొంటే మీ పంట పండినట్టే

0
95
sex physiology

మనిషి జీవితంలో శృంగారం అత్యంత కీలకం. కానీ కొన్ని మూఢ నమ్మకాలు, పని ఒత్తిడి వల్ల భార్యాభర్తలు శృంగారంలో సంతృప్తి పొందలేకపోతున్నారు. ఫలితంగా ఇది విడాకుల వరకు దారి తీస్తుంది. కొన్ని సంఘటనలు అక్రమ సంబంధాలకు కూడా దారి తీస్తుంటాయి. ఇలా జరగకూడదు అంటే ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? భార్యభర్తలు శృంగారంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  • భార్యాభర్తలు ప్రతి రోజూ ఒక అరగంట పాటు ఏకాంతంగా మాట్లాడుకోవాలి. ఒకరినొకరు మనసు విప్పి, అభిప్రాయాలు తెలుసుకోవాలి. సెల్ ఫోన్లు పక్కన పెట్టి, ప్రశాంత వాతావరణంలో చర్చించుకోవాలి. దీనివల్ల ఒకరిపై ఒకరికి గౌరవం పెరగడంతో పాటు శృంగార కోరికలు కూడా పెరుగుతాయి.
  • శృంగారం అనేది ఒక చర్య. దీనికి సమయంతో పని లేదు. కానీ కొందరు శృంగారం అనేది రాత్రి సమయంలోనే చేయాలని, పగలు చేస్తే దయ్యాలు వస్తాయంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మాత్రం సరికాదు. భార్యాభర్తలకు ఎప్పుడు కోరికలు కలిగినా శృంగారం చేసుకోవచ్చు. అది వాళ్లకు ఉన్న హక్కు కూడా.
  • బాహ్య సౌందర్యం కొన్నాళ్లకే పరిమితం అవుతుంది. అందుకే భార్యలో అందాన్ని కాకుండా మనసును చూసి శృంగారం చేసినప్పుడే పూర్తి స్థాయిలో సంతృప్తి ఇస్తుంది.
  • భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవాలి. ఒకరి కోరికలు.. ఒకరు తీర్చుకోవాలి. ఒక వేళ తీర్చలేకపోతే.. బలంవంతంగా ఒత్తిడి చేయడం ఏ మాత్రం సరికాదు. దీనివల్ల బంధాలు తెగిపోయి, వారిపై దురాభిప్రాయం వస్తుంది.
  • స్త్రీకి పీరియడ్స్ సమయంలో శృంగారం కావాలని బలవంతపెట్టడం సరికాదు. దాని ద్వారా లేనిపోని రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది.
  • పని ఒత్తిడిని జయించేందుకు రోజూ వ్యాయామం చేయాలి. ఉదయాన్నే లేచి, వాకింగ్ కు వెళ్లాలి. తద్వారా మనిషి ఆరోగ్యంగా ఉండి శృంగారంలో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here